Sunday, April 19, 2020

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట - వృత్రుని వధార్ధాం

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట



జగ్ము స్తే మేరుశిఖరం మందారద్రుమమండితమ్‌ | ఏకాంతే సంస్థితా దేవాః కృత్వా ధ్యానం జపంతపః. 32
తుషువు ర్జగతాం ధాత్రీం సృష్టిసంహారకారిణీమ్‌ | భక్త కామదుఘా మంబాం సంసారక్లేశనాశినీమ్‌. 33
దేవి! ప్రసీద పరిపాహి సురాన్ర్పతప్తా న్వృత్రాసురేణ సమరే పరిపీడితాం శ్చ.
దీనార్తినాశనపరే! పరమార్థ తత్త్వే ప్రాప్తాం స్త్వదంఘ్రి కమలం శరణం సదైవ. 34
త్వం సర్వం విశ్వజననీ పరిపాలయాస్మా న్పుత్రానివాతి పతితాన్రివు సంకటే%స్మిన్‌.
మాతర్నతేస్త్యవిదితం భువనత్రయేపి కస్మా దుపేక్షసి సురానసుర ప్రతప్తాన్‌. 35
త్రైలోక్య మేతదఃలం విహితం త్వయైవ బ్రహ్మ హరిః పశుపతి స్తవ వాసనోత్థాః |
కుర్వంతి కార్య మఃలం స్వవశా న తే తే భ్రూభంగచాలన వశాద్విహరంతికామమ్‌. 36
మాతా సుతా న్పరిభవా త్పరిపాతి హీనా న్రీతి స్త్వయైవ రచితా ప్రకటాపరాధాన్‌ |
కస్మా న్న పాలయసి దేవి వినాపరాధా నస్మాం స్త్వదంఘ్రి శరణా న్కరుణా రసాబ్ధే. 37
నూనం మదంఘ్రి భజనాప్త పదాః కిలైతే భక్తిం విహాయ విభవే సుఖభోగలుబ్ధాః |
నేమే కటాక్షవిషయా ఇతిచే న్న చైషా రీతిః సుతే జనని కర్తరి చాపి దృష్టా. 38
దోషో న నో2త్ర జనని ప్రతిభాతి చిత్తే యత్తే విహాయ భజనం విభవే నిమగ్నాః |
మోహస్త్వయా విరచితః ప్రభవ త్యసౌ న స్తస్మా త్స్వభావకరుణే దయసే కథం న. 39
పూర్వం త్వయా జనని దైత్యపతి ర్బలిష్ఠో వ్యాపాదితో మహిషరూపధరః కిలాజౌ |
అస్మత్కృతే సకలలోక భయావహోసౌ వృత్రం కథం న భయదం విధునోషి మాతః. 40
శుంభస్తథాతి బలవా ననుజో నిశుంభస్తౌ భ్రాతరౌ తదనుగా నిహతా హతౌచ |
వృత్రం తథా జహి ఖలం ప్రబలం దయార్ద్రే మత్తం విమోహయ తథా న భవేద్యథాసౌ. 41
త్వం పాలయాద్య విబుధా న సురేణ మాతః సంతాపితా నతితరాం భయ విహ్వలాంశ్చ |
నాన్యోస్తి కోపి భువనేషు సురార్తిహంతా యః క్లేశజాల మఃలం నిదహే త్స్వశక్త్యా. 42
వృత్రే దయా తవ యది ప్రథితా తథాపి జహ్యేన మాశు జన దుఃఖకరం ఖలం చ |
పాపా త్సముద్ధర భవాని శరైః పునానా నోచే త్ర్పయాస్యతి తమో నను దుష్టబుద్ధిః. 43
తే ప్రాపితాః సురవనం విబుధారయో యే హత్వా రణేపి విశిఖైః కిల పావితాస్తే |
త్రాతా నకిం నిరయ పాతభయా ద్దయార్ద్రే యచ్ఛత్రవో పి నహి కిం వినహింసి వృత్రమ్‌. 44
జానీమహే రిపురసౌ తవ సేవకో న ప్రాయేణ పీడయతి నః కిల పాపబుద్ధిః |
య స్తావక స్త్విహ భవే దమరా నసౌ కిం త్వత్పాదపంకజర తాన్నను పీడయే ద్వా. 45
అపుడు దేవతలు మందారాదితరువులచే నందమైన మేరుగిరి జేరిరి. వారేకాంతమున దేవిని గూర్చి జపతపో ధ్యానములు చేసిరి. వారు భక్తుల కోరిక లీడేర్చునట్టి సంసార దుఃఖములు బోగొట్టునట్టి జగములేలేతల్లిని - సృష్టిస్థితి సంహార కారిణి నీ విధముగ గొప్పగ ప్రస్తుతించిరి: తల్లీ! దేవదేవీ! మేము సమరమున వృత్రునిచేత పీడితులమై సంతప్తులమైతిమి. నీ పదపద్మములపై మా తలలు వంచి శరణువేడుచున్నాము. సర్వవిశ్వజననీ! అమ్మా! ఈ ముల్లోకములందు నీకు తెలియనిది లేదుగదా! దానవపీడితులమగు మమ్మేల యుపేక్షింతువు? మేము నీ కన్నబిడ్డలము. భీకర శత్రువులబారి పడిన వారము. మమ్ము గాపాడగదవే. తల్లీ! ఈ జగములన్నియు నీ వలననే నిల్చియున్నవి. నీవు వేల్పులతల్లివి. హరి హర బ్రహ్మలు వలననే జన్మించి నీ కనుసన్న మాత్రన సర్వ కార్యముల నెరవేర్చి విహరింతురు. వారికి స్వేచ్ఛా స్వాతంత్ర్యము లెంత మాత్రమును లేవు. ఒకవేళ పుత్రులేవైన అపరాధములచేసి దీనులై తిరస్కృతులైనచో వారిని తల్లి దయతో గాపాడునుగదా! వారితప్పు మన్నించునుగదా! దయారసమయీ! మేము నీ దివ్య పదారవిందములను శరణుపొందిన వారము. నిరపరాధులము. మమ్మేలదయతో నేలవమ్మా! అమ్మా! భవానీ! వీరొకప్పుడు నా పదములు గొలిచి పదములు పడసి సుఖభోగములంది నేడు నా భక్తి మానిరి. వీరినిపుడు నేనెట్లు కటాక్షింతునని మమ్ము గూర్చి దలంతువేని వినుము. అమ్మా! దయామతల్లియగు ఏ తల్లికైన నిట్టి భావము మదిగల్గదు సుమా! జననీ! శుభకామినీ! మేము నిన్ను భజింపక సంవదలం దనురక్తుల మగుటలో మా దోషమేమియును లేదు. ఏలన, నీవు మాయామోహమును రచించి మమ్ము మోహితులనుగ జేసితివి. స్వాభావిక కరుణారూపవగు నీవు దయతో మమ్మాదుకొనవేల? తల్లీ! తొల్లి నీవు బలశాలి - దైత్యపతియగు మహిషుని మాకు శ్రేయముగూర్ప నంతమొందించితివి. ఇపుడీ సకలలోక కంటకుడగు వృత్రునేల వధింపవు? దయామయీ! తొల్లి నీవు శుంభనిశుంభులను సోదరులను వారి యనుచరులను చంపివేసితివే. అట్లే మత్తుడు దుష్టుడు దుర్బలుడు నగు వృత్రుని మోహితునిజేసి చంపుము. శుభకారిణీ! జననీ! మేము దానవులచేత బాధింపబడితిమి. వికలాత్ములమైతిమి. మమ్ము బ్రోవగదవే! విబుధుల యార్తిపాపి వారి కడగండ్లనెల్ల బాపు శక్తిగలదానవు. దానవుల నెదిరించు ధీరశక్తివి నీవు; నిన్నెవడు నెదిరి నిల్వలేడు. ఓయమ్మా! ఒకవేళ వృత్రునిమీద నీకు కనికరమున్నచో జగములెల్ల పీడించునతడు నరకములో గూలకముందే నీ పవిత్రశరములతో వానిని చంపి యుద్ధరించుట మంచిది. నీ దివ్యబాణముల తాకిడికి పవిత్రులై చచ్చిన దనుజులు సురవనములందు విహరింతురుగదా! వృత్రుడు నీ శత్రువే. ఐన నతనిని నరకమున త్రోయక కాపాడవలసియుండ చంపవేల? జగన్మాతా! మాకు నీ శుభచరణములు శరణము. వృత్రుడు నిన్ను గొల్వక మమ్ము బీడించువాడు. అట్టి పాపమతి నీకు దాసుడుగాడు, వైరియేయగునని మేముదలంతుము. కుర్మః కథం జనని పూజన మద్య తే%ంబ పుష్పాదికం తవ వినిర్మితమేవ యస్మాత్‌ |
మంత్రా వయం చ సకలం పరశక్తి రూపం తస్మా ద్భవాని చరణే ప్రణతాః స్మనూనమ్‌. 46
ధన్యాస్త ఏవ మనుజా హి భజంతి భక్త్యా పాదాంబుజం తవభవాబ్ధి జలేషు పోతమ్‌ |
యం యోగినోపి మనసా సతతం స్మరంతి మోక్షార్థినో విగతరాగవికారమోహః. 47
యే యజ్ఞికాః సకలవేదవిదోపి మనసా సతతం స్మరంతి మోక్షార్థినో విగతరాగ వికారమోహః.
స్వాహాంతు తృప్తి జననీ మమరేశ్వరాణాం భూయః స్వధాం పితృగణస్య చ తృప్తిహేతుమ్‌. 48
మేధాసి కాంతిరసి శాంతిరపి ప్రసిద్ధా బుద్ధి స్త్వమేవ విశదార్థకరీ నరాణామ్‌ |
సర్వం త్వమేవ విభవం భువన త్రయేస్మి న్కృత్వా దదాసి భజతాం కృపయా సదైవ. 49
ఏవం స్తుతా సురైర్దేవి ప్రత్యాక్షా సాభవత్తదా | చారురూపధరా తన్వీ సర్వాభరణ భూషితా. 50
పాశాంకుశవరాభీతి లస ద్బాహు చతుష్టయా | రణత్కింకిణికాజాలరశనాబద్ధ సత్కటిః. 51
కలకంఠీరవా కాంతా క్వణత్కంకణనూపురా | చంద్రఖండ సమాబద్ధ రత్నమౌళి విరాజితా. 52
మందస్మితారవిందాస్యా నేత్రత్రయవిభూషితా | పారిజాతప్రసూనాచ్ఛనాళవర్ణ సమప్రభా. 53
రక్తాంబరపరీధానా రక్తచందనదర్చితా | ప్రసాదముఖీ దేవీ కరుణారససాగరా. 54
సర్వశృంగారవేషాఢ్యా సర్వద్వైతారణిః పరా | సర్వజ్ఞా సర్వకర్త్రీ చ సర్వాధిష్ఠానరూపిణీ. 55
సర్వవేదాంతసంసిద్ధా సంచిదానందరూపిణీ | ప్రణేము స్తాం సమాలోక్య సురాదేవీం పురః స్థితామ్‌. 56
తానాహ ప్రణతా నంబాకింపః కార్యంబ్రువంతుమామ్‌ | దేవాః : మోహయైనంరిపుం వృత్రం దేవానామతిదుఃఖదమ్‌. 57
యథా విశ్వసతే దేవాం స్తథా కురు విమోహతమ్‌ | ఆయుధే చ బలం దేహి హతః స్యాద్యేనవా రిపుః. 58
తథే త్యుక్త్వా భగవతీ తత్రైవాంతర ధీయత | స్వాని స్వానినికేతాని జగ్ముద్దేనా ముదా%న్వితాః. 59

