Sunday, March 29, 2020

వీరకకృత శ్రీ దేవీస్తుతి

వీరకకృత శ్రీ దేవీస్తుతి



నతసురాసురమౌళిమిళన్మణిప్రచయకాన్తికరాళ నఖాజ్కితే. 11
నగసుతే శరణాగతవత్సలే తవ నమోస్తు నతా ర్తివినాశిని l
తపనమణ్డలమణ్డితకన్దరే పృథుసువర్ణసువర్ణతనుద్యుతే . 12
విషభుజజ్గవిషజ్గవిభూషితే గిరిసుతే ప్రణమే (భవతీ) మహదా(మా) శ్రయే l
జగతి కః ప్రణతాభిమతం దదౌ ఝడితి సిద్ధనుతే భవతీ యథా. 13
జగతి కాఞ్చన వాఞ్చతి శజ్కరో భువనధృత్తనయే భవతీం యథా l విమలయోగవినిర్మితదుర్జయస్వతనుతుల్యమ హేశ్వరమణ్డలే. 14
విదళితాన్దకబాన్దవసంహతిస్సురవరైః ప్రథమం త్మభిష్టుతా l సితసటాపటలోద్ధతకన్ధరాభరమహామృగరాజర థాస్థితా. 15
విమలశక్తిముఖానలపిజ్గళాయతభుజౌఘవిపిష్టమహాసురా l
నిగదితా భువనైరితి చణ్డికా జనని శుమ్భనిశుమ్భనిషూదనీ. 16
ప్రణతచిన్తితదానవదానవ ప్రమథనై కరతి స్తరసా భువి l
వియతి వాయుపథే జ్వలనోజ్జ్వలే7వనితలే తవ దేవి చ యద్వపుః. 17
తదజితే7ప్రతిమే ప్రణమామ్యహం భువనభావని తే భవవల్లభే l
జలధయో లలితోద్ధతవీచయో హుతవహద్యుతయశ్చ చరాచరమ్‌. 18
ఫణసహస్రభృతశ్చ భుజజ్గమా స్త్వదభిధాసగతి మయ్యభయజ్కరాః l
భగవతి స్థిరభక్తిజనాశ్రయే ప్రతిగతో భవతీచరణాశ్రయమ్‌. 19
కరణజాతమిహాస్తు మమాచలన్ను తిలవా ప్తిఫలాశయహేతుతః l
ప్రశమమేహి మమాత్మజవత్సలే నమో7స్తు తే దేవి జగత్త్రయాశ్రయే. 20


వీరకుడు చేసిన గౌరీస్తవము.
సమ్రులైన సురాసురుల శిరస్సులందమరి కలిసిన మణి సమూహ కాంతితో నిమ్నో న్నతములగు గోళ్ళు గుర్తుగా కల దేవీ ! నమస్కరించిన వారి ఆర్తిని నశింపజేయుతల్లీ! శరణాగతవత్సలా! సగపుత్త్రీ! నీకు నమస్సు. 
రవి మండలములతో (వలె) మండిత (అలంకృత)మయిన కంఠము కల తల్లీ! బంగారువలె మంచి వన్నెకల దేహకాంతి గలదానా! విష భుజంగ రాశితో అలంకరింంపబపడిన దానా! గొప్పవారికి ఆశ్రయ మగు లదానా! (నిన్నాశ్రయించిన వారే గొపప్పవారు. ) నీకు నమస్కరింతును. నిన్నాశ్రయింతును. 
సిద్దుల నతులందుకొను నీవలె ప్రణతులగు వారికి శీఘ్రముగ అభిమతములు ఇచ్చినవారు లోకమందింకెవరున్నారు.? ధరణీధర (పర్వత) పుత్త్రీ! నిన్నువలె శంకరుడును మరి ఏ స్త్రీని కాని కోరడుకదానీవు విమలమగు యోగమచే మహేశ్వరుని వలెనే దుర్జయమగు స్వదేహకాంతిని సంపాదించితివి .
అంధక బాంధవులను చీల్చిన దానవునీవు; సురవరులును మొదట నిన్నే స్తుతింతురు. తెల్లని జూలు రాశి కలిగి గర్వముతో ఠీవిగానున్న దృఢమగు మెడ గల మృగరాజనెడు రథమారోహించుదానవు; 
నిర్మల శక్తి కలిగిన శక్తి మొదలగు ఆయుధములు ధరించి అగ్నివలె పచ్చని జ్వలించు కాంతిగల భుజ సమూహములతో మహాసురులను పిండి చేసినదానవుఇందుచేతనే జగమున చండికయని చెప్పబడిన దానవు; శుంభ నిశుంభుల చంపుదానపు నీవే; 
ప్రణతులగు వారి చింతితము లీడేర్చుదానవు; క్రొత్త (శక్తిగల) దానవుల నలుగగొట్టుటకై లోకమున శీఘ్రముగా తీవ్రానక్తితో ప్రవ ర్తిల్లు దానవు; అగ్నివలె ప్రకాశించుచు అంతరీక్షమునందును 
వాయుపథమునందును భూతలమునందును వ్యాపించియుండు నీదేహము ఏది కలదో-దానితో నీవు దేవిఅజితురాలవు (ఎవరికి జయింపనలవి కాని దానవు); భువన భావనీ!( లోకసృష్టి స్థితి కర్తా!) భవుని వల్లభానిన్ను నమస్కరించుచున్నాను. 
లలిత (సుందర)ములు ఆయియు చెలరేగు ఆలలుగల సముద్రములును అగ్ని జ్వాలలును వేలకొలది పడగలు గల సర్పములును-నీ నామస్మరణము చేయుచుండు నాకు ఈ చరాచర జగమందెల్ల అభయము కలిగించునవే అగును. 
భగవతీ ! స్థిర భక్తి గల జనులకు ఆశ్రయమగుదానా! నీచరణములను నాకు ఆశ్రయముగా చేరుచున్నాను. 
నిన్ను నుతించు ఈ అల్పపూజవలన కలుగు ఫలము పొందుట కనుకూలమయి నా ఇంద్రియములన్నియు పవిత్రములగుగాక! పుత్త్రవత్సలవగు దేవీ! జగత్త్రయాశ్రయా! నా విషయమున శాంతినొందుము; నీకు నమస్కారము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున కుమారోత్పత్తి కథనమను ఏబది ఎనిమిదవ అధ్యాయమునుండి.

No comments:

Post a Comment