Saturday, April 11, 2020

సుబాహు చేసిన శ్రీ దుర్గా స్తుతి

సుబాహు చేసిన శ్రీ దుర్గా స్తుతి


నమో దేవ్యై జగద్ధాత్య్రై శివాయై సతతం నమః |
దుర్గాయై భగవత్యై తే కామదాయై నమోనమః. 42
నమః శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే! నమః | విశ్వవ్యాపై#్త్య జగన్మాత ర్జగద్దాత్ర్యై నమః శివే! 43
నాహం గతిం తవ ధియా పరిచింతయ న్వై జానామి దేవి! సగుణః కిల నిర్గుణాయాః |
కిం స్తౌమి విశ్వజనని ! ప్రకటప్రభావామ్‌ భక్తార్తినాశనపరాం పరమాం చ శక్తిమ్‌. 44
వాగ్దేవతా త్వమసి సర్వగతైవ బుద్ధి ర్విద్యా మతిశ్చ గతిర ప్యసి సర్వజంతోః |
త్వా స్తౌమి కిం త్వమసి సర్వమనో నియంత్రీ కిం స్తూయతే హి సతతం ఖలు చాత్మరూపమ్‌. 45
బ్రహ్మో హరశ్చ హరిర ప్యనిశం స్తువంతో నాంతంగతాః సురవరాః కిల తే గుణానామ్‌ |
క్వాహం విభేదమతి రంబ గుణౖ ర్వృతో వై వక్తుం క్షమస్తవ చరిత్ర మహో ప్రసిద్ధః. 46
సత్సంగతిః కథమహో న కరోతి కామమ్‌ ప్రాసంగిక్బాపి విహితా ఖలు చిత్తశుద్ధిః |
జామాతు రస్య విహితేన సమాగమేన ప్రాప్తం మయా%ద్భుత మిదం తవ దర్శనం వై. 47
బ్రహ్మా2పి వాంఛతి సదైవ హరో హరిశ్చ సేంద్రాః సురాశ్చ మునయో విదితార్థతత్త్వాః |
యద్దర్శనం జనని | తే%ద్య మయా దురాపమ్‌ ప్రాప్తం వినా దమశమాది సమాధిభిశ్చ. 46
జగద్ధాత్రీ శివా దుర్గా కామదా భగవతి యగు శ్రీదేవికి నేను ప్రణమిల్లుచున్నాను. శ్రీవిద్య శివ శాంత మోక్షద విశ్వవ్యాపిని యగు జగదేకమాత కంజలి ఘటించుచున్నాను. పరమశక్తివగు విశ్వమాతా ! దివ్యదేవీ! ఈ నా యల్పబుద్ధితో సుగుణ నిర్గుణములలోన నీ మార్గమేదియో యెఱుగలేకున్నాను. నీవు భక్తార్తిభంజనివి. నీ దివ్య సత్ప్రభావమును వినుతింప నేనెవ్వడను? ఓ దేవీ! నీవే వాగ్దేవతవు. సర్వజంతువులకు సర్వగతివి - సద్బుద్ధివి - మతివి నీవే. సకల మనోనియంత్రివి నీవే. నిన్ను సర్వాత్మత్వభావముతో నిత్యము నుతించుట కెటు సాధ్యపడును తల్లీ? అమ్మా! హరిహరబ్రహ్మలును సురవరులును నిన్ను విడువక సంస్తుతించుచున్నను నపారసుగుణవారాశివగు నీపారమెఱుగజాలకున్నారు. విషయగుణబద్ధుడను భిన్నమతిని నగు నేను నీ దివ్యసచ్చరితప్రభావ మెట్లెఱుంగగలను? ఈ చపలచిత్త మొకమట్టుకు నీ సచ్చరిత్రను నీ సత్సాంగత్యమును బడయ నేరదు. నీ సత్కథాప్రసంగముల మహిమవలన నవశ్యము చిత్తశుద్ధి యేర్పడును గదా! నా యల్లుని సత్సంగతి వలన నాకు నీ యద్భుత దివ్యసందర్శన భాగ్యమబ్బెను. దేనిని హరిహర బ్రహ్మలును దేవేంద్రాదిసురలును మునులును తత్త్వార్థ విదులును పరికాంక్షింతురో యట్టి నీ సుదర్లభ దివ్యసందర్శనము శమదమసమాధులు లేకయే నేడు నాకు తెలికగ లభ్యమైనది.
క్వాహం సుమందమతి రాశు తవావలోకమ్‌ | క్వేదం భవాని ! భవభేషజ మద్వితీయమ్‌ |
జ్ఞాతా%సి దేవి సతతం కిల భావయుక్తా | భక్తాను కంపన పరామరవర్గ పూజ్యా. 49
కిం వర్ణయామి తవ దేవి ! చరిత్ర మేత ద్య ద్రక్షితోసి విషమేత్ర సుదర్శనోయమ్‌ |
శత్రూ హతౌ సుబలినౌ తరసా త్వయా యత్‌ | భక్తాను కంపిచరితం పరమం పవిత్రమ్‌. 50
నాశ్చర్య మేతదితి దేవి ! విచారితేర్థే త్వం పాసి సర్వమఃలం స్థిరజంగమం వై |
త్రాత స్త్వయా చ వినిహత్య రిపు ర్దయాతః సంరక్షితోయ మధునా ధ్రువసంధి సూనుః. 51
భక్తస్య సేవనపరస్య యశోతి దీప్తమ్‌ కర్తుం భవాని | రచితం చరితం త్వయైతత్‌ |
నో చే త్కథం సుపరి గృహ్య సుతాం మదీయామ్‌ యుద్ధే భవే త్కుశల వాననవద్యశీలః. 52
శక్తా%సి జన్మమరణాదిభయాని హంతుమ్‌ కిం చిత్ర మత్ర కిల భక్త జనస్య కామమ్‌ |
త్వం గీయసే జనని! భక్తజనై రపారా త్వం పాపపుణ్యం రహితా సుగుణా%గుణాచ. 53
త్వ ద్దర్శనా దహ మహో సుకృతీ కృతార్థో జాతో%స్మి దేవి భువనేశ్వరి ! భవ్యజన్మా |
బీజం న తే న భజనం కిల వేద్మి మాతు ర్ఞాత స్తవాద్య మహిమా ప్రకటప్రభావః. 54
ఏవం స్తుతా తదా దేవీ ప్రసన్నవదనా శివా | ఉవాచ చ నృపం దేవీ వరం వరయ సువ్రత. 55