తల్లీ! విశ్వజననీ! ఇకమేము నీ పాదపూజమాత్రమెట్లు చేయగలము? ఏలన నీ పూలు ఈ మంత్రములు ఈ మేమందఱము నీ పరిణామమే కదా! నీ పరాశక్తి చైతన్యములోని భిన్నరూపములమే కదా! కావున మేము నీ దివ్య పదరాజీవములకు తలలొగ్గి నమస్కారములు మాత్రము చేతుము. ముముక్షువులు మోహరాగవికారములు లేనివారు. పరమయోగులు. వారు తమ చిత్తములందు నిరంతరముగ భవసాగర నౌకవంటి నీ పదనళిన యుగమును పరమభక్తితో సేవింతురు. వారు నీ సుప్రసన్నతతో ధన్యజీవులు వేదవిదులగు యాజ్ఞికులు యాగములందు దేవతలను పితృదేవతలను తృప్తిపఱచు స్వాహా స్వధారూపిణివగు నిన్నే స్మరింతురుగదా తల్లీ! నీవు కాంతివి. శాంతివి. మేధవు. ప్రజ్ఞవు. నరులలోని సుబుద్ధివి. శ్రద్ధవు. సర్వము నీవే. ఈ భువనములందు నిన్ను గొల్చువారికి దయతో వైభవము లొసగుతల్లివి నీవే. అని యీ విధముగ విబుధులు ప్రస్తుతింపగా శ్రీదేవి యిట్లు ప్రత్యక్షమయ్యెను: శ్రీదేవి పంచదశాత్మైక స్వరూపిణి. దివ్యభూషితరంజిత. పాశ-అంకుశ-వర-అభయములతో నొప్పుకరాంబుజయుత. కింకిణీరశనల నలరు శృంగానర మధ్యమ. కలకంఠకంఠరవ- కనకాంగదకేయూరభకూషిత. చంద్రరేఖ వెలుగొందు రత్నమకుటముచే విరాజిత. చిర్నగవు వెన్నెలలు కురియు తల్లి. విరిసిన తమ్ములవంటి మూడు కన్నులు కలది. పారిజాత కుసుమ స్వచ్ఛనాళ సమానకాంతి. రక్తవసన-రక్త చందన చర్చిత. అవ్యాజకరుణాపూర్ణ - ప్రసాదసుముః సకల శృంగార రసాధిదేవత - అనంతకోటి బ్రహ్మాండ జనని. సర్వజ్ఞ. సర్వకర్త్రి - సర్వాధిష్ఠానదేవత - సర్వవేదాంత ప్రతిసాద్య - సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిభువనేశ్వరీదేవి దేవతల ముందు ప్రత్యక్షమయ్యెను. దేవతలు శ్రీదేవిని సందర్శించి యామెకు దోసిలొగ్గిరి. అంత దేవి 'మీరు నన్నేల ప్రస్తుతించుచున్నారు? తెలుపడ'నెను. దేవతలిట్లనిరి : వృత్రుడు సురలను బాధించుచున్నాడు. అతనిని మోహపఱచుము. అతడు చచ్చునట్లుగ నీవు మా యాయుధములందు నీ దివ్యశక్తినుంచుము.' అంత శ్రీభగవతి యట్లే యని యచ్చోట నదృశ్యురాలయ్యెను. దేవతలు హర్షముతో తమతమ నెలవుల కరిగిరి.
ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు దేవలతకు శ్రీదేవి ప్రత్యక్షమగుట అను పంచమాధ్యాయము.

