Monday, February 17, 2020

శ్రీ దుర్గా మాత ప్రార్ధన

శ్రీ దుర్గా మాత ప్రార్ధ




ఓం సర్వచైతన్య రూపాం తా మాద్యాం విద్యాం చ ధీమహి|
 బుద్ధిం యా నః ప్రచోదయాత్‌


మా బుద్ధుల నాత్మచింతనమునకై ప్రేరించు దేవియు సర్వ చైతన్యరూపయు ఆద్యయు మహావిద్యయు నగు శ్రీ భగవతిని ధ్యానింతుము


యా విద్యేత్యభిధీయతే శ్రుతిపథే శక్తిః సదా%%ద్యా పరా
సర్వజ్ఞా భవబంధ ఛిత్తినిపుణా సర్వాశయే సంస్థితా |
దుర్జేయా సుదురాత్మభిశ్చ మునిభి ర్ధ్యానాస్పదం ప్రాపితా |
ప్రత్యక్షా భవతీహ సా భగవతీ సిద్ధిప్రదా స్యా త్సదా. 

సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం | శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వమ్‌|
సంహృత్య కల్ప సమయే రమతే తథైకా | తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. 


ఎల్ల వేదమార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసారపాశ విచ్ఛేదినిగా సకలహృదయనివాసినిగా దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున దెలియబడునది కామదాయిని యై తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాత! తన త్రిగుణాత్మకమైన మాయాశక్తిచేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలావినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసార నెదలో సంస్మరింతును.

  





No comments:

Post a Comment