దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట
నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథేమదానందరూపే సురానందదే తే
నమో దానవాంతప్రదే మానవానా మనేకార్థదే భక్తిగమ్య స్వరూపే. 25
న తే నామ సంఖ్యా న తే రూపమీదృక్తథా కోపి వేదాది దేవస్వరూపే
త్వమేవాసి సర్వేషు శక్తి స్వరూపా ప్రజాసృష్టి సంహారకాలే సదైవ. 26
స్మృతిస్త్వం ధృతిస్త్వం త్వమేవాసి బుద్ధి ర్జరా పుష్టి తుష్టీ ధృతిః కాంతిశాంతీ
సువిద్యా సులక్ష్మీర్గతిః కీర్తిమేదే త్వమేవాసి విశ్వస్య బీజం పురాణమ్. 27
యదా యైః స్వరూపైః కరోషీహకార్యం సురాణాంచ తేభ్యో గమామోద్య శాంత్యై |
క్షమా యోగనిద్రా దయా త్వం వివక్షా స్థితా సర్వ భూతేషు శసై#్తః స్వరూపైః. 28
కృతం కార్య మాదౌ త్వయా యత్సురాణాం హతోసౌ మహరి ర్మదాంధో హయారిః. |
దయా తే సదాసర్వదేవేషు దేవి ! ప్రసిద్ధా పురాణేషు వేదేషు గీతాః. 29
కిమత్రాప్తి చిత్రం యదంబా సుతే స్వం ముదా పాలయేత్పోష యేత్సమ్యగేవ |
యతస్త్వం జనిత్రీ సురాణాం సహాయా కరుషై#్వక చిత్తేన కార్యం సమగ్రమ్. 30
న వా తే గుణానా మియత్తాం స్వరూపం వయం దేవి జానీమహే విశ్వవంద్యే
కృపా పాత్ర మిత్యేవ మత్వా తథాస్మాన్భయేభ్యః సదా పాహి పాతుం సమర్థే. 31
వినాబాణపాతై ర్వినా ముష్ఠిఘాతై ర్వినాశూలఖడ్గైర్వినాశక్తి దండైః.
రిపూన్హంతు మేవాసి శక్వా వినోదా త్తథాపీహ లోకోప కారాయ లీలా. 32
ఇదం శాశ్వతంనైవ జానంతి మూఢానకార్యంవినా కారణం సంభవేద్వా
వయం తర్కయామోనుమానం ప్రమాణంత్వమేవాసి కర్తాస్య విశ్వస్య చేతి. 33
అజః సృష్టికర్తా ముకుందోవితాయం హరో నాశకృద్వైపురాణే ప్రసిద్ధః
నకిం త్వత్త్రపసూతాస్త్రయస్తే యుగాదౌ త్వమేవాసి సర్వస్య తే నైవ మాతా. 34
త్రిభి స్త్వం పురారాధితా దేవి దత్తాత్వయాశ క్తిరుగ్రా చ తేభ్యః సమగ్రా
త్వయా సంయుతాస్తే ప్రకుర్వంతి కామం జగత్పాలనోత్పత్తి సంహారమేవ. 35
తే కిం న మందమతయో యతయో విమూఢాస్త్వాం యేన విశ్వజననీం సముపాశ్రయంతి.
విద్యాం పరాం సకలకామఫలప్రదాంతాం ముక్తిప్రదాం విబుధ బృంద సువందితాంఘ్రిమ్. 36
యే వైష్ణవాః పాశుపతాశ్చ సౌరా దంబాస్త ఏవ ప్రతిభాంతి నూనమ్
ధ్యాంతి న త్వాం కమలాం చ లజ్జాం కాంతిం స్థితి కీర్తి మథాపి పుష్టిమ్. 37
'విశ్వేశ్వరీ! భక్తిగమ్యా! సచ్చిదానంద స్వరూపిణీ ! ప్రాణేశ్వరేశ్వరీ ! అశేషదుష్టదనుజమర్దినీ ! అమరానంద ప్రదాయినీ ! నీకు నమస్కారమమ్మా! ఆదిదేవీ! నీ యనంత నామరూపము లెవ్వడు నెఱుగజాలడు. సృష్టిసంహారాది కార్యములన్నిటిలో నీవు సర్వక్రియాశక్తి స్వరూపిణివి. సర్వేశ్వరీ ! స్మృతి-ధృతి-బుద్ధి-జర-తుష్టి-పుష్టి-కాంతి-శాంతి-విద్య-లక్ష్మి-గతి-కీర్తి-మేధ-విశ్వాదిబీజము-ఇవన్నియు నీవే అమ్మా! నీ వేయే దివ్యరూపములలో విబుధుల కార్యముల నిర్వహింతువో ఆ యాయా యద్భుత రూపములకు నమస్కరించుచున్నాము. నీవు శాంతి - క్షమ-యోగనిద్ర మున్నగు సర్వరూపములతో జీవులలో నివసింతువు. నీవు తొల్లి దేవతల మహోజ్జ్వల భవిష్యత్తునకై మదాంధుడగు మహిషాసురు నంతమొందించితి, ఆనాడు నీ యనుగ్రహభాగ్య మెల్ల సురలపట్ల నుండెను. నీవు దయామతల్లివని వేదములు