Saturday, March 28, 2020

శ్రీదేవ్య ష్టోత్తరశతస్థాన సంపుటితనామావళి

శ్రీదేవ్య ష్టోత్తరశతస్థాన సంపుటితనామావళి


-----------------------------------------
'ఓం' వారాణస్యాం విశాలాక్ష్యై 'నమః'
నైమిశే లింగధారిణ్యౖ
ప్రయాగే లలితాయై
గంధమాదనే కాముకాయై
మానసే(సరసి)కుముదాయై
విశ్వేశ్వరే విశ్వాయై
విశ్వకాయాం మాయై(లక్ష్మ్యై)
ఇచ్ఛాయాం మదనోత్కటాయై
గోమంతే గోమత్యై
మందారే కామచారిణ్యౖ. 10
చిత్రరథే మదోత్కటాయై
హస్తినాపురే జయంత్యై
కన్యాకుబ్జే గౌర్యై
మలయపర్వతే రమ్యాయై
హిమవత్సానుని నందాయై
గోకర్ణే భద్రకర్ణికాయై
స్థాణ్వీశ్వరే భవాన్యై
బిల్వ కే బిల్వపత్త్రికాయై
శ్రీశైలే మాదవ్యై
భ##ద్రేశ్వరే భద్రాయై. 20
వరాహశైలే జయాయై
కమలాలయే కంబళాయై
పుష్కరే పురుహూతాయై
కేదారే మార్గదాయిన్యై
చంద్రకోట్యాం రుద్రాణ్యౖ
కాళంజరగిరౌ కాళ్యై
మహాలింగే కపిలాయై
మకుటే మకుటేశ్వర్యై
సాలగ్రామే మహాదేవ్యై
శివలింగే శివప్రియాయై. 30
మాయాపుర్యాం కుమార్యై
లలితే సంతతాయై
ఉత్పలాక్షే సహస్రాక్ష్యై
మహోత్పలే హిరణ్యాక్ష్యై
గయాయాం మంగళాయై
పురుషోత్తమే విపులాయై
విపాశాయాం అమోఘాక్ష్యై
పుండ్రవర్ధనే పాటలాయై
సుపార్శ్వే నారాయణ్యౖ
త్రికూటే భద్రసుందర్యై. 40
విపులే విపులాయై
మలయాచలే కల్యాణ్యౖ
కోటితీర్థే కోట్యక్ష్యై
మాగధవనే సుగంధాయై
కుబ్జామ్రకే త్రిసంధ్యాయై
గంగాద్వారే రతిప్రియాయై
శివకుండే సునందాయై
దేవికాతటే నందిన్యై
ద్వారవత్యాం రుక్మిణ్యౖ
బృందావనే రాధాయై. 50
మథురాయాం దేవక్యై
పాతాళే పరమేశ్వర్యై
చిత్రకూటే సీతాయై
వింధ్యే వింధ్యనివాసిన్యై
సహ్యాద్రౌ ఏకవీరాయై
హరిశ్చంద్రే చంద్రికాయై
రామతీర్థే రమణాయై
