Monday, May 11, 2020

శ్రీ రాధ ధ్యానము-స్త్రోత్రము

శ్రీ రాధ ధ్యానము-స్త్రోత్రము





ధ్యానము
శ్వేతచంపక వర్ణాభాం శరదించు సమాననామ్‌. 
కోటిచంద్ర ప్రతీకాశాం శరదంభోజలోచనామ్‌ | బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుత నితంబినీమ్‌. 
కుందపంక్తి సమానాభ దంతపంక్తి విరాజితామ్‌ | క్షౌమాంబర పరీధానాం వహ్నిశుద్దాంశుకాన్వితమ్‌.
ఈషద్దాస్యప్రసన్నాస్యాం కురికుంభయుగస్తనీమ్‌ | సదా ద్వాదశవర్షీయాం రత్నభూషణభూషితామ్‌.
శృంగార సింధులహరీం భక్తానుగ్రహకాతరామ్‌ | మల్లికా మాలతీమాలా కేశపాశ విరాజితామ్‌.
సుకుమారాంగలతికాం రాసమండల మధ్యగామ్‌ | వరాభయకరాం శాంతాం శస్వత్సుస్థిర¸°వనామ్‌.
రత్నసింహాసనాసీనాం గోపీమండల నాయకమ్‌ | కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీమ్‌.

తెల్లని చంపక వర్ణము గలది శారద చంద్రునివంటి ముఖము గలది కోటిచంద్రులుగల మేను గలది శారద కమలముల బోలు కన్నులు గలది పండిన దొండపండువంటిమోవి గలది మొలనూలు గలది మొల్ల మొగ్గల వరుసలవలె వెల్గు జిమ్ము పలువరుసగలది దేవి. ఆమె తెల్లని దువ్వలువలు దాల్చి అగ్ని శుద్ధమైన మేలిముసుగు దాల్చియున్నది. లేత మొలకనవ్వులు విప్పారిన ముఖము గలది. రత్నభూషణభూషితయై నిత్యము పండ్రెం డేడుల వయసుతో నలరారు సౌందర్యలహరి ; భక్తనుగ్రహ పరాయణమల్లికా మాలతీ మాలల పరిమళములు గుబాళించు కేశపాశములు గలది. కుసుమకోమలి-లతాంగి-రాస మండల మధ్య వర్తిని. వరాభయ ముద్రలుకల కలములుగల శాంతమూర్తి. నిండారు పరువముతో విలసిల్లు తల్లి. రత్న సింహాసనాసీన- గోపీమండలనాయిక-వేదప్రబోధిత-పరమేశ్వరి. కృష్ణ ప్రాణాధిక ప్రియ.


స్తోత్రం

నమస్తే పరమేశాని రాసమండల వాసిని | రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే.
నమః సరస్వతీరూపే నమః సావిత్రి శంకరి | గంగా పద్మావతీరూపే షష్టిమంగళచలడికే. 
నమస్తే తులసీరూపే నమోలక్ష్మీ స్వరూపిణీ | నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణీ.
మూల ప్రకృతి రూపాం త్వాం భజామః కరుణార్ణవామ్‌| సంసారహగరా దస్మాదుద్ధరాంబ దయాంకురు.
ఇదంస్తోత్రం త్రిసంధ్యంయః పఠేద్రాధాంస్మరన్నరః | తస్యవై దుర్లభం కించిత్కదా చిన్నభవిష్యతి.
దేహాంతే చ వసేన్నిత్యం గోలోకే రాసమండలే | 


పరమేశాని ! రాసమండలవాసిని ! రాసేశ్వరి! కృష్ణ ప్రాణాధికప్రియా! నీకు నమస్కారములు. త్రైలోక్యజననీ ! కరుణాలయా! బ్రహ్మ విష్ణ్వాది దేవతలచే మనస్కరింబడు పదపద్మములుగల దేవి ! నమస్కారములు. సరస్వతి రూపిణీ ! సావిత్రి! శంకరీ!గంగ! పద్మావతి రూపా! షష్ఠీ మంగళచండికా ! నమస్కారములు. తులసీ ! లక్ష్మీ ! దుర్గాదేవీ ! సర్వస్వరూపిణీ ! నీకు నమస్కారములు తల్లీ! మూలప్రకృతి స్వరూపిణీ దేవీ! కరుణాలవాలా! మేము నిరంతరము నిన్నే కొలిచెదము ఘోర సంసార సాగరమునుండి సముద్ధరింపదగినదవే! దయ చూడుము ! 