నుద్ఘోషించుచున్నవి. తల్లి తన తనయుని గారాబముతో లాలించి పాలించి పెంచుననుటలో నచ్చెరువేమియునులేదు. నీవు నిఃల సురలకు సహాయ మొనర్చుదానవు. ఇపుడు తప్పక నీవు మా యెల్ల కార్యములు చక్కపఱచుము. విశ్వవంద్యా! నీ యనంత గుణరూపము లత్యద్భుతములు. మేము వాని నెఱుగజాలము. మేము నీ దయకు పాత్రులము. మా భయములు పాపుము. మమ్ము బ్రోవ నీవే సమర్థురాలవు. శత్రువులను పరిమార్చుటకు నీకు బాణములు - ముష్టిఘాతములు-శూలఖడ్గములు-శక్తిదండములు మున్నగువానితో పనిలేదు. నీవు లోకోపకారమునకు యుద్ధాదులొనర్తువు. అవి నీకు లీలావినోదమాత్రములే. ఈ జగము నశ్వరమని మూఢులకును తెలియును. కారణము లేక కార్యము జరుగదు. కాన నన్నిటికి నీవే మూలకారణము ప్రమాణము నని తలంతుము. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకర్తలుగా పురాణములందు ప్రఖ్యాతి వహించిరి. సృష్టికి మొదట త్రిమూర్తులను గన్నతల్లివి నీవే కదా! కనుక నీ విశ్వములకు జననివి నీవే. నీవు పూర్వము త్రిమూర్తులచే బూజింపబడితివి. వారికి పరిపూర్ణ దివ్యశక్తులు ప్రసాదించితివి. నీవు సృష్టి స్థితి సంహారవినోదవు. దేవవందితపాదకమలవు. సకల కామముక్తి ఫలదాయినివి, పరావిద్యవు. త్రిమూర్తులు నీ శక్తులనుగూడి తమ తమ పనులు చక్కగ నిర్వహించుచున్నారు. నిన్ను గొల్వనిచో యతులైనను మందమతులై మూఢులగుదురు. ఏకవు-లజ్జవు-కీర్తివి-పుష్టివి-కాంతివి-స్థితివి. నిన్ను ధ్యానింపని వైష్ణవులు-శైవులు-సౌరులు డాంబికులుగ నెన్నబడుదురు.
హరిహరా దిభి రప్యథ సేవతాత్వమి హ దేవవరై రసురై స్తథా.
భువి భజంతి న యోల్పధియో నరా జనని తే విధినా ఖలు వంచితాః. 38
జలధిజా పద పంకజ రంజనం జతురసేన కరోతి హరిః స్వయమ్
త్రినయనోపి ధరాధరజాంఘ్రి పంకజపరాగ నిషేవణతత్పరః. 39
కిమపరస్య నరస్య కథానకై స్తవ పదాబ్జయుగం న భజంతి కే
విగతరాగ గృహశ్చ దయాం క్షమాం కృతథియో మునయోపి భజంతి తే. 40
దేవి త్వదంఘ్రిభజనే న జనా రతా యే సంసారకూపపతితాః పతితాః కిలామీ
తే కుష్ఠ గుల్మ శిర ఆధియుతా భవంతి దారిద్య్రదైన్యసహితా రహితాః సుఖౌఘైః. 41
యే కాష్టభారవహనే యవసాపహారే కార్యేభవంతినిపుణాధనదారహీనాః
జానీమహే%ల్పమతిభిర్భవదంఘ్రిసేవా పూర్వేభ##వేజననితైర్నకృతాకదాపి. 42
జననీ! నీవు హరిహరాది దేవవరులచేత సేవింపబడుదువు. నిన్నీపుడమిపై కొంచెపు బుద్దివారు గొలువనోపరు. వారు నిజముగ విధివంచితులు. హరి స్వయముగ లక్ష్మియొక్క పదకమలములకు లత్తుకరంగు పూయును. శివుడును శివాచరణకమల రజము సేవింప గోరుకొనును. ఇక సామాన్యులగూర్చి చెప్పనేల? వీతరాగులు ధీమంతులు మునులు సైతము దయాక్షమాది సద్భావములతో నిన్నే సేవింతురు. కనుక లోకములందు నీ పదకమలములు సేవింపని వారెవరును లేరు. పారిజాత పరిమళములు విరజిమ్ము నీ చరణ కమలములకు పూల పూజ పచరింపని నరులు సంసారకూపనిపతితులు-పతితులు - కుష్ఠ గూల్మాది రోగ పీడితులు-దైన్య దారిద్ర సహితులు-సుఖరహితులు-నై యుందురు. తల్లీ! ఈ జన్మములో కట్టెలు గడ్డి గాదములు మోయుటలో నేర్పరులై - భార్య సంపదలు లేనివారె బుద్ధిహీనులై యున్నవారు గత జన్మములో నీ పదకమల సేవ చేయనివారని భావింతుము.'