అంబా! మందమతి నగు నేనేడ? అద్వితీయమైన భవభేషజమగు నీ దయామృతవీక్షణము లేడ? భవానీ! దీన భక్తపరాధీనా! నీవు నీ పరమభక్తుల యైకాంతిక ప్రేమభక్తిని గని వారిపై దయామృతము గురిపింతువు. అమర పూజిత పాదపద్మవు నీవు. ఓ పరాదేవీ! నీ యద్భుత మహనీయత నెంతని వర్ణింతును? సుదర్శనుని విషమసంకటస్థితినుండి సముద్ధరించినదానవు. నీ వలన శత్రులు తుదముట్టిరి. భక్తానుకంపనశీల వగు నీ చరిత్రము పరమపవిత్రము. ఈ స్థాపరజంగమాత్మకమైన విశ్వప్రపంచములకు నీవు సర్వాధికారిణివి. పాలనకర్త్రివి. కనుకనే శత్రుల మూకలను చెండాడి ధ్రువసంధి కొడుకును దయతో బ్రోచితివి. ఇం దాశ్చర్య మేమున్నది? నీ సేవాతత్పరులగు నీ భక్తుల కీరితి నీ మూలమున విస్తరిల్లినది. ఇట్లు నీవే నీ మహితచరితను రచించితివి. అట్లు కానిచో ననవద్య శీలుడగు సుదర్శనుడు శత్రులను గెలిచి కుశలమున నా సుతను చేపట్టుట సాధ్య మయ్యెడిదా? పాపపుణ్యరహితవు. సుగుణ నిర్గుణ స్వరూపవు. నీవు పరమ భక్తుల చేత నిచ్చట దివ్యమధురగానమున స్తుతి చేయబడుచుందువు. ఓ త్రిభువనేశ్వరీ! నీ సందర్శనమున నేను ధన్యజీవనుడనైతిని. నిన్ను భజించుటకు తగిన సద్బీజమంత్రము నేనెఱుగను. ఐనను నీ మహిమ నేడు విశ్వవిఖ్యాతి నందినది. ఇట్లు రాజు నుతింపగ పరాశక్తి ప్రసన్నయై రాజు నేదేని వరము గోరుకొను మనెను అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.
శ్రీదేవీభాగవత మందలి తృతీయస్కంధమున నిరువదిమూడవ యధ్యాయము నుండి.

No comments:

Post a Comment