యమునాయాం మృగావత్యై
కరవీరే మహాలక్ష్మ్యై
వినాయకే ఉమాదేవ్యై. 60
వైద్యనాథే ఆరోగ్యాయై
మహాకాళే మహేశ్వర్యై
శుక్లతీర్థే అభయాయై
వింధ్య కందరే స్మృత్యై
మాండవ్యే మాండక్యై
మా హేశ్వరే పురే స్వాహాయై
ఛాగలాండే ప్రచండాయై
అమరకంటకే చండికాయై
సోమేశ్వరే వరారోహాయై
ప్రభాసే పుష్కరావత్యై. 70
సముద్రతటే సరస్వత్యాం దేవమాత్రే
మహాలయే మహాభాగాయై
పయోష్ణే పింగళావత్యై
కృతశౌచే సింహికాయై
కార్తికేయే యశస్కర్యై(శాంకర్యై)
ఉత్పలావర్తకే లోలాయై
సిందుసంగమే సుభద్రాయై
సిద్ధవనే లక్ష్మ్యై మాత్రే
భరతాశ్రమే అనంగాయై
జాలంధరే విశ్వముఖ్యై. 80
కిష్కింథపర్వతే తారాయై
దేవదారువనే పుష్ట్యై
కాశ్మీరమండలే మేధాయై
హిమాద్రౌ ఉ(భీ)మాదేవ్యై
షష్ఠీ వస్త్రేశ్వర్యై
కపాలమోచనే శుద్ధ్యై
కాయావరోహణ మాత్రే
శంఖద్వారే ధ్వన్యై
పిండారకే ధృత్యై
చంద్రభాగాయాం కలాయై. 90
అచ్ఛోదే శూలధారిణ్యౖ
వైణాయాం అమృతాయై
బదర్యాం ఊర్వశ్యై
ఉత్తరకురౌ ఓషధ్యై
కుశద్వీ పే కుశోదక్యై
హేమకూటే మన్మథాయై
కుముదే సత్యవాదిన్యై
అశ్వత్థే(వృక్షే)వందనీయాయై
వైశ్రవణా(కుబేరా)లయే నిధయే
వేదవదనే(వేదారంభే)గాయత్ర్య. 100
శివసన్నిధౌ పార్వత్యై
దేవలోకే ఇంద్రాణ్యౖ
బ్రహ్మశరీరే సంస్వత్యై
సూర్యబింబే ప్రభాయై
మాతృకాసు వైష్ణవ్యై
సతీషు అరుంధత్యై
రామాసు(స్త్రీషు)తిలో త్తమాయై
సర్వశరీరిణాం చిత్తే బ్రహ్మకలా
నామ్న్యై శక్తయే. 108
(ఈ చెప్పిన ఆ యా స్థానములందుఈ చెప్పిన రూపములలో ఉన్న మహాతత్త్వము భగవచ్ఛక్తియే. అను భావనచేయుచు శ్రీదేవిని అర్చించవలయును. ఈ చెప్పినవానిలో తీర్థక్షేత్రములుగా నున్నవి నేడు ఎచ్చట ఏ పేరులతో నున్నవి-అను విషయము 'Sakta Pithas' అను గ్రంథమున చూడనగును.