Thursday, April 16, 2020

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట - శుంభ నిశుంభుల వధార్ధాం

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట




నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథేమదానందరూపే సురానందదే తే
నమో దానవాంతప్రదే మానవానా మనేకార్థదే భక్తిగమ్య స్వరూపే. 25
న తే నామ సంఖ్యా న తే రూపమీదృక్తథా కోపి వేదాది దేవస్వరూపే
త్వమేవాసి సర్వేషు శక్తి స్వరూపా ప్రజాసృష్టి సంహారకాలే సదైవ. 26
స్మృతిస్త్వం ధృతిస్త్వం త్వమేవాసి బుద్ధి ర్జరా పుష్టి తుష్టీ ధృతిః కాంతిశాంతీ
సువిద్యా సులక్ష్మీర్గతిః కీర్తిమేదే త్వమేవాసి విశ్వస్య బీజం పురాణమ్‌. 27
యదా యైః స్వరూపైః కరోషీహకార్యం సురాణాంచ తేభ్యో గమామోద్య శాంత్యై |
క్షమా యోగనిద్రా దయా త్వం వివక్షా స్థితా సర్వ భూతేషు శసై#్తః స్వరూపైః. 28
కృతం కార్య మాదౌ త్వయా యత్సురాణాం హతోసౌ మహరి ర్మదాంధో హయారిః. |
దయా తే సదాసర్వదేవేషు దేవి ! ప్రసిద్ధా పురాణేషు వేదేషు గీతాః. 29
కిమత్రాప్తి చిత్రం యదంబా సుతే స్వం ముదా పాలయేత్పోష యేత్సమ్యగేవ |
యతస్త్వం జనిత్రీ సురాణాం సహాయా కరుషై#్వక చిత్తేన కార్యం సమగ్రమ్‌. 30
న వా తే గుణానా మియత్తాం స్వరూపం వయం దేవి జానీమహే విశ్వవంద్యే
కృపా పాత్ర మిత్యేవ మత్వా తథాస్మాన్భయేభ్యః సదా పాహి పాతుం సమర్థే. 31
వినాబాణపాతై ర్వినా ముష్ఠిఘాతై ర్వినాశూలఖడ్గైర్వినాశక్తి దండైః.
రిపూన్హంతు మేవాసి శక్వా వినోదా త్తథాపీహ లోకోప కారాయ లీలా. 32
ఇదం శాశ్వతంనైవ జానంతి మూఢానకార్యంవినా కారణం సంభవేద్వా
వయం తర్కయామోనుమానం ప్రమాణంత్వమేవాసి కర్తాస్య విశ్వస్య చేతి. 33
అజః సృష్టికర్తా ముకుందోవితాయం హరో నాశకృద్వైపురాణే ప్రసిద్ధః
నకిం త్వత్త్రపసూతాస్త్రయస్తే యుగాదౌ త్వమేవాసి సర్వస్య తే నైవ మాతా. 34
త్రిభి స్త్వం పురారాధితా దేవి దత్తాత్వయాశ క్తిరుగ్రా చ తేభ్యః సమగ్రా
త్వయా సంయుతాస్తే ప్రకుర్వంతి కామం జగత్పాలనోత్పత్తి సంహారమేవ. 35
తే కిం న మందమతయో యతయో విమూఢాస్త్వాం యేన విశ్వజననీం సముపాశ్రయంతి.
విద్యాం పరాం సకలకామఫలప్రదాంతాం ముక్తిప్రదాం విబుధ బృంద సువందితాంఘ్రిమ్‌. 36
యే వైష్ణవాః పాశుపతాశ్చ సౌరా దంబాస్త ఏవ ప్రతిభాంతి నూనమ్‌
ధ్యాంతి న త్వాం కమలాం చ లజ్జాం కాంతిం స్థితి కీర్తి మథాపి పుష్టిమ్‌. 37
'విశ్వేశ్వరీ! భక్తిగమ్యా! సచ్చిదానంద స్వరూపిణీ ! ప్రాణేశ్వరేశ్వరీ ! అశేషదుష్టదనుజమర్దినీ ! అమరానంద ప్రదాయినీ ! నీకు నమస్కారమమ్మా! ఆదిదేవీ! నీ యనంత నామరూపము లెవ్వడు నెఱుగజాలడు. సృష్టిసంహారాది కార్యములన్నిటిలో నీవు సర్వక్రియాశక్తి స్వరూపిణివి. సర్వేశ్వరీ ! స్మృతి-ధృతి-బుద్ధి-జర-తుష్టి-పుష్టి-కాంతి-శాంతి-విద్య-లక్ష్మి-గతి-కీర్తి-మేధ-విశ్వాదిబీజము-ఇవన్నియు నీవే అమ్మా! నీ వేయే దివ్యరూపములలో విబుధుల కార్యముల నిర్వహింతువో ఆ యాయా యద్భుత రూపములకు నమస్కరించుచున్నాము. నీవు శాంతి - క్షమ-యోగనిద్ర మున్నగు సర్వరూపములతో జీవులలో నివసింతువు. నీవు తొల్లి దేవతల మహోజ్జ్వల భవిష్యత్తునకై మదాంధుడగు మహిషాసురు నంతమొందించితి, ఆనాడు నీ యనుగ్రహభాగ్య మెల్ల సురలపట్ల నుండెను. నీవు దయామతల్లివని వేదములు నుద్ఘోషించుచున్నవి. తల్లి తన తనయుని గారాబముతో లాలించి పాలించి పెంచుననుటలో నచ్చెరువేమియునులేదు. నీవు నిఃల సురలకు సహాయ మొనర్చుదానవు. ఇపుడు తప్పక నీవు మా యెల్ల కార్యములు చక్కపఱచుము. విశ్వవంద్యా! నీ యనంత గుణరూపము లత్యద్భుతములు. మేము వాని నెఱుగజాలము. మేము నీ దయకు పాత్రులము. మా భయములు పాపుము. మమ్ము బ్రోవ నీవే సమర్థురాలవు. శత్రువులను పరిమార్చుటకు నీకు బాణములు - ముష్టిఘాతములు-శూలఖడ్గములు-శక్తిదండములు మున్నగువానితో పనిలేదు. నీవు లోకోపకారమునకు యుద్ధాదులొనర్తువు. అవి నీకు లీలావినోదమాత్రములే. ఈ జగము నశ్వరమని మూఢులకును తెలియును. కారణము లేక కార్యము జరుగదు. కాన నన్నిటికి నీవే మూలకారణము ప్రమాణము నని తలంతుము. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకర్తలుగా పురాణములందు ప్రఖ్యాతి వహించిరి. సృష్టికి మొదట త్రిమూర్తులను గన్నతల్లివి నీవే కదా! కనుక నీ విశ్వములకు జననివి నీవే. నీవు పూర్వము త్రిమూర్తులచే బూజింపబడితివి. వారికి పరిపూర్ణ దివ్యశక్తులు ప్రసాదించితివి. నీవు సృష్టి స్థితి సంహారవినోదవు. దేవవందితపాదకమలవు. సకల కామముక్తి ఫలదాయినివి, పరావిద్యవు. త్రిమూర్తులు నీ శక్తులనుగూడి తమ తమ పనులు చక్కగ నిర్వహించుచున్నారు. నిన్ను గొల్వనిచో యతులైనను మందమతులై మూఢులగుదురు. ఏకవు-లజ్జవు-కీర్తివి-పుష్టివి-కాంతివి-స్థితివి. నిన్ను ధ్యానింపని వైష్ణవులు-శైవులు-సౌరులు డాంబికులుగ నెన్నబడుదురు.
హరిహరా దిభి రప్యథ సేవతాత్వమి హ దేవవరై రసురై స్తథా.
భువి భజంతి న యోల్పధియో నరా జనని తే విధినా ఖలు వంచితాః. 38
జలధిజా పద పంకజ రంజనం జతురసేన కరోతి హరిః స్వయమ్‌
త్రినయనోపి ధరాధరజాంఘ్రి పంకజపరాగ నిషేవణతత్పరః. 39
కిమపరస్య నరస్య కథానకై స్తవ పదాబ్జయుగం న భజంతి కే
విగతరాగ గృహశ్చ దయాం క్షమాం కృతథియో మునయోపి భజంతి తే. 40
దేవి త్వదంఘ్రిభజనే న జనా రతా యే సంసారకూపపతితాః పతితాః కిలామీ
తే కుష్ఠ గుల్మ శిర ఆధియుతా భవంతి దారిద్య్రదైన్యసహితా రహితాః సుఖౌఘైః. 41
యే కాష్టభారవహనే యవసాపహారే కార్యేభవంతినిపుణాధనదారహీనాః
జానీమహే%ల్పమతిభిర్భవదంఘ్రిసేవా పూర్వేభ##వేజననితైర్నకృతాకదాపి. 42


జననీ! నీవు హరిహరాది దేవవరులచేత సేవింపబడుదువు. నిన్నీపుడమిపై కొంచెపు బుద్దివారు గొలువనోపరు. వారు నిజముగ విధివంచితులు. హరి స్వయముగ లక్ష్మియొక్క పదకమలములకు లత్తుకరంగు పూయును. శివుడును శివాచరణకమల రజము సేవింప గోరుకొనును. ఇక సామాన్యులగూర్చి చెప్పనేల? వీతరాగులు ధీమంతులు మునులు సైతము దయాక్షమాది సద్భావములతో నిన్నే సేవింతురు. కనుక లోకములందు నీ పదకమలములు సేవింపని వారెవరును లేరు. పారిజాత పరిమళములు విరజిమ్ము నీ చరణ కమలములకు పూల పూజ పచరింపని నరులు సంసారకూపనిపతితులు-పతితులు - కుష్ఠ గూల్మాది రోగ పీడితులు-దైన్య దారిద్ర సహితులు-సుఖరహితులు-నై యుందురు. తల్లీ! ఈ జన్మములో కట్టెలు గడ్డి గాదములు మోయుటలో నేర్పరులై - భార్య సంపదలు లేనివారె బుద్ధిహీనులై యున్నవారు గత జన్మములో నీ పదకమల సేవ చేయనివారని భావింతుము.'
అని యీ విధముగ దేవతలెల్లరును సంస్తుతింపగా మహాతిశయ లావణ్యయగు జగదంబ వేగిరమే కనికరముతో వారికి ప్రత్యక్షమయ్యెను.


