Sunday, April 12, 2020

ఇంద్రుడు చేసిన శ్రీరాజరాజేశ్వరి స్తుతి

ఇంద్రుడు చేసిన  శ్రీరాజరాజేశ్వరి స్తుతి




తదైవేంద్రో గురోర్వాక్యా త్సర్వ దుఃఖవినాశినీం | సస్మార మనసా దేవీం ముక్తిదాం పరమాం శివామ్‌. 10
ఇంద్ర ఉవాచ :- జయదేవి మహామాయే శూలధారిణి చాంబికే | శంఖచక్రగదా పద్మఖడ్గహస్తే భయప్రదే. 11
నమస్తే భువనేశాని శక్తిదర్శన నాయికే | దశతత్త్వాత్మికే మాతర్మహా బిందుస్వరూపిణి. 12


ఇంద్రుడు గురుని వచనాను సారముగ సర్వదుఃఖ వినాశినీ - ముక్తిదాయిని - శివస్వరూపిణి యైన శ్రీరాజరాజేశ్వరిని నెమ్మదిలో నీరీతిగ స్మరించి ప్రస్తుతించెను: ఇంద్రుడిట్లనెను: ఓ దేవి! ఓ మహాదేవి! ఓ మహామాయా! భక్తుల యిలవేల్ప! ఓయమ్మా! నీవు శంఖ చక్ర గదా పద్మములు శూల ఖడ్గములు ధరించి మా కభయ వరము లొసగు తల్లివి. నీకు జయమగుత. భువనేశానీ! మాతా! నాదబిందు కళాస్వరూపిణీ! దశతత్త్వాత్మికా! శక్తి ప్రధానమైన దర్శన శాస్త్రములకు ముఖ్యనాయికా! నీకు వందనములు తల్లీ|