98. నామమున - వందనీయా - వందనికా - బదనిక - అను పేరుతో వ్యవహరింపబడు అశ్వత్థవృక్షాశ్రిత వృక్షవిశేషము అని తోచుచున్నది. ఇట్టిది ఓషధీ విశేషము కావున శ క్తిరూపమగును. అనదగియున్నది-అనువాదకుడు.)

-----------------------------------

దక్షాయ దేవీప్రోక్తస్వీయాష్టో త్తరశతస్థానాని.
వారాణస్యాం విశాలాక్షీ నైమి శే లిఙ్గధారిణీ. 26
ప్రయాగే లలితా దేవీ కాముకా గన్ధమాదనే | మానసే కుముదా నామ విశ్వా విశ్వేశ్వరే విదుః. 27
మా నామ విశ్వకాయాం తు ఇచ్ఛాయాం మదనోత్కటా | గోమన్తే గోమతీ నామ మన్దారే కామచారిణీ. 28
మదోత్కటా చిత్రరథే జయన్తీ హస్తినాపురే | కన్యాకుబ్జే తథా గౌరీ రమ్భా మలయపర్వతే. 29
నన్దా హిమవతః పృష్ఠే గోకర్ణే భద్రకర్ణికా | స్థాణ్వీశ్వరే భవానీతి బిల్వకే బిల్వపత్రికా. 30
శ్రీశైలీ మాధవీ నామ భద్రా భ##ద్రేశ్వరే తథా | జయా వరాహశైలే తు కమ్బళా కమలాలయే. 31
పుష్క రే పురుహూతేతి కేదారే మార్గదాయినీ | రుద్రకోట్యాం తు రుద్రాణీ కాళీ కాళఞ్జరే గిరౌ. 32
మహాలిఙ్గేతు కపిలా మకుటే మకుటేశ్వరీ | సాలగ్రామే మహాదేవీ శివలిఙ్గే శివప్రియా. 33
మాయాపుర్యాం కుమారీ తు స న్తతా లలితే తథా | ఉత్పలాక్షే సహస్రాక్షీ హిరణ్యాక్షీ మహోత్పలే. 34
గయాయాం మఙ్గళా నామ విపులా పురుషోత్తమే | విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్డ్రవర్ధనే. 35
నారాయణీ సుపార్శ్వేతు త్రికూటే భద్రసున్దరీ | విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే. 36
కోట్యక్షీ కోటి తీర్థే తు సుగన్దా మాగధే వనే | కుబ్జామ్ర కే త్రిసన్ధ్యా తు గఙ్గద్వారే రతిప్రియా. 37
శివకుణ్డ సునన్దా చ నన్దినీ దేవికాతటే | రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృన్దావనే వనే. 38
దేవకీ మథురాయాం తు పాతాళే పరమేశ్వరీ | చిత్రకూటే తథా సీతా విన్ధ్యే విన్ధ్యనివాసినీ. 39
సహ్యాద్రా వేకవీరాతు హరిశ్చన్ద్రతు చన్ద్రకా | రమణా రామతీర్థేతు యమునాయాం మృగావతీ. 40
కరవీరే మహాలక్ష్మీ రుమాదేవీ వినాయకే | ఆరోగ్యా వైద్యనాధేతు మహాకాళే మ హేశ్వరీ. 41
అభయా శుక్లతీర్థే తు స్మృతిర్వా విన్ధ్యకన్దరే | మాణ్డవ్యే మాణ్డకీనామ స్వాహా మా హేశ్వరే పురే. 42
ఛాగలాణ్డ ప్రచణ్డాచ చణ్డికా7మరకణ్టకే | సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ. 43
దేవమాతా సరస్వత్యాం పారావారతటే మతా | మహాలయే మహాభాగా పయోష్టే పిఙ్గళావతీ. 44
సింహికా కృతశౌచే తు కార్తికేయే *యశస్కరీ | ఉత్పలావర్తకే లోలా సుబద్రా సిన్ధుసఙ్గమే. 45
మాతా సిద్దవనే లక్ష్మీ రనఙ్గా భరతాశ్రమే | జాలన్ధరే విశ్వముఖీ తారా కిష్కిన్ధపర్వతే. 46
దేవదారువనే పుష్టి ర్మేధా కాశ్మీరమణ్డలే | ¨ఉమాదేవీ మిమాద్రౌ తు షష్ఠే వస్త్రేశ్వరీ తథా. 47
కపాలమోచనే శుద్ధి ర్మాతా కాయావరోహణ | శఙ్ఖద్వారే ధ్వనిర్నామ భృతిః పిణ్డార కే తథా. 48
కలాతు చన్ద్రభాగాయా మచ్ఛోదే శూలధారిణీ | వైణాయా మమృతా నామ బదర్యా మూర్వశీ తథా. 49
ఓషధీ చోత్తరకురౌ కుశద్వీపేకుశోదకీ | మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ. 50
అశ్వత్థే వన్దనీయాతు (ని) విధి ర్వైశ్రవణాలయే | గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ. 51
దేవలోకే తథేన్ద్రాణీ బ్రహ్మీంగేతు సరస్వతీ | సూర్యబిమ్బే ప్రభానా మ మాతౄణాం వైష్టవీ తథా. 52
అరున్ధతీ సతీనాంతు రామాసుచ తిలో త్తమా | చిత్తే బ్రహ్మకలా నామ శక్తి స్సర్వశరీరిణామ్‌. 53