దేవి స్తుమ స్త్వాం విశ్వేశి ప్రణతాః స్మ కృపార్ణవే | పాహి నః సర్వ దుఃఖేభ్యః సంవిగ్నా న్దైత్యతాపితాన్‌. 50
పురా త్వయా మహాదేవి నిహత్యాసురకంటకమ్‌ | మహిషం నో వరో దత్తః స్మర్తవ్యాహం యదాపది. 51
స్మరణా ద్దైత్యజాం పీడాం నావయిష్యా మ్యసంశయమ్‌ | తేన త్వం సంస్మృతా దేవి నూనమస్మాహభి రిత్యపి. 52
అద్య శుంభనిశుంభౌ ద్వావసురౌ ఘోరదర్శనౌ | ఉత్పన్నౌ విఘ్న కర్తారావహన్యౌ పురుషైః కిల. 53
రక్తబీజ శ్చ జలవాం శ్చండముండౌ తథా%సురౌ | ఏతై రన్యై శ్చ దేవానాం హృతం రాజ్యం మహాబలైః. 54
గతి రన్యా న చాస్మాకం త్వమేవాసి మహాబలే | కురు కార్యం సురాణాం వై దుఃఃతానాం సుమధ్యమే. 55
దేవాస్త్వదంఘ్రిభజనే నిరతాః సదైవ తే దానవైరతిబలై ర్విపదంసు గీతాః
తాన్దేని దుఃఖరహితా న్కురు భక్తి యుక్తా న్మాతస్త్వమేవ శరణం భవ దుఃఃతానామ్‌. 56
సకలభువనరక్షా దేవి కార్యా త్వయాద్య స్వకృతమితి విదిత్వా విశ్వమేతద్యుగాదౌ
జనని జగతి పీడాం దానవా దర్పయుక్తాః స్వబలమదసమేతా స్తే ప్రకుర్వంతి మాతః. 57


'దేవి! నీవు విశ్వేశ్వరివి. దయా సాగరవు. నీ కివే మా ప్రణా మాంజలులు. ఇవే మా స్తుతులు. మేము దైత్య పీడితులము. మాలో చింత మెఱమెఱలాడు చున్నది. మమ్ము దుఃఖములనుండి కాపాడు మమ్మా మహాదేవీ! తొల్లి నీవు లోక కంటకుడగు మహిషాసురుని వధించితివి. అపు డాపదలందు నన్ను స్మరింపుడని మా కభయ ప్రదాన మొనర్చితివి. నిన్ను స్మరించినంతనే దానవులవలని బాధలు తొలగింతు నంటివి. అందులకే మేమిపుడు నిన్ను స్మరించుచున్నాము. ఇపుడు శుంభ నిశుంభులను నిర్వురు ఘోరరాక్షసులు పుట్టి మా కార్యములకు విఘ్నము లొనర్చు చున్నారు. వారు పురుషులకు వధ్యులుగారు. రక్తబీజుడు-చండ ముండులు మహాబలవంతులు. వారు సురల రాజ్య మపహరించిరి. దేవదేవీ! మాకు నీవే దిక్కు. మా మొఱలాంలించి పాలించు మమ్మా! మేమాపదలలో జిక్కుకొంటిమి. మా కార్యము చక్కబెట్టుము. మాకు వేరే దిక్కెవ్వరునులేరు. అమరుల్లెవేళల నీ చరణ కమల సేవలో మగ్నులై యుందురు. ఐనను దైత్యులు వారి కాపదలు గల్గింతురు. అట్టి సురలు దుఃఃతులు-నీ యందలి నిశ్చల భక్తితత్పరులు. వారికి నీ కరావలంబ మొసగుము. వారిని దుఃఖరహితులుగ జేయుము. జననీ! విశ్వమంతయు నీచే సృజింపబడినది. అటులే యిపుడును విశ్వపరిరక్షణ నీ కవశ్య కర్తవ్యమగును.



శ్రీమద్దేవీ భాగవత పంచమ స్కంధమందు వేల్పులు శ్రీదేవిని సంస్మరించుట యను నిరువది రెండవ యధ్యాయము నుండి.

Wednesday, April 15, 2020

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట



అథ ప్రముదితాః సర్వే దేవా ఇంద్రపురోగమాః | మహిషం నిహతం దృష్ట్వా తుష్టువు ర్జగదంబికామ్‌. 1
బ్రహ్మ సృజత్యవతి విష్ణురిదం మహేశః | శక్త్యా తవైవ హరతే నను చాంత కాలే |
ఈశా న తేపి చ భవంతితయా విహీనా స్తస్యా త్త్వమేవ జగతః స్తితినాశకర్త్రీ. 2
కీర్తి ర్మతిః స్మృతిగతీ కరుణా దయా త్వం | శ్రద్ధా ధృతిశ్చ వసుధా కమలా జపా చ |
పుష్టిః కళాథ విజయా గిరిజా జయా త్వం తుష్టిః ప్రమా త్వమసి బుద్ధి రుమారమాచ. 3
విద్యా క్షమా జగతి కాంతి రహీనమేధా సర్వం త్వమేవ విదితా భువనత్రయేస్మిన్‌ |
ఆభిర్వానా తవతు శక్తిభిరాశు కర్తుం కో వాక్షమః సకలలోక నివాసభూమే. 4
త్వం ధారణా నను న చేదసి కూర్మనాగౌ ధర్తుం క్షమౌకథ మిలామపి తౌ భవేతామ్‌ |
పృథ్వీ న చేత్త్వమసి వా గగనే కథం స్థాస్యత్యేత దంబ నిఃలం బహుభారయుక్తమ్‌. 5
యే వా స్తువంతి మనుజా అమరా న్విమూఢా మాయాగుణౖస్తవ చతుర్ముఖ విష్ణురుద్రాన్‌ |
శుభ్రాంశువహ్ని యమవాయు గణేశముఖ్యా న్కింత్వామృతే జనని! తే ప్రభవంతి కార్యే. 6
యే జుహ్వతి ప్రవితతేల్పధియోంబ యజ్ఞవహ్నౌ సురాన్‌ సమధికృత్య హవిః సమృద్ధమ్‌ |
స్వాహా నచేత్త్వమసి తే కథ మాపురద్ధా త్వా మేవ కిం నహియజంతి తతోహి మూఢాః. 7
భోగప్రదా%సి భవతీహ చరాచరాణాం స్వాం శైర్దదాసి ఖలు జీవన మేవ నిత్యమ్‌ |
స్వీయా న్సురాన్‌ జనని పోషయసీహ యద్వత్తద్వత్పరానపి చ పాలయసీతి హేతోః. 8
మాతః స్వయం విరచితా న్విపినే వినోదా ద్వంధ్వా న్పలాశ రహితాం శ్చ కటూంశ్చ వృక్షాన్‌ |
నోచ్ఛేదయంతి పురుషా నిపుణాః కథంచి త్తస్మాత్త్వమ ప్యతితరాం పరిపాసి దైత్యాన్‌. 9
యత్త్వంతు హంసి రణమూర్ధ్ని శరైరరాతీ న్దేవాంగనాసురతికేళిమతీ న్విదిత్వా |
దేహాంతరేపి కరుణారసమాదదానా తత్తే చరిత్ర మిద మీప్సితపూరణాయ. 10
చిత్రం త్వమీ యదసుభీ రహితా న సంతి త్వచ్చింతితేనదనుజాః ప్రధిత ప్రభవాః
యేషాం కృతే జనని దేహ నిబంధనం తే క్రీడా రస స్తవ న చాన్యతరోత్ర హేతుః. 11
ప్రాప్తే కలా వహహ దుష్టతరే చ కాలే నత్వాం భజంతి మనుజా నను వంచితాస్తే |
ధూర్తైః పురాణ చతురై ర్హరిశంకరాణాం సేవా పరాశ్చ విహితా స్తవ నిర్మితానామ్‌. 12
జ్ఞాత్వా సురాం స్తవ వశానసురార్దితాంశ్చ యేవైభజంతి భువి భావయుతా విభగ్నాన్‌ |
ధృత్వా కరే సువిమలం ఖలు దీపకం తే కూపే పతంతి మనుజా విజలేతిఘెరే. 13
విద్యా త్వమేవ సుఖదాసుఖదా ప్యవిద్యా మాతస్త్వమేవ జననార్తి హరా నరాణామ్‌
మోక్షార్థిభి స్తు కలితా కిల మంద ధీభి ర్నారాధితా జనని భోగపరై స్తథాజ్ఞైః. 14