శ్రీ శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు యేబదవ యధ్యాయము నుండి.

Saturday, May 9, 2020

శ్రీ సురభిమాత ధ్యానము-స్త్రోత్రము

శ్రీ సురభిమాత ధ్యానము-స్త్రోత్రము




ధ్యానము:

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరామ్‌ | గవా మధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్‌. 
పవిత్రరూపాం పూతాం చ భక్తానాం సర్వకామదామ్‌ | యయా పూతం సర్వవిశ్వం తాందేవీం సురభిం భజే. 

లక్ష్మీస్వరూపిణి- పరమ రాధాసహచరి-గోవుల కధిష్ఠానదేవి - గోవులకు మొదటిది - గోవుల గన్న తల్లికి నమస్కారములు. పవిత్రరూప-పూత-భక్తులకామదాయిని-విశ్వమునంత పావనమొనరించునట్టి సురభ దేవికి నమస్కారములు.


సురభి బుద్ది-వృద్దు లొసంగును. సర్వకామములు దీర్చును. ముక్తిని సైత మిచ్చును. దీపావళి మర్నాడు పట్టపగలు గోమాతను పూజించువాడు తప్పక భూమండలమున పూజనీయుడు గాగలడు.



స్త్రోత్రము:

పురందర ఉవాచ నమోదేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనముః |
గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే. 24
నమో రాధా ప్రియాయ చ పద్మాంశాయై నమోనమః | నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమోనమః. 25
కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే | క్షీరదాయై ధనదాయై బుద్దిదాయై నమోనమః 26
శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః | యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమైనమః 27

మహాదేవి! గోబీజ స్వరూపిణి! జగదంబికా! సురభిమాతా నిన్ను నమస్కరించుచున్నాను. నీవు కృష్ణ ప్రియవు-రాధా ప్రియవు-పద్మాంశవు నగు గోమాతవు. నిన్ముపల్మారు నమస్కరించుచున్నాను. నీ వెల్లవారికి నెల్లవేళల కల్పవృక్షమువంటి దానువు-క్షీరము-సద్బుద్ది-ధనము నొసంగుదానవు. కీర్తిదాయినివి- నీకు పల్మార్లు నమస్కారుము చేయ చున్నాను. శుభాంగివి-సుభద్రపు-గోపప్రదాయినివి-యశము-కీర్తి-ధర్మము నొసంగు దేవివి నీకు నమస్కారుము చేయ చున్నాను. 

శ్రీ శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నలువదితొమ్మిదవ యధ్యాయము నుండి. 

శ్రీ మానసదేవి చరిత

శ్రీ మానసదేవి చరిత




మానసదేవి కశ్యపమహర్షి యొక్క మానసపుత్రిక ! ఆమె తన మనస్సువలననే క్రీడించగల దగుటవలన మానసా దేవియన వన్నె కెక్కెను. ఆమె తన మనస్సుతోడనే పరమేశ్వరుని ధ్యానించును. పరమయోగములో మునుంగును. కనుక నామె మనసాదేవి యయ్యెను. ఆమె ఆత్మారామ వైష్ణవి సిద్ధయోగిని కృష్ణపరమాత్ముని గూర్చి మూడు యుగములు తపించెను. తపమువలన నామె శరీరము-వస్త్రము జీర్ణించుట చూచి కృష్ణ పరమాత్మ యామెకు జరత్కారువను పేరు పెట్టెను. గోపవిభు డామె కోర్కెను దయతో తీర్చి యామెను పూజించి యామెకు కీర్తి గల్గించెను. ఆమెను బ్రహ్మలోక-నాగలోక- స్వర్గలోక- భూలోక వాసు లెల్లరును పూజించిరి. ఆమె లావణ్యవతి సుమనోహర జగములకు గౌరి.