మహాకుండలినీరూపే సచ్చిదానందరూపిణి| ప్రాణాగ్నిహోత్రవిద్యేతే నమో దీపశిఖాత్మికే. 13
పంచకోశాంతరగతే పుచ్ఛబ్రహ్మస్వరూపిణీ | ఆనందకళికే మాతః సర్వోపనిష దర్చితే. 14
మాతః ప్రసాదసుముఖీ భవ హీనసత్త్వాం | స్త్రాయస్వనోజనని దైత్యపరాజితాన్వై
త్వం దేవి నః శరణదా భువనే ప్రమాణా | శక్తాసి దుఃఖశమనేఃల వీర్యయుక్తే. 15
ధ్యాయంతి యే పి సుఃనో నితరాంభవంతి | దుఃఖాన్వితా విగతాశోకభయా స్తథాన్యే |
మోక్షార్థినో విగతమానవిముక్త సంగాః | సంసారవారిధిజలం ప్రతరంతి సంతః. 16
త్వం దేవి విశ్వజనని ప్రథితప్రభావా సంరక్షణార్థ ముదితార్తి హరప్రతాపా |
సంహర్తు మేతదఃలం కిలకాలరూపా కోవేత్తి తేంబ చరితం ను మందబుద్ధిః. 17
బ్రహ్మా హరశ్చ హరిదశ్వరథో హరిశ్చ ఇంద్రోయమోథ వరుణోగ్ని సమీరణౌ చ |
జ్ఞాతుం క్షమా న మునయోపి మహానుభావా యస్యాః ప్రభావ మతులం నిగమాగమాశ్చ. 18
ధన్యాస్త ఏవ తవ భక్తిపరా మహాంతః | సంసార దుఃఖరహితాః సుఖసింధుమగ్నాః |
యే భక్తిభావరహితా న కదాపి దుఃఖాంభోధిం జనిక్షయ తరంగముమే తరంతి. 19
యే వీజ్యమానాః సితచామరైశ్చ క్రీడంతి ధన్యాః శిబికాధిరూఢాః |
తైః పూజితా త్వం కిల పూర్వదేహే నానోపహారైరితి చింతయామి. 20
యే పూజ్యమానా వరవారణస్థా విలాసినీబృందవిలాసయుక్తాః |
సామంతకై శ్చోపనతై ర్వ్రజంతి మన్యేహి తై స్త్వం కిల పూజితా2/సి. 21
వ్యాస ఉవాచ: ఏవం స్తుతా మఘవతా దేవీ విశ్వేశ్వరీ తదా | ప్రాదర్బభూవ తరసా సింహారూఢా చతుర్భుజా. 22
శంఖచక్రగదాపద్మా న్బిభ్రతీ చారులోచనా | రక్తాంబరధరా దేవీ దివ్యమాల్యవిభూషణా. 23
తా నువాచ సురాన్దేవీ ప్రసన్నవదనా గిరా | భయం త్యజంతు భో దేవాః శం విధాస్యే కిలా%ధునా. 24
మహాకుండలినీ శక్తి స్వరూపిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! నిత్య చైతన్యజ్యోతీ! ఓ ప్రాణాగ్ని హోతృవిద్యా! శిఖాత్మికా! నీకు వందనములు: నీవు పంచకోశాంతర నిలయవు. ఆనంద కోశమందలి పుచ్ఛ బ్రహ్మస్వరూపిణివి! ఆనంద కళికవు! సర్వోపనిషదర్చితవు. నీకు వందనములు తల్లీ! ఓహో జగజ్జననీ! ఏము దైత్యులవలన నోటుపడితిమి. దుర్బలులమైతిమి. మా యెడల ప్రసన్నవుగమ్మా! అమ్మా మమ్ము గాపాడుమమ్మా! ఈ త్రిభువనములం దీవొక్కతెవే శరణమొసగుదానవమ్మా! మా దుఃఖము లెడబాపుట కీవే సర్వశక్తురాలవు. వీర్యయుక్తురాలవు. నీకు వందనములు తల్లీ! ఓ విశ్వజననీ! నిన్ను నిరంతరము ధ్యానించువారు శాశ్వత సుఖశాంతు లందుదురు. నిన్ను ధ్యానింపనివారు భయశోకములతో దుఃఖముల పాలగుదురు. సంగరహితులైన ముముక్షులీ భవసాగరము తరింతురు. ఓయమ్మా? నీవు విశ్వజననివి. దేవీ! నీ ప్రభావము విశ్వ ప్రసిద్ధము. నీవు దుఃఖార్తిహారిణివి. నీవే సర్వరక్షణ దక్షురాలవు. నీవే యఖండ కాలస్వరూపవు. ఈ సకలము నీవే సంహరింతువు. ఓ తల్లీ! నీ దివ్యచరితము మందమతికేమి తెలియును? నీ యతుల దివ్యశక్తి ప్రభావమును హరిహర బ్రహ్మలును ముని జనగణమును నిగమాగమములు నెఱుగ నేరవు. ఓ యుమాదేవీ! నీ పాదపద్మ సేవాపరాయణులైన మహాత్ములే ధన్యులు. వారు సంసార దుఃఖరహితులు. కాని, భోగ సాగరమగ్నులు భక్తిరహితులు జన్మమృత్యుసాగరము దాటనోపరు. ఓ మాతా! నిత్యము వెల్లచామరములచేత వీవబడువారును సుఖక్రీడ లాడువారును బంగరు టందలము లెక్కువారును తొల్లిటి జన్మమును నిన్ను పెక్కులుపచారములచే బూజించియుండిరని నేను దలతును. ఓ తల్లీ! ఎవ్వరు నిత్యము పూజ్యులో ఎవరేనుగల నధిరోహింతురో ఎవరు విలాసినీ బృందమున విలాసవంతులై వర్తింతురో తమకు నమ్రులైన సామంతులతో గూడి సంచరించు చుందురో వారు మున్ను నిన్ను పూజించియుండిరని భావింతును.

అని యీ విధముగ నింద్రుడు ప్రస్తుతి సేయగా శ్రీ త్రిభువనేశ్వరీదేవి సింహాధిరూఢయ్తె చతుర్భుజయై వేగమే ప్రత్యక్షమయ్యెను. ఆ రాజీవనయనయగు జనని శంఖ చక్ర గదా కమలములు ధరించి రక్తాంబర ధారిణియై దివ్యమాల్య విభూషితయై దేదీప్యమానయై యొప్పెసగెను. శ్రీదేవి ప్రసన్న వదనముతో నమృత వచనములతో దేవతలతో నీవిధముగ వచించెను: ఓ దేవతలారా! భయము విడువుడు. మీకిపుడు సుఖశాంతులును సిరిసంపదలును గలిగింతును.
శ్రీదేవీ భాగవత మందలి చతుర్థ స్కంధమందు ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుటయను పంచదశాధ్యాయము నుండి.


No comments:

Post a Comment