అట్లు మహిషాసురుడు నిహతుడైన పిదప నింద్రాది దేవతలు పరమానందమంది జగదంబిక నీవిధముగ ప్రస్తుతింప గడంగిరి : భగవతీ ! దేవీ ! నీ దివ్య శక్తి ప్రభావముననే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకార్యము లొనరింపగల్గుచున్నారు. కాని, నీ శక్తి తోడులేనిచో వారా యా పనులు చేయజాలరు. కనుక వాస్తవముగా సృష్టి-స్థితి-సంహారకారిణిని నీవే. శ్రీమాతా! నీవు సత్యముగ ధ్రువకీర్తివి-ధృతివి-మతివి-విశ్వగతివి; కరుణవు-దయవు-శ్రద్ధవు-వసుధవు; ఆజప గిరిజ కమల కల జయ యను పేరుగల దానవు; తుష్టి-పుష్టి-ప్రమ-బుద్ధి-ఉమ-రమ మున్నగు వారందఱు నీవే. ఈ భువన త్రయమందలి విద్యా-క్షమా-మేధాకాంతులు నీవే. సకల లోక నివాసభూమివి నీవే. ఈ నీ శక్తులు లేనివాడు లోకమందెందులకును కొఱగాడు. ఏమియు చేయనోపడు. విశ్వధారిణీ! నీవు ధారణాశక్తివి గానిచో శేషుడు భూమిని మోయునా? కూర్మము గిరిని భరించునా? అమ్మా! నిజమునకు నీవే భూమాతవు కానిచో మహాభారముగల భూమి నిరాధారముగ గగనతలము నందెట్లు నిలువగలదు? లోకజననీ! ఈ జనులు నీ మాయామోహితులై బ్రహ్మ విష్ణు రుద్ర చంద్రాగ్ని యమ వాయు గణపత్యాది దేవతలను సంస్తుతింతురు. ఆ దేవతలును నీచే శక్తి యుక్తులుగానిచో కార్యదక్షులగారుగదా! జగజ్జననీ! మూఢులు దేవతల నుద్దేశించి యజ్ఞాగ్నిలో హవిస్సు వేల్తురు. నీవు స్వాహా దేవివి గానిచో దేవతలా హుతము నెట్లు స్వీకరింపగలరు? జనులు నిన్ను వదలి యితరులను గొల్చుట వలన నిజముగ మూఢులేకదా మహేశ్వరీ! నీ నిజాంశముల వలన చరాచరప్రాణులకు వారివారి కర్మానుసారముగ భోగానుభవము లొసగుదువు. నీవు నీవారైన దేవతలను పోషించు విధమున పరులను సైతము పోషింతువు తల్లీ! మాతా! తోటలో వినోదమునకు నాటిన చెట్లు ఫలపుష్ప రసములు లేనివైనను పండితులు వానిని నఱికివేయరు. అట్లే నీవే దైత్యులను సైతము పాలింతువు. తల్లీ! నీ దయామృతరసమెంతని వర్ణింపగలము? నీవు నా బాణములతో దైత్యులను వధింతువు. ఏలన, వారును స్వర్గసీమలో సురాంగనలతో సురత క్రీడలనుభవించవలయునని నీవట్లు చేయుదువు. నీ పరమ చరితము భక్తుల కోర్కు లీడేర్చునది! అసురులు గొప్ప బలవంతులు. ఐనను వారు నీ సంకల్ప మాత్రమున నసువుల బాయుదురు. ఇది యాశ్చర్యకరము. నీవు దేహము దాల్చుట లీలా విలాసముగానే కాని మరే హేతువుచే గాదు. కలికాలమున పురాణ చతురులగువారు వంచకులు. వారి ప్రేరణవలన మూఢులు హరిశంకరులను సేవింతురేకాని నిన్ను భజింపరు. నరులకెంత దురవస్థ పట్టినది తల్లీ! లోకశరణ్యా! దేవతలు రాక్షసపీడితులు - అట్టి దేవతలు నీకు వశ్యులు - ఐనను నరులీలోకమున మూఢులై యా దేవతలనే భజింతురు. అయ్యో! చేతిలో నిర్మలదీప ముండినను వీరు నీరులేని చీకటి నూతిలో కూలుచున్నారే! జననీ! నీవు సుఖశాంతులొసగు సారవిద్యవు - ఘోర సంసార దుఃఖములు గల్గించునట్టి యవిద్యవు నీవే-నిన్నే నెఱనమ్మి యారాధించునట్టి ముముక్షుల యార్తి బాపు తల్లివి నీవే - అజ్ఞులు భోగలాలసులు మందమతులు నిన్ను సేవింప జాలరు.
బ్రహ్మ హరశ్చ హరిరప్యనిశం శరణ్యం పాదాంబుజం తవ భజంతి సురా స్తథాన్యే |
తద్వై న యేల్పమతయో మనసా భజంతి భ్రాంతాః పతంతి సతతం భవసాగరే తే. 15
చండి త్వదంఘ్రి జలజోత్థరజః ప్రసాదై ర్భ్రహ్మా కరోతి సకలం భువనం భవదౌ |
శౌరిశ్చపాతి ఖలు సంహరతే హరస్తు త్వాం సేవతే న మనుజ స్త్విహ దుర్భగోసౌ. 16
వాగ్దేవతా త్వమసి దేవి సురాసురాణాం వక్తుం న తే%మరవరాః ప్రభవంతి శక్తా !
త్వం చేన్ముఖే వససి నైవ యదైవ తేషాం యస్మా ద్భవంతి మనుజా న హి తద్విహీనాః. 17
శప్తో హరిస్తు భృగుణా కుపితేన కామం మీనో బభూవ కమఠః ఖలు సూకర స్తు
పశ్చా న్నృసింహఇతి యశ్ఛల కృద్ధరాయాం తా న్సేవతాం జనని మృత్యుభయం న కిం స్యాత్‌. 18
శంభోః పపాత భువి లింగమిదం ప్రసిద్ధం శాపేన తేన చ భృగో ర్విపినే గతస్య
తం యే నరా భువి భజంతి కపాలినం తు తేషాం సుఖం కథ మిహాపి పరత్ర మాతః. 19
యో%భూ ద్గజానన గణాధిపతి ర్మహేశాత్తం యే భజంతి మనుజా వితథ ప్రసన్నాః.
జానంతి తే న సకలార్థ ఫల ప్రదాత్రీం త్వాం దేవి విశ్వజననీం సుఖసేవనీయామ్‌. 20
చిత్రం త్వయా%రిజనతా%పి దయార్ద్రభావా ద్ధత్వా రణే శితశరైర్గమితా ద్యులోకమ్‌ |
నో చే త్స్వ కర్మ నిచితే నిరయ నితాంతం దుఃఖాతి దుఃఖగతి మాపద మాపతే త్సా. 21
బ్రహ్మ హరిశ్చ హరిరప్యుత గర్వభావా జ్జానంతి తే%పి విబుధా న తవ ప్రభావమ్‌ |
కే%న్యే భవంతి మనుజా విదితుం సమర్థాః సమ్మోహితాస్తవ గుణౖ రమిత ప్రభావైః. 22
క్లిశ్యంతి తేపి మునయస్తవ దుర్విభావ్యం పాదాంబుజం న హి భజంతి విమూఢ చిత్తాః.
సూర్యాగ్ని సేవనపరాః పరమార్థతత్వం జ్ఞాతం న తైః శ్రుతిశతై రపి వేదసారమ్‌. 23
మన్యేగుణాస్తవ భువి ప్రథిత ప్రభావాః కుర్వంతి యే హి విముఖా న్నను భక్తిభావాత్‌ |
లోకాన్స్వబుద్ధి రచితైర్వివిధాగమైశ్చ విష్ణ్వీశభాస్కరగణేశపరా న్విధాయ. 24
కుర్వంతి యే తవ పదా ద్విముఖా న్నరాగ్ర్యాన్స్వో క్తాగమై ర్హరిహరార్చన భక్తియోగైః |
తేషాం న కుప్యసి దయాం కురు షే2ంబికే త్వం తాన్మోహమంత్ర నిపుణాన్ర్పథయస్యలంచ. 25
తుర్యే యుగే భవతి చా2తిబలం గుణస్యతుర్యస్య తే న మథితా న్యసదాగమాని |
త్వాం గోపయంతి నిపుణాః కవయః కలౌ వై త్వత్కల్పితా న్సురగణానపి సంస్తువంతి. 26
ధ్యాయంతి ముక్తిఫలదాం భువి యోగసిద్ధాం విద్యాం పరాంచ మునయోతి విశుద్ధసత్త్వాం |
తే నాప్నువంతి జననీజఠరేతు దుఃఖం ధన్యా స్త ఏవ మనుజా స్త్వయి యే విలీనాః. 27
చిచ్ఛక్తి రస్తి పరమాత్మని తేన సోపి వ్యక్తో జగత్సు విదితో భవకృత్య కర్తా.
కోన్యస్త్వయా విరహితః ప్రభవత్యముష్మి న్కర్తుం విమర్తుమపి సంచలితు స్వశక్త్వా. 28
తత్త్వాని చిద్విరహితాని జగద్దిధాతుం కిం వా క్షమాణి జగదంబ యతో జడాని |
కించేంద్రియాణి గుణకర్మయుతాని సంతి దేవి త్వయా విరహితాని ఫలం ప్రదాతుమ్‌. 29
వరేణ్యము శరణ్యమునగు నీ పాదకమల యుగమును హరి హర బ్రహ్మాది దేవతలు సంతతము కొల్చు చుందురు. అల్పమతులగు భ్రాంతులు నిన్ను సేవింప నోపక సంసారసాగరమున గూలుదురు. చండికా! భవదీయ దివ్యచరణ కమల ప్రసాదముననే బ్రహ్మ-విష్ణు-మహేశులు-సృష్టి-పాలన-సంహార కార్యము లొనరింతురు. ఈ భూమిపై నిన్ను గొల్వనివారికి నోటమాట యెటుల వచ్చును? పరా వాగ్దేవీ! నీ దయలేనిచో మనుజులు సైతము మాటాడజాలరుగదా! జగదేకమాతా! భృగు మహర్షి కుపితుడై హరిని శపించెను. అందుచే హరి మీన-కూర్మ-వరాహ-నారసింహ-వామనాది రూపములు దాల్చెను. అట్టి పరాధీనుడగు వానిని గొల్చినవానికి మృత్యుభయమెట్లు పాయును? దయా కల్పవల్లీ! తల్లీ! తొల్లి శివుడు వనమునందు చరించు చుండగ భృగు మహర్షి శివుని శపించెను. అపుడు శివుని లింగము నేలపైపడెను. ఇది అందఱికిని దెలిసినదే కదా! అట్టి కపాలిని గొల్చినవారి కిటనట సుఖమెటుల గల్గును? అమ్మా! శివుని కొడుకు గణపతి. అతనిని గొల్చువారెంతటి భ్రాంతులనవలయును. వారు సకలార్థ ప్రదాయినివి సుఖసేవ నీయవు విశ్వజననివియగు నిన్నుఱుగ జాలరు గదమ్మా? అమ్మా! నీ శరములచే రాక్షసులు రణమున మరణింతురు. దయగల నీ యమృతపు చూడ్కులు వారిని సైతము స్వర్గమున కంపును గదా? కానిచో వారు తప్పక తమ కర్మాను సారముగ పాపగతియగు నరకమున