సూతుడు ఋషులతో ఇట్లు పలికెను: అధిక సంఖ్యగల శ్రేష్ఠములగు దక్షిణలతో దక్షుడు యజ్ఞమును వితతము (శ్రౌతకల్పమున చెప్పిన విధమున జరుపబడునది) చేయుచుండెను. (శివుడు తప్ప మిగిలిన) దేవతలు అందరును యజ్ఞమునకు వచ్చి యుండిరి. అపుడు సతీదేవి తన తండ్రిని ''నాయనా! ఈ యజ్ఞమునకు నాభర్తను ఏల పిలువలేదు?'' అని అడిగెను. శూలధారి యగు రుద్రుడు నీభర్త యజ్ఞములందు వచ్చుటకు యోగ్యుడు కాడు. అతడు సృష్టిని ఉపసంహరించు (నశింపజేయు) వాడు. అందుచేత అతడు అశుభములను ఆశ్రయించి యున్నవాడైనాడు. (శుభములకు పనికిరాడు.) అని దక్షుడు పలికెను. అంతట సతి కోపించెను. నీవలన ఉత్పన్నమైనందున నా ఈ దేహమును విడిచెదను. అని ఆమె పలికెను. నీవు పదిమంది తండ్రులకు ఒక్కడవే కుమారుడవు అయ్యెదవు. నీవు చేసిన ఈ దోషమునకు ఫలముగా నీ ఈ అశ్వమేధము రుద్రుని చేతిలో నాశమునందును. అని పలికి సతీదేవి యోగమును పూని తన దేహమునుండి ఉత్పన్న మయిన అగ్నితోనే తన శరీరమును దహింపజేసికొనుచుండెను. అది చూచి దేవతలు అసురులు గుహ్యకులు కిన్నరులు గంధర్యులును దక్షునితో ఇది ఏమి? (ఇట్లు జరుగనిచ్చితివి?) అనిరి. అంతట దక్షుడు ఆమె దగ్గరకు వచ్చి దుఃఖించుచు నమస్కరించి ఇట్లు పలికెను: ''నీవు ఈ జగత్తునకు మాతవు. జగత్తులకు సౌభాగ్యదేవతవు. నన్ను అనుగ్రహించు తలంపుతోనే నీవు నాకు పుత్త్రివయితివి. నీవు లేనిది నీవు కానిది ఈ బ్రహ్మాండము నందు చరము కాని అచరము కా (కదలునది కదలనిది) అగు ఏపదార్థమును లేదు. నీవు ధర్మము నెరిగినదానవు. నన్ను అనుగ్రహించుము. నన్ను విడువవలదని వేడుచున్నాను.''
దేవి దక్షునితో ఇట్లు పలికెను: ''నేను ఏమి చేయ సంకల్పించి ఆరంభించితినో అది నేను చేసియే తీరుదును. అందు సందేమములేదు. దేవి వస్తు స్థితిలో ఇచ్ఛాదిశ క్తి త్రయ స్వరూపురాలు-ఇచ్ఛ అనగా సంకల్పము. ఆమె తాను సంకల్పించిన దానిని తన జ్ఞానశ క్తితో ఆలోచించి క్రియా శక్తితో నిర్మాణము చేయును. అని త త్త్వమును అర్థము.) (నీవు నన్న నన్ను భ క్తితో ప్రార్థించుచున్నావు.) కాని నా సంకల్పానుసారము శివుని చేతిలో నీ యజ్ఞము నాశము కాక తప్పదు. నన్ను నుగ్రహింప జేసికొని నా దయచే లోక సృష్టిని సాధించుటకై నీవు నా సన్నిధిలో ఉండి తపస్సు ఆచరించుము. పదిమంది ప్రజాపతులలోను నీవు శుభకరుడవు అయ్యెదవు. నా అంశముతో నీకు అరువదిమంది కూతుండ్రు కలిగెదరు. నా సన్నిధిలో తపమాచరించినచో నీవు ఉత్తమమగు యోగసిద్దిని పొందెదవు.''
దేవి మాటలు విని దక్షు డామెతో ''ఏయే తీర్థములందు నీవున్నట్లు భావించి నిన్ను దర్శించవలెను? ఏ నామములతో నిన్ను స్తుతి చేయవలెను?'' అనెను.
దేవి ఇట్లు పలికెను: సర్వకాలములందును భూమియందలి (భూమిపై) సర్వ ప్రదేశములందు సర్వభూతములందును నేనున్నట్లు దర్శించవలయును. ఏలయన స ప్తలోకములందును ఏయే వస్తువులు కలవో వానిలో ఏయెక్కటియు నేను లేనిదియు నేను కానిదియు లేదు. ఐనను తాము కోరిన ఫలములు సిద్దింపగోరినవారు కాని అభ్యుదయమునో నిఃశ్రేయసమునో కోరినవారు (ఇహ-పరసుఖముల కోరినవారు) కాని ఏయే స్థానములందు నన్ను (ఏరూపమున) స్మరింపవలెనో వాటిని వాస్తవ స్థితిలో చెప్పుచున్నాను.