జగములకు పూజిత యగుటవలన నామెను జగద్గౌరి యందురు. శివుని శుష్యురా లగుటవలన నామెను శైవియందురు. ఆమె విష్ణుభక్తురాలగుట వైష్ణవి యన వాసికెక్కెను. ఆమె జనమేజయుని సర్పయాగమున నాగులను గాపాడినది కనుకనామె నాగేశ్వరి-నాగభగిని యన విలసిల్లెను. విషము హరించుటలో నేర్పరి గాన ఆమెను విషహరి యందురు. ఆమె శివునినుండి సిద్ధయోగముపొందుటవలన సిద్ధయోగినిగపేర్వడసెను. జ్ఞాన యోగములొసంగునట్టి మృతసంజీవనీ విద్య నెఱిగినది. అందువలన నామెను పండితులు మహాజ్ఞానయుత యందురు. ఆమె తపస్విని ఆస్తీక మునీంద్రుని తల్లి. అందుచే నామె జగములందు '' ఆస్తీకమాత'' యనగ ప్రతిష్ఠ గాంచినది. మహాత్ముడగు జరత్కారు మహాముని కామె ప్రియురాలు. విశ్వపూజ్యుడు పరమయోగి యైన జరత్కారుని ప్రియురాలు జరత్కారు-జగద్గౌరి-మనస-సిద్ధయోగిని వైష్ణవి-నాగభగిని- శైవి-నాగేశ్వరి- జరత్కారు ప్రియ- ఆస్తీకమాత- విషహార- మహాజ్ఞానయుత- విశ్వపూజిత దేవి అను పండ్రెండు పేర్లుపూజా సమయమున చదువవలయును. అట్లుచదివిన వానికి నాగభయము గల్గదు. అతని వంశము తామరతంపరగ వర్ధిల్లును. శయనించునపుడు గాని పాముచన్న యింటిగాని వీనిని చదివినచో సర్పభయము గలుగదు. పాములు నివసించుచోటను పాములుండు నడవు లందును పాములు చుట్లుకొనిన విగ్రహములందును వీనిని చదివినంతనే పాముల భయము గల్గదు. వీనిని నిత్యము చదువు వానిని చూచి పాములు వాని నుండి పారిపోవును.

ద్వాదశైత నామం:


జరత్కా రుర్జగ ద్గౌరీ మనసా సిద్ధ యోగినీ. 51
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా | జరత్కారు ప్రియా స్తీకమాతా విషహారేతి చ. 52
మహాజ్ఞాన యుతాచైవసా దేవీ విశ్వపూజితా | ద్వాదశైతాని నామాని పూజాకాలేతుయః పఠేత్‌. 53




ధ్యానము


శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్‌ | వహ్నిశుద్ధాంశుకాధానాం వాగయజ్ఞోపవీతినీమ్‌. 2
మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినాం వరామ్‌ | సిద్ధాధిష్ఠాతృ దేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాంభజే. 3

శ్వేతచంపకమువంటి కాంతి గలది; రత్నభూషణభూషిత; అగ్ని శుద్ధ వస్త్రము ధరించినది; పాము జన్నిదము దాల్చినది. జ్ఞాన సంపన్నురాలు; మహాజ్ఞానులలో శ్రేష్ఠురాలు; సిద్ధాధిష్ఠానదేవి; సిద్ధ సిద్ధిప్రదయగు మనసను ధ్యానించుచున్నాను. 

స్త్రోత్రము:
పురందర ఉవాచ దేవి త్వాం స్తోతుమిచ్చామి సాధ్వీనాం ప్రవరాం వరామ్‌. 125
పరాత్పరాం చ పరమాం న హిస్తోతుం క్షమో2ధునా | స్తోత్రాణాం లక్షణంవేదే స్వభావాఖ్యాన తత్పరమ్‌. 126
న క్షమః ప్రకృతే వక్తుం గుణానాం గణనాం తవ | శుద్ధ సత్త్వ స్వరూపాత్వం కోపహిం సా వివర్జితా. 127
న చ శక్తో మునిస్తేన త్యక్తుం యాచ్ఞా కృతాయతః | త్వం మయా పూజితా సాధ్వీజననీ మే యథాదితిః 128
దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః | త్వయామే రక్షితాః ప్రాణాః పుత్రదారాః సురేశ్వరి. 129
అహంకరోమి తత్పూజాం ప్రీతిశ్చ వర్ధతాం సదా | నిత్యా యద్యపి పూజ్యాత్వం సర్వత్ర జగదంబికే. 130
తథాపి తవ పూజాం చ వర్ధయామి సురేశ్వరి | యే త్వా మాషాడ సంక్రాం త్యాం పూజయిష్యంతి భక్తితః 131
పంచమ్యాం మనసాఖ్యా యాంమాసాంతే నా దినే దినే | పుత్రపౌ త్రాయస్తేషాం వర్దంతే చ ధనానివై. 132