గూలెడి వారే కదా! హరిహర బ్రహ్మలును గర్వమోహమున నీ మహోజ్జ్వల దివ్యప్రభావము నెఱుగజాలరు. ఇంక నీ గుణ ప్రభావములకు మాయామోహితులగు నరులు నిన్నెట్టులెఱుగ జాలుదురు? విశ్వమాతా! మహామునులు సైతము సూర్యాగ్నులను సేవించి మూఢ మతులగుదురు. నీ భవ్యపదపద్మములు వేదశతములకును దెలియరాని పరమార్థతత్త్వము వంటివి. అట్టి నీ పదపద్మములను మునులు సేవింపక కర్మక్లేశము లనుభవింతురు. శుభకారిణీ! జననీ! ఈ లోకములందు త్రిగుణమాయా మూలమున వివిధాగమముల మూలమున హరి-హర-రవి-గణపతుల యుపాసనలు వ్యాపించినవి. మూఢులు వీనిని గల్పించుకొని నీ విషయమున భక్తిభావమును విముఖులై యుందురు. ఓహో త్రిభువనేశ్వరీ! తల్లీ! జనులు విప్రులాగమ శాస్త్రములను తామే రచించుకొనిరి. వారు వానితో భక్తిభావముతో హరిహరుల నర్చింతురు. కాని, వారు మహామహిమగల నీ పదపద్మ సేవకు పెడమొగము పెట్టుదురు. ఐనను నీవు వారిని కోపింపక మోహకమంత్రశాస్త్ర నిపుణులుగ జేతువు. వారిపై నీ యపారదయామృతమును ప్రసరింపజేయుదువు. ప్రణతసౌభాగ్యదాయినీ! జననీ! తొల్లిటి సత్యయుగమునందు శుద్ధసత్త్వగుణము ప్రధానముగ నుండెను. ఆనాడు సచ్ఛాస్త్రములు కానివి లేవు. కాని, యీ కలియుగమున బుద్ధిచతురులగు కవులు-పండితులు నీ నిత్య సత్యోపాసనకు స్వస్తి చెప్పి, నీవు కల్పించిన సురగణములను పూజింతురు. అవిద్యను బాపు భార్గవీ! తల్లీ! నిర్మలసత్త్వగుణముగల మునులు పరావిద్య-దరిద్ర చింతామణి - చైతన్య మధుఝురి-ముక్తియోగఫలసిద్ధిద అగు నిన్నాత్మవిచారముతో ననుధ్యానించి తల్లీనులై గర్భనరకములో గూలరు. అట్టివార లెట్టి పుణ్యులు ధన్యులు మహాత్ములో కదా! మమ్మాదుకొను అభయవరదపదకమలా! అమ్మా! నీవు చిచ్ఛక్తి రూపమున నిర్గుణ పరమాత్మయందు వెలయుచుందువు. అందుచేతనే పరమాత్ముడు సృష్టిపాలన సంహారము లొనర్పగల్గునని తెలియుచున్నది. హృదయాంతరమున నీ స్పందనశక్తి లేనిచో ప్రాణికి శక్తి యెక్కడిది? నీ శక్తిలేని నరుడు తిరుగుటకును చలించుటకును పనిచేయుటకును జగమున నెట్లు సమర్థుడు కాగలడు? చైతన్య సుమమధూ! అంబా! చతుర్వింశతి తత్త్వములును జడతామయములు- చిచ్ఛక్తి రహితములు. అవి జగములను నిర్మింపజాలవు. ఇంద్రియములు గుణకర్మయుతములు. అవియును నీ శక్తితో గూడనిచో ఫలితము లొసగజాలవు.
దేవా మఖేష్వపి హుతం మునిభిః స్వభాగం గృహ్ణీయు రంబ విధివ త్ప్రతిపాదితం కిమ్‌ |
స్వాహా న చేత్త్వమసి తత్ర నిమిత్తభూతా తస్మాత్త్వ మేవ న తు పాలయసీవ విశ్వమ్‌. 30
సర్వం త్వయేద మఃలం విహితం భవాదౌ త్వం పాసి వై హరిహర ప్రముఖా న్దిగీశాన్‌ |
కాలే%సి విశ్వమపి తే చరితం భవాద్యం జానంతి నైవ మనుజాః క్వ ను మందభాగ్యాః. 31
హత్వా%సురం మహిషరూపధరం మహోగ్రం మాత స్త్వయా సురగణః కిల రక్షితోయమ్‌ |
కాం తేస్తుతిం జనని మందధియో విదామో వేదా గతిం తవ యథార్థతయా న జగ్ముః. 32
కార్యం కృతం జగతి నో యదసౌ దురాత్మా వైరీహతో | భువనకంటక దుర్విభావ్యః |
కీర్తిః కృతానను జగత్సు కృపా విధేయాప్యస్మాం శ్చ పాహి జనని ప్రథిత ప్రభావే. 33
ఏవం స్తుతా సురైర్దేవీ తానువాచ మృదుస్వరా | అస్యత్కార్యం చ దుఃసాధం బ్రువంతు సురసత్తమాః. 34
యదా యదా హి దేవానాం కార్యం స్యా దతి దురటమ్‌ |
స్మర్త్యవ్యాహం తదా శీఘ్రం నాశయిష్యామిచాపదమ్‌. 35
దేవా ఊచుః: సర్వం కృతం త్వయా దేవి కార్యం నః ఖలు సాంప్రతమ్‌ |
య దయం నిహతః శత్రు రస్మాకం మహిషాసురః. 36
స్మరిష్యామో యథాతేంబ సదైవ పదపంకజమ్‌ | తథాకురు జగన్మాత ర్భక్తిం త్వయ్యప్యచంచలామ్‌, 37
అపరాధ సహస్రాణి మాతైవ సహతే సదా | ఇతి జ్ఞాత్వా జగద్యోనిం న భజంతే కుతో జనాః. 38
ద్వౌ సుపర్ణౌ తు దేహేస్మిం స్తయోః సఖ్యం నిరంతరమ్‌ |
నాన్యః సఖా తృతీయోస్తి యోపరాధం సహేత హి. 39
తస్మా జ్జీవః సఖాయం త్వాం హిత్వా కిం ను కరిష్యతి | పాపాత్మా మందభాగ్యోసౌ సురమానుష యోనిషు. 40
ప్రాప్య దేహం సుదుష్ప్రాపం న స్మరేత్త్వాం నరాధమః | మనసా కర్మణా వాచా బ్రూమః సత్యం పునః పునః 41
సుఖే వా%ప్యథవా దుఃఖే త్వం నః శరణ మద్భుతమ్‌ | పాహి నః సతతం దేవి సర్వై స్తవ వరాయుధైః. 42
అన్యథా శరణం నాస్తి త్వత్పదాంబుజరేణుతః | ఏవం స్తుతా సురై ర్దేవీ తత్రైవాంతరధీయత. 43
విస్మయం పరమం జగ్ముర్దేవా స్తాం వీక్ష్య నిరత్గామ్‌. 44
ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ఏకోనవింశోధ్యాయః.
అమ్మా! భవానీ! మునులు విధిప్రకారమున యజ్ఞములందు హోమము చేయుదురు. నీవు యజ్ఞములందు స్వాహాదేవివై నిమిత్తమాత్రముగ నుందువు. కానిచో దేవతలు హవిర్భాగములు గ్రహింపజాలరు. కనుక తల్లీ! ఈ విశ్వమున కేడుగడ నీవే అమ్మా, మాతా! తొలిసృష్టి రచన తొలుదొల్త నీవలననే జరిగినది. నీవు హరిహరాదులను దిక్పతులను పరిపాలింతువు. నీవంతకాలమున విశ్వమంతటిని సంహరింతువు. కనుక నీ సచ్చరిత్ర దేవతలకే యెఱుగరానిది. ఇక మందభాగ్యులగు నరు లెట్లెఱుగగలరు? బ్రహ్మ గ్రంథి విచ్ఛేదినీ! శివమహిషీ! మహిషరూపము దాల్చిన మహోగ్ర రాక్షసు నంతమొందించి దేవతలను బ్రోచితివి. నీ తత్త్వమును వేదములు సైత మెఱుగజాలవు. మందమతులమగు మేమెట్లు నిన్ను నుతింపగలము? ఓ మహిషాసురమర్దినీ! అహంమమతానాశినీ! భువనకంటకుడు దుర్దముడు దుష్టుడు నగు రాక్షసుని సంహరించి మాకు శుభము గూర్చితివి. నీ చల్లని కీర్తిచంద్రికలు జగము లెల్ల నిండినవి. కాన తల్లీ! మమ్మనుగ్రహించి సతతము కాపాడగదవమ్మా! అని విబుధులు సన్నుతింపగ శ్రీదేవి సంతసించి వారికి మృదుమధుర స్వరమున నిట్లనియెను : సురలారా! మీ కింకను సాధ్యముగాని పని యున్నచో దెలుపుడు. మీ కసాధ్యమైన కార్య మెప్పుడెపుడు సంభవించునో యప్పుడపుడు నన్ను స్మరింపుడు. తలచినంతనే నేను మిమ్మాదుకొందును. మీ యాపదలు తొలగింతును'' అన దేవత లిట్లనిరి: దేవీ! అఃల దేవతాత్మా! మా శత్రువగు మహిషాసురుని సంహరించితివి. మమ్ముద్ధరించితివి. మా కార్యము నెరవేర్చితివి. అమ్మా! అభయ వరము లొసగు నీ పదపద్మములను మేము నిరంతరము సంస్మరించునట్లును మాకు నీయందు నిశ్చలైకాంతికభక్తి గల్గునట్లు ననుగ్రహింపుము. అమ్మా! నీవమ్మవలె మా యపరాధము లన్నియు సైతువని జనులకు తెలియును. ఐనను ఆరు జగత్కారణవగు నిన్ను భజింపరు. ఈ శరీరమునందు రెండు పక్షులు స్నేహముతో నివసించుచున్నవి. అపరాధములు సైచు మూడవ మిత్రు డెవడును లేడు. ఆ రెంటిలో జీవు డొక పక్షి. అతడు నిన్ను వదలినచో నతనికి గతులు లేవు. అట్టివాడు దేవమనుజులందు మహాపాపి-మందభాగ్యుడు. ఈ మనుజ జన్మము కడు దుర్లభ##మైనది. ఇట్టి యుత్తమజన్మ బడసియును మనోవాక్కాయ కర్మలతో నిన్ను స్మరింపనివాడు నిజముగ నరాధముడని మేము పలుమారులు నొక్కి పలుకుచున్నాము. కావున తల్లీ! లోకశరణ్యా! మా సుఖదుఃఖములందు మాకు నీవే శరణ్యము. దేవీ! నీ సర్వాయుధములతో మమ్ము సర్వకాలము బ్రోచుచుండుము తల్లీ! నీ పదపద్మరజము గాక మాకు మఱి శరణము లేదమ్మా!'' అని యీ ప్రకారముగ స్తుతింపబడి శ్రీదేవి యచ్చట నదృశ్యురాలయ్యెను. అట్లు దేవి యంతర్ధానమందుట గని దేవత లెల్లరును పరమ విస్మయమందిరి.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు దేవతలు శ్రీదేవిని సంస్తుతించుటయను పందొమ్మిదవ యధ్యాయము.