అని యీ విధముగ దేవతలెల్లరును సంస్తుతింపగా మహాతిశయ లావణ్యయగు జగదంబ వేగిరమే కనికరముతో వారికి ప్రత్యక్షమయ్యెను.
దేవి స్తుమ స్త్వాం విశ్వేశి ప్రణతాః స్మ కృపార్ణవే | పాహి నః సర్వ దుఃఖేభ్యః సంవిగ్నా న్దైత్యతాపితాన్. 50
పురా త్వయా మహాదేవి నిహత్యాసురకంటకమ్ | మహిషం నో వరో దత్తః స్మర్తవ్యాహం యదాపది. 51
స్మరణా ద్దైత్యజాం పీడాం నావయిష్యా మ్యసంశయమ్ | తేన త్వం సంస్మృతా దేవి నూనమస్మాహభి రిత్యపి. 52
అద్య శుంభనిశుంభౌ ద్వావసురౌ ఘోరదర్శనౌ | ఉత్పన్నౌ విఘ్న కర్తారావహన్యౌ పురుషైః కిల. 53
రక్తబీజ శ్చ జలవాం శ్చండముండౌ తథా%సురౌ | ఏతై రన్యై శ్చ దేవానాం హృతం రాజ్యం మహాబలైః. 54
గతి రన్యా న చాస్మాకం త్వమేవాసి మహాబలే | కురు కార్యం సురాణాం వై దుఃఃతానాం సుమధ్యమే. 55
దేవాస్త్వదంఘ్రిభజనే నిరతాః సదైవ తే దానవైరతిబలై ర్విపదంసు గీతాః
తాన్దేని దుఃఖరహితా న్కురు భక్తి యుక్తా న్మాతస్త్వమేవ శరణం భవ దుఃఃతానామ్. 56
సకలభువనరక్షా దేవి కార్యా త్వయాద్య స్వకృతమితి విదిత్వా విశ్వమేతద్యుగాదౌ
జనని జగతి పీడాం దానవా దర్పయుక్తాః స్వబలమదసమేతా స్తే ప్రకుర్వంతి మాతః. 57
'దేవి! నీవు విశ్వేశ్వరివి. దయా సాగరవు. నీ కివే మా ప్రణా మాంజలులు. ఇవే మా స్తుతులు. మేము దైత్య పీడితులము. మాలో చింత మెఱమెఱలాడు చున్నది. మమ్ము దుఃఖములనుండి కాపాడు మమ్మా మహాదేవీ! తొల్లి నీవు లోక కంటకుడగు మహిషాసురుని వధించితివి. అపు డాపదలందు నన్ను స్మరింపుడని మా కభయ ప్రదాన మొనర్చితివి. నిన్ను స్మరించినంతనే దానవులవలని బాధలు తొలగింతు నంటివి. అందులకే మేమిపుడు నిన్ను స్మరించుచున్నాము. ఇపుడు శుంభ నిశుంభులను నిర్వురు ఘోరరాక్షసులు పుట్టి మా కార్యములకు విఘ్నము లొనర్చు చున్నారు. వారు పురుషులకు వధ్యులుగారు. రక్తబీజుడు-చండ ముండులు మహాబలవంతులు. వారు సురల రాజ్య మపహరించిరి. దేవదేవీ! మాకు నీవే దిక్కు. మా మొఱలాంలించి పాలించు మమ్మా! మేమాపదలలో జిక్కుకొంటిమి. మా కార్యము చక్కబెట్టుము. మాకు వేరే దిక్కెవ్వరునులేరు. అమరుల్లెవేళల నీ చరణ కమల సేవలో మగ్నులై యుందురు. ఐనను దైత్యులు వారి కాపదలు గల్గింతురు. అట్టి సురలు దుఃఃతులు-నీ యందలి నిశ్చల భక్తితత్పరులు. వారికి నీ కరావలంబ మొసగుము. వారిని దుఃఖరహితులుగ జేయుము. జననీ! విశ్వమంతయు నీచే సృజింపబడినది. అటులే యిపుడును విశ్వపరిరక్షణ నీ కవశ్య కర్తవ్యమగును.
శ్రీమద్దేవీ భాగవత పంచమ స్కంధమందు వేల్పులు శ్రీదేవిని సంస్మరించుట యను నిరువది రెండవ యధ్యాయము నుండి.
No comments:
Post a Comment