దేవీ! సతులతో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపదలచుచున్నాను. పరాత్పరవు - పరమవు నగు నిన్నెవడు నుతింపగలడు! వేదములందు నీ స్తోత్రముల లక్షణము-స్వభావము-చరిత్రులు పెక్కుగలవు. దేవి! నీ ప్రకృతి సహజమైన గుణగణములు లెక్కించగలవాడులేడు. నీవు శుద్ధ సత్వస్వరూపిణివి క్రోధలోభహింసలు లేని తల్లివి - మునివరుడు నిన్ను వదలి వెళ్ళలేక నీ యనుమతితో వెళ్ళిపోయెను. సాధ్వీమతల్లీ! యదితి వంటిదానవు. నా తల్లివి. నిన్ను చక్కగ పూజించితిని. నీవు దయకు - క్షమకు ప్రతిరూపవు - నా భగినివి. సురేశ్వరీ! నీ వలననే నేను నా భార్య బిడ్డలు రక్షింపబడిరి. జగదంబా! నీవు నిత్య పూజ్యవు - సర్వపూజ్యవు. ఇకమీద నీ పూజలందు నాకు ప్రీతి పెంపొందు గాక! సురేశ్వరి! నీ పూజలను ప్రచారము చేతును. పరభక్తితో ఆషాడ సంక్రాంతినాడు కాని మనసా పంచమినాడు గాని మాసము చివరగాని నిన్ను పూజించువారు పుత్రపౌత్రులు ధనధాన్యములు గల్గి వర్ధిల్లుదురు.


యశస్వినః కీర్తమంతో విద్యావంతో గుణా న్వితాః | యేత్వాంన పూజయిష్యంతి నిందంత్య జ్ఞానతో జనాః 133
లక్ష్మీహీనా భవిష్యంతి తేషాంనాగభయం సదా | త్వం స్వయ సర్వలక్ష్మీ శ్చ వైకుంఠే కమలాలయా. 134
నారాయణాంశో భగవాన్‌ జరత్కారు ర్మునీశ్వరః | తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా. 135
అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా | మనసా దేవి శక్త్యా త్వం స్వాత్మనా సిద్ధయోగినీ. 136
తేన త్వం మనసా దేవీ పూజితా వందితా భవ | యే భక్త్యా మనసాం దేవాః పూజయం త్య నిశంభృశమ్‌. 137
తేన త్వాం మనసా దేవీం ప్రవదంతి మనీషిణః| సత్యస్వరూపాదేవీ త్వం శశ్వత్స త్య నిషేవణాత్‌. 138
యోహి త్వాం భావయేన్నిత్యం సత్యాం ప్రాప్నోతి తత్పరః 
వారి పుత్రులు కీర్తి-విద్యా-గుణవంతు లగుదురు. అజ్ఞానముతో నిన్ను నిందించి పూజింపనివారు దరిద్రులగుదురు. వారికి నాగభయము గల్గును. ఓహో దేవీ! నీవు లక్ష్మీస్వరూపిణివి. వైకుంఠ పురమందలి లక్ష్మీదేవివి నీవే. నీ పతి జరత్కారుముని కేవలము నారాయణాంశజుడే నీ తండ్రి నిన్ను తన తపముచో తేజముచే తన మనస్సునుండి సృజించెను. నీ తండ్రి మారక్షణకే నిన్నట్లు సృజించెను. కాన నీవు మనసాదేవివైతివి. నీవు సిద్దమోగినివమ్మా! మనస్సు వలననే యెల్ల కార్యములు నిర్వర్తింపజాలిన దివ్య శక్తివమ్మా! అందువలన నీవు మనసాదేవి వైతివి- పూజితవు-వందితవునైతివి. దేవతలు నిశ్చలభక్తితో నిన్ను నిత్యము పూజింతురు. అందువలన నీవు మనసాదేవి వైతివి తల్లీ! నిత్యము సత్యమే పల్కుటవలన నిన్ను మనీషులు సత్వస్వరూపిణినిగ భావింతురు. ఏవాడు నిత్తెము నిన్నే స్వరించునో భావించునో యతడు తప్పక నిన్నేచేరును. అని యింద్రుడు మనసాదేవిని సన్నుతించి యామెనుండి వరము బడసెను.

శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధము నారద నారాయణ సంవాదము నలువదేడవ & నలువదెనిమిదవ యధ్యాయము నుండి.



------------------

-------------------

శ్రీ మంగళ చండీదేవి స్తుతి

శ్రీ మంగళ చండీదేవి స్తుతి




ధ్యానము

దేవీంషోడశ వర్షీయాం శశ్వత్సు స్థిరవనామ్‌| బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్ప ద్మనిభాననామ్‌. 23
శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనామ్‌ | జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదామ్‌ 24
సంసారసాగరేఘోరే జ్యోతీరూపాం సదాభజే | ` 25

పదారు వత్సరముల దేవి - నిండైన జవ్వనము గలది - బింబాధర-సుదతి-శుద్ధ- శారద కమలమువంటి ముఖము గలది. శ్వేతచంపకమువంటి కాంతి గలది. నల్ల కలువలవంటి కన్నులు గలది. ఎల్లరికీ సకల సంపద లొసంగునది-జగముల తల్లి-సకలదాయిని-సంసార సాగరమందు జ్యోతిః స్వరూపిణి యగు దేవిని కొల్తును.

స్తోత్రము
మహాదేవ ఉవాచః రక్ష రక్ష జగన్మాత ర్దేవి మంగళచండికే | హారికే విపదాంరాశేర్హర్ష మంగళకారికే. 26
హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే | శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే. 27
మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే | సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. 28
పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే | పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్‌. 29
మంగళాధిష్ఠాతృ దేవి మంగళానం చ మంగళే | సంసార మంగళాధారేమోక్షమంగళదాయిని.
సారే చ మంగళాధారే పారే చ సర్వ కర్మణామ్‌ | ప్రతి మంగళ వారే చ పూజ్యే మంగళ సుఖప్రదే. 31


మహాదేవుడిట్లనెను:    జగన్మాతా ! మంగళదాయినీ ! ఆనందకారిణీ ఆపదలుపాపు తల్లీ ! దేవి మంగళ చండికా ! నన్ను బ్రోవుము బ్రోవుము- ఆనంద మంగళదాయినీ ! ఆనంద మంగళ ప్రవీణా ! శుభమంగళ పరాయణా ! శుభా! మంగళచండికా ! తల్లీ మంగళాదేవీ ! మంగళయోగ్యా ! సర్వమంగళమంగళా సాధుజనులకు శుభములొసగు జననీ! శుభ మంగళనిలయా ! మంగళవార పూజ్య! మంగళాభీష్ట దేవీ ! మనువంశమున జన్మించిన మంగళ రాజుచేత పూజలందుకొనిన తల్లీ! ఓహో మంగళాధిష్ఠాన దేవీ ! మంగళ మంగళా ! సంసార మంగళాధారిణి! ముక్తి మంగళదాయినీ!
మంగళకారిణీ ! మంగళాధారా ! సకల కర్మలకు పరాకాష్ఠా ! ప్రతి మంగళవారమున పూజనీయా ! మంగళసుఖప్రదా ! నీకు నమస్కారము నన్ను బ్రోవుము.

స్తోత్రేణానేన శంభు శ్చ స్తుత్వా మంగళ చండికామ్‌ | ప్రతి మంగళవారే చ పూజాం దత్త్వా గతః శివః 32
ప్రథమే పూజితా దేవీ శివేన సర్వ మంగళా | ద్వితీయే పూజితా సా చ మంగళేన గ్రహేణ చ. 33
తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ | చతుర్థే మంగళవారే సుందరీభిః ప్రపూజితా. 34
పంచమే మంగళాకాంక్షి నరైర్మంగళ చండికా | పూజితా ప్రతివిశ్వేషు విశ్వేశపూజితా సదా. 35
తతః సర్వత్ర సంపూజ్యా బభూవ పరమేశ్వరీ ! దేవైశ్చ మునిభిశ్చైవ మానవైర్మనుభిర్మునే. 36
దేవశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తన్మంగళం భవేత్తస్య న భేవేత్తదమంగళమ్‌ | వర్ధతే పుత్రపౌత్రైశ్చ మంగళం చ దినేదినే. 37