Tuesday, April 14, 2020

శ్రీదేవి దివ్యస్వరూపము

శ్రీదేవి దివ్యస్వరూపము




విష్ణుని వచనములు విని యెల్ల దేవతలును సహర్షముగ శ్రీదేవికి తమ తమ దివ్యభూషణములు వస్త్రములు దివ్యాయుధములు సమర్పించిరి. శ్రీదేవికి క్షీరసాగరము ప్రీతితో నక్షయములు దివ్యములు సూక్ష్మములు నగు రెండెఱ్ఱని వస్త్రములు నొక మిగుల నలంకృతమగు మణిహారము నొసంగెను. విశ్వకరమ ప్రసన్నములగు ఇంద్రియములును మనస్సున కలవాడై సూర్యకోటి సమప్రభలతో వెలుగు దివ్య చాడామణిని చెవులకు శుభకుండలములను భుజములకు దివ్యకటకములను నానా రత్న విరాజితములై దివ్యములైన కేయూర కంకణములను దేవి కొసంగెను. దేవి పదపద్మములకు త్వష్ట సూర్యకాంతి సదృశకాంతులు విరజిమ్ముచు నిర్మల మంజుల రత్నభూషితములైన గజ్జెలందియ లొసంగెను. మహాసాగరుడు దేవదేవికి సర్వతేజోవంతములగు ముద్దుటుంగరములు సుందర కంఠహారములు నొసంగెను. వరుణదేవుడు శ్రీదేవికి వాడని కమలముల మాలను వైజయంతిని కానుకగ నొసంగెను. కమ్మని నెత్తావులు గుబాళించుటవలన కమలముల చుట్టు గుండుతుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. హిమవంతుడు సంతుష్టుడై బంగారమువంటి కాంతితో మనోహరమగు సింహవాహనమును వివిధ రత్నరాసులను దేవి కర్పించెను. ఈ విధముగ శ్రీదేవి సకల లక్షములతో భూషణములతో శ్రేష్ఠురాలై శుభరూపయై వరారోహయై మృగరాజుపై విరాజిల్లుచుండెను. అంత చక్రి తన చక్రమందుండి యొక దివ్య సుదర్శన చక్రమును సముత్పన్న మొనరించి శ్రీదేవి కొసంగెను. ఆ చక్రము రక్కసిమూకలు తలలు ప్రక్కలించుటకు సమర్థమై యుండెను. శూలి తన శూలమునుండి యొక యుత్తమ త్రిశూల ముత్పన్న మొనరించి మహాలక్ష్మి కొసంగెను. ఆ శూలము సురవైరులను నరుకజాలి సురల భయ ముడుపజాలి వెలుగొందుచుండెను. వరుణుడు తన శంఖమందుండి అతి శుభకరమగు నొక శంఖము సృజించి దేవికి ప్రసన్నమతితో నొసంగెను. అది మహాఘోష గంభీరమై దివ్యమై తనరారుచున్నది. అగ్నిదేవుడు దైత్య వినాశకరమైన తీవ్రవేగముగల శతఘ్నియగు శక్తిని శ్రీదేవికి ప్రదానము చేసెను.


