Saturday, April 4, 2020

వేదములు చేసిన మహామాయ స్తుతి

వేదములు చేసిన శ్రీ మహామాయ స్తుతి:




నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే | నిర్గుణే 
 సర్వభూతేశి మాతః శంకర కామదే. 53

త్వం భూమిః సర్వ భూతానాం ప్రాణః ప్రాణవతాం తథా |
ధీః శ్రీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా ధృతిః స్మృతిః. 54

త్వ ముద్గీథేర్థమాత్రాసి గాయత్రీ వ్యాహృతి స్తథా | జయా చ విజయ ధాత్రీ లజ్జా కీర్తిః స్పృహా దయా. 55

త్వాం సంస్తుమోంబ భువనత్రయ సంవిధాన దక్షాం దయారసయుతాం జననీం జనానామ్‌,
విద్యాం శివాం సకలలోకహితాం వరేణ్యాం వాగ్బీజ వాసనిపుణాం భవనాశకర్త్రీమ్‌. 56

బ్రహ్మా హరః శౌరిసహస్రవేత్ర వాగ్వహ్ని సూర్యా భువనాధినాథాః
తే త్వత్కృతాః సంతి తతో న ముఖ్యా మాతా యత స్త్వం స్థిర జంగమానామ్‌. 57

సకల భువన మేత త్కర్తుకామా యదా త్వం సృజసి జనని దేవా న్విష్ణురుద్రాజముఖ్యాన్‌
స్థితిలయజననం తైః కారయ స్యేకరూపా న ఖలు తవ కథంచి ద్దేవి సంసారలేశః. 58
సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయుచున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసారవికారవాసనలు లేశమాత్రమున పొడసూపవు.

న తే రూపం వేత్తుం సకలభువనే కోపి నిపుణో న నామ్నాం సంఖ్యాం తే కథితు మిహ యోగ్యోస్తి పురుషః
య దల్పం కీలాలం కలయితు మశక్త స్స తు నరః కథం పారావారాకలన చతురః స్యాదృతమతిః. 59
నదేవానాం మధ్యే భగవతి తవానంత విభవం విజానాత్యేకోపి త్వ మిహ భువనైకాసి జనని :
కథం మిథ్యా విశ్వం సకలమపి చైకా రచయసి ప్రమాణం త్వేతస్మి న్నిగమవచనం దేవి విహితమ్‌. 60
నిరీహైవాసి త్వం నిఖిలిజగతాం కారణ మహో చరిత్రం తే చిత్రం భగవతి మనో నో వ్యథయతి,
కథంకారం వాచ్యః సకల నిగమాగోచర గుణ ప్రభావః స్వం యస్మా త్స్వయమపి న జానాతి పరమమ్‌ 61
న కింజానాసి త్వం జనని మధుజిన్మౌళిపతనం శివేకిం వాజ్ఞాత్వావివిదిషసి శక్తింమధుజితః!
హరే కిం వా మాత ర్దురితతతి రేసా బలవతీ భవత్యాః పాదాబ్జే భజననిపుణే క్వాస్తి దురితమ్‌. 62
ఉపేక్షా కిం చేయం తవ సురసమూహేతివిషమా హరే ర్మూర్థ్నో నాశో మత మిహ మహాశ్చర్యజనకమ్‌,
మహద్దుఃఖం మాత స్త్వమసి జననచ్ఛేదకువలా న జానీమో మౌళే ద్విగన విలంబః కథమభూత్‌. 63
జ్ఞాత్వా దోషం సకలసురతాపాదితం దేవి చిత్తే కిం వా విష్ణా వమరజనితం దుష్కృతం పాతితం తే,
విష్ణోర్వా కిం సమరజనితః కోపి గర్వోతివేగాత్‌ ఛేత్తుం మాత స్తవ విలసితం నైవ విద్మోత్ర భావమ్‌. 64
కిం వా దైత్యః సమరవిజితై స్తీర్థదేశే సురమ్యే ఘోరం తప్త్వా భగవతి వరం లబ్ధవద్భి ర్భవత్యాః,
అంతర్థానం గమిత మధునా విష్ణుశీర్షం భవాని ద్రష్టుం కిం వా విగతశిరసం వాసుదేవం వినోదః 65
సింధోః పుత్య్రాం దోషితా కిం త్వమాద్యే కస్మాదేనాం ప్రేక్షసే నాధహీనామ్‌,
క్షంతవ్య స్తే స్వాంశజాతాపరాధో వ్యుత్థాపై#్యనం మోదితాం మాం కురుష్వ. 66


నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్యప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణభూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములన్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బలమెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది. ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము. భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరములొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందేమనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ!


ఏతా సురా స్త్వాం సతతం నమంతి కార్యేషు ముఖ్యాః ప్రథిత ప్రభావాః,
శోకార్ణవా త్తారయ దేవి దేవా నుత్థాప్య దేవం సకాలాధినాథమ్‌. 67
మూర్థా గతః క్వాంబ హరే ర్నవిద్మో నాన్యో%స్త్యుపాయః ఖలు జీవనేద్య|
యథా సుధాజీవన కర్మదక్షా తథా జగజ్జీవితదాసి దేవి! 68

మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! సూతుడిట్లనియె; 


ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు.

శ్రీ దేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమున శ్రీ హయగ్రీవావతార కథనమను పంచమాధ్యాయము నుండి.

No comments:

Post a Comment