 అను స్తోత్రముతో శివుడు మంగళ చండికను స్తుతించి ప్రతి మంగళవారమును మంగళ చండికను శివుడు పూజించెను. మొట్టమొదట సర్వమంగళయగు చండికాదేవిని శివుడు పూజించెను. తర్వాత మంగళగ్రహము (కుజుడు) మండళచండికను పూజించెను. ఆ తర్వాత మంగళుడను రాజు భద్ర మంగళదేవి నర్చించెను. ఆ పిదప ప్రతి మంగళవారమున సుందర స్త్రీలు మంగళ నారాధించిరి. ఐదవసారి శుభముగోరు నరులచేత మంగళచండిక పూజింపబడెను. తర్వాత ప్రతి విశ్వమునందు శివపూజితయగు మంగళ పూజింపబడెను. మునీ ! అటు పిమ్మట మంగళ పరమేశ్వరి యెల్లెడల దేవ-ముని-మను-నరులచేత పూజింపబడెను. ఈ మంగళదేవిస్తోత్రము నిశ్చల మనస్సుతో వినువాడు శుభములు పడయును. అతని కమంగళము గలుగదు.

శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధము నారద నారాయణ సంవాదము నలువదేడవ యధ్యాయము నుండి.



------------------------

------------------------


------------------------


శ్రీ షష్ఠీదేవీ స్తోత్రము

శ్రీ  షష్ఠీదేవీ స్తోత్రము




నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమోనమః 58

శుభాయై దేవసేనాయై షష్ఠ్యైదేవ్యై నమోనమః | 
వరదాయై పుత్రదాయై ధనదాయై నమోనమః 59

సుఖదాయై మోక్షదాయైష్ఠ్యై దేవ్యై నమోనమః | 
షష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమోనమః 60

మహాదేవి-సిద్ధి-శాంతి యగు దేవికి నమస్సులు. శుభాంగి- దేవసేన యగు షష్ఠీదేవికి నమస్సులు. వరదాయిని పుత్రదాయిని- ధన దాయినికి నమస్కారములు. సుఖదాయిని-మోక్షదాయిని యైన షష్ఠీదేవికి వందనములు. షష్ఠాంశరూప- సిద్ధయగు షష్ఠికి ప్రణామములు.


మాయాయై సిద్ధ యోగిన్యై షష్ఠీ దేవ్యై నమోనమః | సారాయై శారదాయై చ పరాదేవ్యై నమోనమః 61
బాలాధిష్ఠాతృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమోనమః | కల్యాణదాయై కల్యాణ్యౖ ఫలదాయై చ కర్మణామ్‌. 62
ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమోనమః | పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు. 63
దేవరక్షణ కారిణ్యౖ షష్ఠీ దేవ్యై నమోనమః | ధనం దేహి ప్రియాందేహి పుత్రం దేహి సురేశ్వరి. 65

మానం దేహి జయందేహి ద్విషోజహి మహేశ్వరి | 
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవ్యై నమోనమః 66

భూమిం దేహి వ్రజాం దేహి విద్యాం దేహిసుపూజితే | కల్యాణం చ జయం దేహిషష్ఠీ దేవ్యై నమోనమః 67
ఇతి దేవీం చ సంస్తూయలేభే పుత్రం ప్రియవ్రతః | యశస్వినం చ రాజేంద్రః షష్ఠీ దేవ్యాః ప్రసాదతః 68
షష్ఠీస్తోత్ర విదం బ్రహ్మ న్యం శృణోతి తువత్సరమ్‌. | అపుత్రోలభతే పుత్రం వరం సుచిరజీవినమ్‌. 69
వర్షమేకం చ యో భక్త్యా సంపూజ్యేదం శృణోతి చ | సర్వాపాపా ద్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే. 70
వీరంపుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినమ్‌ | సుచిరాయుష్య వంతం చ సూతే దేవీ ప్రసాదతః 71
కాకవంధ్యా చ యానారీ మృతవత్సా చ యా భవేత్‌ | వర్షం శ్రుత్వాలభేత్సు త్రం షష్ఠీ దేవీ ప్రసాదతః 72
రోగయుక్తే చ బాలేచ పితామాతా శృణోతిచేత్‌ | మాసేన ముచ్యతేబాలః షష్ఠీ దేవీ ప్రసాదతః 73