దక్షునకు శ్రీ దేవి తన అష్టోత్తర శతస్థానములను తెలుపుట
1. వారాణసియందు విశాలాక్షి-2. నైమిశమున లింగధారిణి-3. ప్రయాగయందు శ్రీలలితాదేవి-4. గంధ మాదన (పర్వత)మున కాముక-5. మానససరః క్షేత్రమున కుముద-6. విశ్వేశ్వరమున విశ్వ-7. విశ్వకయందు మా (లక్ష్మీ)-8. ఇచ్ఛా క్షేత్రమున మదనోత్కట-9. గోమంతమున గోమతి-10. మందారమున కామచారిణి-11. చిత్రరథమున మదోత్కట-12. హస్తినాపురమున జయంతి-13. కాన్యకుబ్జమున గౌరి-14. మలయపర్వతమున రంభ-15. హిమవత్పర్వత సానువునందు నంద-16. గోకర్ణమున భద్రకర్ణిక-17. స్థాణ్వీశ్వరమున భవాని-18. బిల్వకమున బిల్వపత్రిక-19. శ్రీశైలమున మాధవి-20. భ##ద్రేశ్వరమున భద్ర-21. వరాహశైలమున జయ-22. కమలాలయమున కంబళ-23. పుష్కరక్షేత్రమున పురుహూత-24. కేదార క్షేత్రమున మార్గదాయిని-25. రుద్రకోటియందు రుద్రాణి-26. కాలంజర పర్వతమున కాళి-27. మహాలింగక్షేత్రమున కపిల-28. మకుట క్షేత్రమున మకుట-29. సాలగ్రామక్షేత్రమున మహాదేవి-30. శివలింగక్షేత్రమున శివప్రియ-31. మాయాపురి (జగన్నా ధక్షేత్రము) యందు కుమారి-32. లలితమునందు సంతత-33. ఉత్పలాక్షమున సహస్రాక్షి-34. మహోత్పలమున హిరణ్యాక్షి-35. గయయందు మంగళ-36. పురుషోత్తమమున విపుల-37. విపాశా నదీక్షేత్రమున అమోఘాక్షీ-38. పుండ్రవర్ధనమున పాటల-39. సుపార్శ్వమున నారాయణి-40. త్రికూట (పర్వత)మున భద్రసుందరి-41. వివులక్షేత్రమున విపుల-42. మలయాచలమున కల్యాణి-43. కోటి తీర్థమున కోట్యక్షి-44. మాగధవనమున సుగంధ-45. కుబ్జామ్రక క్షేత్రమున త్రిసంద్య-46. గంగాద్వారము (హరిద్వారమున రతిప్రియ-47. శివకుడ తీర్థమున సునంద-48. దేవికానదీతటమున నందిన-49. ద్వారకయందు రుక్మిణి-50. బృందా వనమున రాధ-51. మథురయందు దేవకి-52. పాతాళమున పరమేశ్వరి-53. చిత్రకూటమున సీత-54. వింధ్యమున వింధ్యవాసిని-55. సహ్యపర్వతమున (పడమటి కనుమలు) ఏకవీర-56. హరిశ్చంద్రమున చంద్రిక-57. రామతీర్థమున రమణ-58. యమునాతీరమున మృగావతి-59. కరవీరమున మహాలక్ష్మి-60. వినాయకమున ఉమ-61. వైద్యనాథమున ఆరోగ్య-62. మహాకాళమున మహేశ్వరి-63. శుక్లతీర్థమున అభయ-64. వింధ్య కందరమున స్మృతి-65. మాండవ్యమున మాండకి-66. మహేశ్వరపురమున స్వాహా-67. ఛాగలాండమున ప్రచండ-68. అమరకంటకమున చండిక-69. సోమే శ్వరమున వరారోహ-70. ప్రభాసమున పుష్కరావతి-71. సముద్రతీరమునందు సరస్వతీతీరమున దేవమాత-72. మహాలయమున మహాభాగ-73. పయోష్ణమున పింగళవతి-74. కృతశౌచ క్షేత్రమున సింహిక-75. కార్తికేయ క్షేత్రమున యశస్కరి-76. ఉత్పలావర్తకమున లోల-77. సాగర సంగమమున సుభద్ర-78. సిద్ధవనమున లక్ష్మీమాత-79. భరతాశ్రమమున అనంగ-80. జాలంధరమున విశ్వముఖి-81. కిష్కింధ పర్వతమున తార-82. దేవదారువనమున పుష్టి-83. కాశ్మీరమండలమున మేధ-84. హిమాద్రియందు ఉమాదేవి-85. షష్ఠక్షేత్రమున వస్త్రేశ్వరి-86. కపాలమోచనమున శుద్ధి-87. కాయావరోహణమున మాత-88. శంఖద్వారమున ధ్వని-89. పిండారకమున భృతి-90. చంద్రభాగాతీరమున కల-91. అచ్ఛోదమున శూలధారిణి-92. వైణాక్షేత్రమున అమృత-93. బదరీక్షేత్రమున ఊర్వశి-94. ఉత్తకురువులందు ఓషధి-95. కుశద్వీపమునందు కుశోదకి-96. హేమకూటమున మన్మథ-97. కుముదమున సత్యవాదిని-98. అశ్వత్థమున వందనీయ-99. వైశ్రవణాలయమున(ని)విధి-100. వేదవదనమున గాయత్రి-101. శివసంనిధియందు పార్వతి-102. దేవలోకమునందు ఇంద్రాణి 103. బ్రమ్మశరీరమున సరస్వతి-104. సూర్యబింబమునందు ప్రభ-105 సప్తమాతృకలయందు వైఫ్ణవి-106. పతివ్రతలయందు అరుంధతి-107. సుందరులగు స్త్రీలయందు తిలోత్తమ-108 సర్వప్రాణుల చిత్తములందును బ్రహ్మకలయను శక్తి.

