Monday, March 30, 2020

రౌద్ర మాతృకలు - నృసింహ మాతృకలు

రౌద్ర మాతృకలు - నృసింహ మాతృకలు



రౌద్ర మాతృకల 189 మందిలో వ్రధానలు ఏడుమంది 1. బ్రాహ్మి 2. మాహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారహి 6. ఇంద్రాణి (శాక్రీ) 7. చాముండ అనువారు ; మిగిలిన 182 మంది (7X26=26) అనుచర దేవతలు; నారసింహ మాతృకలలో నలుగురు ప్రధానలు ఒక్కొక్కరికి ఎనిమిదేసి మంది అనుచరలు.

రౌద్ర మాతృకలు:
మాహేశ్వరి - బ్రహ్మి- కౌమారి - మాలిని -సౌపర్ణి - వాయవ్య -శాక్రి -వైనాయకి- సౌరి - సౌమ్య - శివదూతి - చాముండ - వారుణి - వారాహి - నారసింహి - వైష్ణవి - చలచ్చిఖ - శతానంద- భగనంద- పిచ్చిల భగమాలిని - బల- అతిబల - రక్త-సురభి - సుఖమండిక- మాతృనంద - సునంద- బిడాలి -శకుని రైవతి - శంకరి -చంద్ర లాంగలి- కుదిని- జయ విజయ- జయంతి - అపరాజిత- కాళి- మహా కాళి- దూతి- సుభగ- దుర్బగ- కరాళి- నందిని -అదితి- దితి- మారి - మృత్యు- కర్ణమోటి - యామ్య - ఉలూభి- ఘటోదరి- వజ్రహస్త- పిశాచి - కపాలి - రాక్షసి - భుసుండి- శాంకరి- లంబ- చంద్ర- కరభ- ఘోట- సులోచన- ధూమ్ర- వరవాణి- కరాళిక- విశాలదంష్ట్రిణి- శ్యామ-త్రిజటి- కుక్కుట- వినాయకి- వైతాళి. ఉన్మనా-బడబ-సిద్ది-లేలిహానా- కేకరి గర్దభి - ఉత్కట-బహుపుత్త్రి- ప్రేతయానవిటంవిని-క్రౌంచి-శైలముభి-వినత-సరమ-దను-ఉమ-రంభ-మేనక - సలిల - చిత్రరూపిణి-స్వధా-స్వాహా - వషట్కార-ధృతి - జ్యేష్ఠ-కపర్దిని-మాయ-విచిత్రరూప-కామరూప-సంగమ-ముఖేవిలాస-మంగళ్య- మహానాన- మహాముఖీ-కుమారి - రోచన-భీమ-దామ-మదోద్దత-లంబాక్షి - కాలజిహ్వా-కుంభకర్ణ-మహాసురి - కేశిని-కునభి-పింగళాక్షి - తామసి-ఉల్కాముభి-ధూమ్రశాఖా-కంపిని-పరికంపిని-మోహిని-కుండలి-చంద్రా-నిర్బయా-బాహుశాలిని-కరకర్ణి-ఏకాక్షి-విశోక-నందిని-జ్యోత్స్నాముఖి-రభన-నికుంభ-రక్తకంపన-ఆధికార-మహాచిత్ర-చంద్రసేన మనోరమ-అదర్శన - హరత్పాపా-మాతంగి - లంబమేఖలా-అబల- వంచన-కాశి-ప్రాణద-లాంగలావతి-చిత్త-చిత్తజల-కో(శో)ణా-శాంతిక-ధృష్టశాలిని-లంబ స్తని-లంబసటా-వినటా-వాసచూర్జిని స్ఖలంతీ-దీర్ఘకేశీ-సుచిరా-సుందరీ-శుభా-అయోముఖీ-కద్రుముఖీ-క్రోధని-అశని-కుటుంబిక-ముక్తిక-చంద్రిక - బాలమోహనీ-సామాన్య సహినీ -లంబా -కోవిదారీ-మా(వా)నవి. శంకుకర్ణీ-మహానాద-మహాదేవి-మహోదరి-హుంకారి-రుద్రసనటా-రుద్రేశీ-భూతాదామరి-పిండజిహ్వ-చలజ్జ్వాల-శివా - జ్వాలాముఖి-(189)

నృసింహ మాతృకలు:
1. మహభాగయగు ఘంటాకర్ణి 2. పుణ్యయగు త్రైలోక్యమోహిని 3. సర్వ సత్త్వవశంకరి 4. చక్రహృదయ 5. కామచారిణి 6. శంఖిని 7. లేఖిని 8. కాల సంఘర్షణి- వీరు వాగీశ్వరి అను మొదటి శక్తికి అనుచరలు; 
1. సంకర్షణి 2. అశ్వత్థ 3. బీజభావ 4. అపరాజిత 5. కల్యాణి 6. మధుదంష్ట్రి 7. కమలా 8. ఉత్పలహస్తికా - అనువారు ఎనిమిది మందియు మయాదేవికి అనుచరలు; 
1. అజిత- 2. సూక్ష్మహృదయ 3. వృద్ధ 4. వేశాశ్మదంశనా 5. నృసింహభైరవా 6. బిల్వా 7. గరుత్మద్ధృదయా 8. జయా వీరు భగమాలినికి అను చరలు; 
1. ఆకర్షణీ 2. సభటా 3. ఉత్తరమాలికా 4. జ్వాలాముఖీ 5. భీషణికా 6. కామధేను 7. బాలికా 8. పద్మకరావీరు కాళికి- లేదా శుష్కరేవతికి అనుచరలు; ఈ ఎనిమిదేసి మంది (8x4=32)యును నృసింహదేవుని అవయవముల నుండి జనించినవాడు; త్రైలోక్య సృష్టిం సంహారములు చేయ సమర్థలు; 

 శ్రీ మత్స్య మహాపురాణమున అంధకాసుర వధము- రౌద్ర- నారసింహ- మాతృకోత్పత్తియను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము నుండి.

No comments:

Post a Comment