వాయుదేవుడు గొప్ప చాపమును కఱకుటమ్ములతో నిండిన యమ్ముల పొదియుగు శ్రీదేవి కొసంగెను. ఆ ధనువు లాగుటకు శక్యముగాక చూపఱ కచ్చెరువు గొల్పుచు భీకర టంకారమున నొప్పుచుండెను. ఇంద్రుడు తన వజ్రము నుండి సిద్ధపఱచిన యొక దారుణ వజ్రమును ఐరావతము నుండి శోభన శబ్దము కలదియు అతి సుందరమును నగు నొక ఘంటను శీఘ్రమే సమర్పించెను. కాలము తీరిన యెల్ల ప్రాణులకు దేనివలన చావుమూడునో యట్టి కాలదండము నుండి యముడొక దండమును సృజించి దేవి కర్పించెను. బ్రహ్మ గంగాజల పూరితమైన దివ్య కమండలువును వరుణుడు దివ్యపాశమును సంతసమున దేవదేవి కొసంగిరి. కాలుడు ఖడ్గ చర్మములను విశ్వకర్మ వాడి గండ్ర గొడ్డలిని శ్రీదేవికి సమర్పించిరి. వరుణ కుబేరులు దేవికి వరుసగ మనోహరమైన కమలమును సురతో నిండిన బంగరు మధుపాత్రను నందించిరి. త్వష్ట దానవ నాశనికి ప్రసన్న చిత్తముతో సురశత్రు వినాశనియు నూఱు గంటలతోకూడి ధ్వనించుచున్నదియు నగు కౌమోదకీ గదను సమర్పించెను. త్వష్ట దేవికి వైరులను నుగ్గొనర్చు పెక్కు విధములగు దివ్యాస్త్రములను భేదింపరాని కవచము నర్పించెను. సూర్యుడా జగదంబకు తన దివ్యతేజము నొసంగెను. ఆమె భూషణములతో నాయుధములతో విలసిల్లు త్రైలోక్యమోహినిగ శివస్వరూపిణిగ ప్రకాశించు చుండెను. 


శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమస్కంధమందు శ్రీదేవి దివ్యస్వరూపమును మహిషుడు మోహితుడగుటయను నవమాధ్యాయము. నుండి.

Monday, April 13, 2020

దేవతలు చేసిన శ్రీ జగదంబ స్తుతి

దేవతలు చేసిన  శ్రీ జగదంబ స్తుతి


ఊర్ణనాభాద్యథా తంతు ర్విస్ఫులింగా విభావసోః | తథా జగద్యదేతస్యా నిర్గతం తాం నతా వయమ్‌. 10
యన్మాయాశక్తి సంక్లప్తం జగత్సర్వం చరాచరమ్‌ | తాం చితం భూవనాధీశా స్మరామః కరుణార్ణవామ్‌. 11
యదజ్ఞానా ద్భవోత్పత్తి ర్యద్జానాద్భవనాశనం | సంవిద్రూపాం చ తాం దేవీం స్మరామః సాప్రచోదయాత్‌. 12

సాలెపురుగు నుండి దారములు వెల్వడునట్లే అగ్నినుండి మిణుగురులు బయలు వెడలునట్లే యెవరి నుండి యీ సకల జగములు పుట్టుచున్నవో యా విశ్వమాతకు మా మనస్సులు. ఏ మహా మాయాశక్తిచే నీ చరాచర జగమంతయును రచింపబడెనో యట్టి యచింత్య లక్షణములుగల చిత్కారణా స్వరూపిణిని మేము స్మరింతుము. ఏ మాయాతత్త్వ మెఱుగినచో సంసారము ఉత్పన్నమై తోచునో యే దివ్య తత్త్వ మెఱిగినచో సంసారము నశించునో యట్టి చిద్రూపను స్మరింతుము. ఆ వరేణ్యమైన చైతన్య జ్యోతి మా బుద్ధులను తచ్చింతనకు ప్రేరించుగాక!
మహాలక్ష్మై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్‌.
మాతర్నతాః స్మ భువనార్తి హరే! ప్రసీద శం నో విధేహి కురు కార్యమిదం దయార్ద్రే| 13
భారం హరస్వ వినిహత్య సురారివర్తం మహ్య మహేశ్వరి ! సతాం కురు శం భవాని!
యద్యంబుజాక్షి దయసే న సురాన్కదాచి త్కిం తే క్షమా రణముఖేస్తి శరైః ప్రహర్తుమ్‌! 14
ఏతత్త్వయైవ గదితం నను యక్షరూపం ధృత్వా తృణం దహ హుతాశ పదాభిలాపైః.
కంసః కుజోథ యవనేంద్రసుతశ్చ కేశీ బార్హద్రథో బకబకీ ఖరశాలాకల ముఖ్యాః| 15
యేన్యే తథా నృపతయో భువి సంతి తాంస్త్వం హత్వా హరస్వజగతో భర మాశు మాతః.
మే విష్ణునా న నిహతాః కిల శంకరేణ యే వా విగృహ్య జలజాక్షి! పురందరేణ| 16
తే తే సుఖం సుఖకరం సుసమీక్షమాణా స్సంఖ్యే శరైర్వినిహతా నిజలీలాయాతే,
శక్తిం వినా హరిహరప్రముఖాః సురాశ్చ నైవేశ్వరా విచలితుం తవ దేవదేవి | 17
కిం ధారణావిరహితః ప్రభురప్యనంతో ధర్తుం ధరాం చ రజనీశకలావతం సే.
ఇంద్రః. వాచా వినా విధిరలం భవతీహ విశ్వం కుర్తుం హరిః కిము రమరహితోథ పాతుమ్‌ | 18
సంహర్తుమీశ ఉమయోజిత ఈశ్వరః కిం తే తాభిరేవ సహితాః ప్రభవః ప్రజేశాః.
విష్ణుః: కర్తు ప్రభుర్న ద్రుహిణో న కదాచనాహం నాపీశ్వరస్తవ కళారహిత స్త్రిలోకాః! 19
కుర్తుం ప్రభుత్వమనఘెత్ర తథావిహర్తుం త్వం వై సమస్త విభవేశ్వరి భాసి నూనమ్‌. 20
ఏవం స్తుతా తదా దేవీ తానాహ విభుదేశ్వరాన్‌ | కిం తత్కార్యం వదంత్వద్య కరోమి విగతజ్వరాః! 21
అసాధ్య మపి లోకేస్మిం స్తత్కరోమి సురేప్సితమ్‌ | శంసంతు భవతా దుఃఖం ధరాయాశ్చ సురోత్తమాః. 22
దేవా ఊచుః: వసుధేయం భరాక్రాంతా సంప్రాప్తా విభుధాన్ప్రతి | రుదతీ వేపమానా చ పీడితా దుష్టభూభుజై. 23
ఓ జగదేక జననీ! భువనార్తిహారిణీ! మహేశ్వరీ! వివిధ శక్తులతో భాసిల్లు చిద్రూపిణీ! భవానీ! నీకు మా నమస్కారములు. మా యెడల సుప్రసన్నవై మాకు శ్రేయములు గల్గించుచు మా కార్యములు నెరవేర్చుము. రాక్షస వర్గమును నశింపజేసి భూభార ముడిపి శిష్యులకు శ్రేయము కలిగింపుము. ఓ రాజీవలోచనా! నీవు దేవతలపై దయజూపనిచో సమరాంగణమున నస్త్ర శస్త్రములతో శత్రువుల నెదుర్కొనజాలు వాడెవడుండెను? తొల్లి నీవు యక్షరూపము దాల్చి యగ్నితో ఈ గడ్డిపోచ గాల్చుము చూతుము' అని పలికినట్లు చెప్పితిని. ఈ విశాల ధరణిపై కంసుడు - భౌముడు - కాలయవనకేశులు - బక జరాసంధులు - ఖరశాల్వపూతనాదులు - నితర క్రూరరాజులను గలరు. వారి నెల్లర నంతమొందించి ధరాభారము తొలగింపగదే తల్లీ! కమలాక్షీ! ఇంద్ర శివ విష్ణువుల వలన రాక్షసులు కొందఱు చావకుండిరి. వారు మున్ను నీ సుఖకరమైన రూపము చూచుచుండగనే నీ బాణములతో నవలీలలగ మడిసిరి. ఓ చంద్రకళావతంసా! నీ చైతన్యశక్తి తోడులేనిచో బ్రహ్మ విష్ణు దేవులు నడుగు దీసి యడుగిడ నేరరు. అనంతుడును ధారణాశక్తి లేనిచో భూమిని మోయజాలడు. ఇంద్రుడిట్లనెను. వాగ్రూప క్రియాశక్తి యగు సరస్వతి తోడులేనిచో బ్రహ్మయును పద్మ లేనిచో పద్మనాభుడును గిరిజ లేక గిరీశుడును విశ్వమును పుట్టించి పెంచి తుదముట్టింప నోపరు. త్రిశక్తులతో గూడినంతనే త్రిమూర్తులగు ప్రజాపతులును తమ తమ కార్యములందు నిపుణులగుదురు. విష్ణు విట్లు నుడివెను : ఓ విమలజ్ఞానరూపా! నీ కళాశక్తి లేనిచో బ్రహ్మ విశ్వరచనము - నేను విశ్వపాలనము - శర్వుడు విశ్వసంహారము చేయ దక్షులముగాము. నీవొక్కతెవే యీ సమస్తమున కేలికవై విహరింపగలవు. నీవు సకల విభవముల కధీశ్వరివని నిక్కముగ మాకు దోచుచున్నావు.

శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు శ్రీ జగదంబను దేవతలు సంస్తుతించుటయను పందొమ్మిదవ యధ్యాయము నుండి.