ఇట్లు ఇచ్చట శ్రీదేవి నామములను నూట ఎనిమిదింటిని పేర్కొనుట మాత్రము (వాటి అర్థములతో శ్రీదేవీ తత్త్వమును వివరించకయే) ఐనది. ఈ పేర్కొన్న నూట ఎనిమిది తీర్థక్షేత్రములను విన్నను స్మరించినను సర్వపాపములనుండి ముక్తి లభించును ఈ తీర్థములయందు స్నానముచేసి నన్ను దర్శించినవారు సర్వపాపముక్తులై కల్పమంతకాలమును శివపురమున వసింతురు. నాయందు తత్పరత కలిగి ఈ క్షేత్రములందు నివసించువారు బ్రమ్మలోకమును గూడ దాటి శి లోకమును చేరుదురు శుక్లపక్షమున తృతీయయందుగాని అష్టమినాడుగాని శివ సన్ని ధియందు నా ఈ అష్టోత్తర శత నామములను వినిపించినవారు బహుపుత్త్రవంతులగుదురు. గోదాన శ్రాద్ధ దాన కాలములందుగాని అను దినముననుగాని దేవతార్చనా సమయమునగాని దీనిని పఠించు వివేకులు బ్రహ్మపదమును పొందుదురు.


ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున
శ్రీ గౌరీనామాష్టోత్తర శత కథనమను త్రయోదశాధ్యాయము.

No comments:

Post a Comment