Monday, April 6, 2020

సుద్యుమ్న చేసిన శ్రీ దేవి స్తుతి

సుద్యుమ్న చేసిన శ్రీ దేవి స్తుతి



దివ్యం చ తే భగవతి ప్రథితం స్వరూపం | దృష్టం మయా సకలలోకహితానురూపమ్‌.
వందే త్వదంఘ్రికమలం సురసంఘ సేవ్యం | కామప్రదం జనని ! చాపి విముక్తిదం చ. 41
కో వేత్తి తే%ంబ భువి మర్త్యతను ర్నికామం | ముహ్యంతి యత్ర మునయశ్చ సురాశ్చ సర్వే |
ఐశ్వర్య మేత దఖిలం కీపణే దయాం చ | దృష్ట్వైవ దేవి సకలం కిల విస్మయో మే.
ళంభుర్హరిః కమలజో మఘవా రవిశ్చ విత్తేశ వహ్ని వరుణాః పవనశ్చ సోమః.
జానంతి నైవ వసవో%పి హితే ప్రభావం బుధ్యే త్కథం తవ గుణా నగుణో మనుష్యః. 43
జానాతి విష్ణు రమితద్యుతి రంబ సాక్షాత్‌ త్వాం సాత్త్వికీ ముదధిజాం సకలార్థదాం చ |
కో రాజసీం హర ఉమాం కిల తామసీం త్వాం వేదాంబికే! న తు పునః ఖలు నిర్గుణాం త్వామ్‌. 44
క్వాహం సుమందమతి రప్రతిమప్రభావః క్వాయం తవాతినిపుణోమయి సుప్రదాదః |
జానే భనాని చరితం కరుణాసమేతం య త్సేవకాంశ్చ దయసే త్వయిభావయుక్తాన్‌. 45
వృత స్త్వయా హరి రసౌ వనజేశయాపి నైవాచరత్యపి ముదం మధుసూదనశ్చ |
పాదౌ తవాదిపురుషః కిల పావకేన కృత్వా కరోతి కరోతి చ కరేణ శుభౌ పవిత్రౌ. 46
వాంఛత్వహో హరి రశోక ఇవాతికామం పాదాహతిం ప్రముదితః పురుషః పురాణః |
త్వాం త్వం కరోషి రుషితా ప్రణతం చ పాదే దృష్ట్వా | పతిం సకలదేవనుతం స్మరార్తమ్‌. 47
వక్షఃస్థలే వససి దేవి సదైవ తస్య పర్యంకవ త్సుచరితే విపులేతిశాంతే |
సౌదామనీవ సుఘనే సువిభూషితే చ కిం తేన వాహన మసౌ జగదీశ్వరోపి. 48
త్వం చే జ్జహాసి మధుసూదన మంబ కోపా న్నైవార్చితోపి స భవే త్కిల శక్తిహీనః |
ప్రత్యక్షమేవ పురుషం స్వజనా స్త్యజంతి శాంతం శ్రియోజ్ఘిత మతీవ గుణౖ ర్వియుక్తమ్‌. 49
బ్రహ్మా దయః సురగణా స తు కిం యువత్యో యే త్వత్పదాంబుజ మహర్నిశ మాశ్రయంతి |
మన్యే త్వయైన విహతాః ఖలు తే పుమాంసః కిం వర్ణయామి తవ శక్తి మనంతవీర్యే. 50
త్వం నాపుమా న్న చ పుమా నితి మేవికల్పో యాకాసి దేవి సుగుణా నను నిర్గుణా వా |
తాం త్వాం నమామి సతతం కిల భావయుక్తో వాంఛామి భక్తి మచలాం త్వయి మాతరం తే. 51

భగవతీ! దివ్యమయి విశ్వ ప్రసిద్ధమై అఖిల జగములకు మేలునకనుకూలించు నీ రూపసందర్శన భాగ్యము నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్యచరణములే నాకు శరణములు. నీ పదకమలములు కామ ప్రదములు ముక్తి ప్రదములు. నీ దివ్యస్వరూపము సురలను మునులను మోహింపజేయును. సామాన్య మానవుడెట్లెరుగ గలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనునిపై దయ దలచితివి. ఎల్లకలుములు ప్రసాదించితివి. ఇదంతయు నా కచ్చెరువు గొల్పుచున్నది. హరి, హరుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, రవి, వరుణుడు, పవనుడు, సోముడ, వసువులను వారియందెవ్వరును నీ దివ్యసుగుణ ప్రభావమెఱుగజాలరు. ఇంక గుణహీనుడగు నరుడెట్లు తెలిసికొనగలడు? మహాద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్త్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదాయినియు కడలిపట్టియునగు లచ్చిగనే యెఱుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తిగను రుద్రుడు తామసశక్తి యగు నుమగను దలంతురు. కాని వారును నీ నిర్గుణశక్తి స్వరూపమెఱుగ నేరరు. మందమతియై యల్ప ప్రభావముగలనే నెక్కడ? నాపై ప్రవహించు నీ మధుర దయాపూరమెక్కడ? ఓ భవానీ! నీ మహోజ్జ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతుము. నిన్నెవరు గొలుతురో యా సేవకులపై నీవు దయ గురిపింతువు. పద్మాలయవైన యో పద్మా! నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత తన పదము లొత్తించుకొనుటకు దగనని దలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములనొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదాహతిని గోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్తుడై నీ పదములకు మ్రొక్కినను నీవు రోషమున నతనిని పాదాతాడన మొనర్తువు. నీలాల మేఘమాలలో మెఱుంగు తీగె శోభిల్లును. నీవా విష్ణుని యెడందసెజ్జపై కలకాలము కాంతులీనుదవు. నీకా జగత్పతియును వాహనముగ నయ్యెను గదా! ఒకవేళ నీవు కోపమున నా మధుసూదనుని విడనాడినచో నపుడా సర్వనుతుడగు హరియును శక్తిహీనుడే యగును. శాంతి శ్రీని గోల్పోయి గుణహీనుడైన వానిని తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ యనంత శక్తీ! బ్రహ్మాది దేవతలును రేబవళ్లు నీ భవ్య పాదపద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము జేరి యువతులుగ మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగ మారుదురని తలంతును. ఇట్టి నీ మహాశక్తి నేమని వర్ణింపగలను? నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గలదానవే కావు. సగుణపు నిర్గుణవు నిరంజనపు కనుక నిన్నే భక్తి ప్రపత్తులతో సంస్మరించుచు మ్రొక్కులు చెల్లింతురు. నాకు నీయందు నిశ్చల భక్తి యున్న చాలు. నాకు మరే కోర్కెయు లేదు.

శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందు సుద్యుమ్నస్తుతి యను ద్వాదశాధ్యాయము నుండి.

No comments:

Post a Comment