మాయ- సిద్ధయోగిని యగు షష్ఠికి కైమాడ్పులు సార-శారద యగు పరమదేవికి మ్రొక్కుదును. బాలాధిష్ఠానదేవి యగు షష్ఠికి దండపూలు. కల్యాణదాయిని-కర్మఫలదాయిని యగు కల్యాణి షష్ఠికి నమస్కృతులు. భక్తులకు ప్రత్యక్షయగు షష్ఠీదేవికి వందనములు. స్కంద భార్యకు నెల్లరి కెల్ల కర్మలందు పూజనీయమైన షష్ఠికి నమస్కారములు దేవరక్షణకారిణి యగు షష్ఠీదేవికి వందనములు. సిద్ధ సత్త్వ స్వరూపిణి- నరులకు వందనీయ యగు దేవికి వందనాలు. హింసాక్రోధములు లేని షష్ఠీదేవికి ప్రణతులు. ఓ సురేశ్వరీ ! ధనము-ప్రియను-సుపుత్రుని ప్రసాదింపుము తల్లీ ! ఓ మహేశ్వరీ ! మానము-జయము నిమ్మా ! శత్రులను పరిమార్చుము. ధర్మము కీర్తి నొసంగుము. షష్ఠీదేవి ! నీకు మా వందన శతములు. పూజితురాలా ! మాకు భూమిని ప్రజలను కల్యాణమును జయము నిమ్ము తల్లీ ! నీకు నమస్కారములు. 


అని షష్ఠిని సంస్తుతించి ప్రియపుత్రుడు పుత్రుని బడసెను. ఆ పుట్టినవాడు షష్ఠీదేవి దయవలన కీర్తిమంతుడు మహారాజునై వెలుగొందెను. బ్రాహ్మణోత్తమా ! ఈ షష్ఠీస్తోత్ర మొక సంవత్సరము విను మానవులు పుత్రహీనులైనను మంచి చిరంజీవి యగు సుపుత్రుని గాంచగలరు. ఒక సంవత్సరము పరమభక్తితో షష్ఠీదేవిని పూజించి స్తోత్రము విను పుణ్యాత్ముడు సర్వపాపముక్తు డగును. గొడ్రాలు వినినచో సంతానవతిగా గలదు. ఆమె దేవి దయవలన వీరుడు-గుణి- విద్యాంసుడు-కీర్తి-శాలి- ఆయుస్మంతుడు నైన పుత్రుని గనును. కాకవంధ్య- మృతవత్సయగు స్త్రీయును సంవత్సరమువఱ కీషష్ఠీస్తోత్రము విన్నచో షష్ఠిదేవ్యను గ్రహమున తప్పక సుపుత్రుని గనగలదు. తమ కుమారుడు రోగియైనచో తల్లిదండ్రులు షష్ఠీస్తోత్రము వినవలెను. దానిచే షష్ఠీదేవి దయవలన వారు బాలుడు డారోగ్యవంతుడు కాగలడు.
ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున నారద నారాయణ సంవాదమున షష్ఠ్యుపాఖ్యానమున నలువదియారవ యధ్యాయము.

Sunday, April 19, 2020

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట - వృత్రుని వధార్ధాం

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట



జగ్ము స్తే మేరుశిఖరం మందారద్రుమమండితమ్‌ | ఏకాంతే సంస్థితా దేవాః కృత్వా ధ్యానం జపంతపః. 32
తుషువు ర్జగతాం ధాత్రీం సృష్టిసంహారకారిణీమ్‌ | భక్త కామదుఘా మంబాం సంసారక్లేశనాశినీమ్‌. 33
దేవి! ప్రసీద పరిపాహి సురాన్ర్పతప్తా న్వృత్రాసురేణ సమరే పరిపీడితాం శ్చ.
దీనార్తినాశనపరే! పరమార్థ తత్త్వే ప్రాప్తాం స్త్వదంఘ్రి కమలం శరణం సదైవ. 34
త్వం సర్వం విశ్వజననీ పరిపాలయాస్మా న్పుత్రానివాతి పతితాన్రివు సంకటే%స్మిన్‌.
మాతర్నతేస్త్యవిదితం భువనత్రయేపి కస్మా దుపేక్షసి సురానసుర ప్రతప్తాన్‌. 35
త్రైలోక్య మేతదఃలం విహితం త్వయైవ బ్రహ్మ హరిః పశుపతి స్తవ వాసనోత్థాః |
కుర్వంతి కార్య మఃలం స్వవశా న తే తే భ్రూభంగచాలన వశాద్విహరంతికామమ్‌. 36
మాతా సుతా న్పరిభవా త్పరిపాతి హీనా న్రీతి స్త్వయైవ రచితా ప్రకటాపరాధాన్‌ |
కస్మా న్న పాలయసి దేవి వినాపరాధా నస్మాం స్త్వదంఘ్రి శరణా న్కరుణా రసాబ్ధే. 37
నూనం మదంఘ్రి భజనాప్త పదాః కిలైతే భక్తిం విహాయ విభవే సుఖభోగలుబ్ధాః |
నేమే కటాక్షవిషయా ఇతిచే న్న చైషా రీతిః సుతే జనని కర్తరి చాపి దృష్టా. 38
దోషో న నో2త్ర జనని ప్రతిభాతి చిత్తే యత్తే విహాయ భజనం విభవే నిమగ్నాః |
మోహస్త్వయా విరచితః ప్రభవ త్యసౌ న స్తస్మా త్స్వభావకరుణే దయసే కథం న. 39
పూర్వం త్వయా జనని దైత్యపతి ర్బలిష్ఠో వ్యాపాదితో మహిషరూపధరః కిలాజౌ |
అస్మత్కృతే సకలలోక భయావహోసౌ వృత్రం కథం న భయదం విధునోషి మాతః. 40
శుంభస్తథాతి బలవా ననుజో నిశుంభస్తౌ భ్రాతరౌ తదనుగా నిహతా హతౌచ |
వృత్రం తథా జహి ఖలం ప్రబలం దయార్ద్రే మత్తం విమోహయ తథా న భవేద్యథాసౌ. 41
త్వం పాలయాద్య విబుధా న సురేణ మాతః సంతాపితా నతితరాం భయ విహ్వలాంశ్చ |
నాన్యోస్తి కోపి భువనేషు సురార్తిహంతా యః క్లేశజాల మఃలం నిదహే త్స్వశక్త్యా. 42
వృత్రే దయా తవ యది ప్రథితా తథాపి జహ్యేన మాశు జన దుఃఖకరం ఖలం చ |
పాపా త్సముద్ధర భవాని శరైః పునానా నోచే త్ర్పయాస్యతి తమో నను దుష్టబుద్ధిః. 43
తే ప్రాపితాః సురవనం విబుధారయో యే హత్వా రణేపి విశిఖైః కిల పావితాస్తే |
త్రాతా నకిం నిరయ పాతభయా ద్దయార్ద్రే యచ్ఛత్రవో పి నహి కిం వినహింసి వృత్రమ్‌. 44
జానీమహే రిపురసౌ తవ సేవకో న ప్రాయేణ పీడయతి నః కిల పాపబుద్ధిః |
య స్తావక స్త్విహ భవే దమరా నసౌ కిం త్వత్పాదపంకజర తాన్నను పీడయే ద్వా. 45
అపుడు దేవతలు మందారాదితరువులచే నందమైన మేరుగిరి జేరిరి. వారేకాంతమున దేవిని గూర్చి జపతపో ధ్యానములు చేసిరి. వారు భక్తుల కోరిక లీడేర్చునట్టి సంసార దుఃఖములు బోగొట్టునట్టి జగములేలేతల్లిని - సృష్టిస్థితి సంహార కారిణి నీ విధముగ గొప్పగ ప్రస్తుతించిరి: తల్లీ! దేవదేవీ! మేము సమరమున వృత్రునిచేత పీడితులమై సంతప్తులమైతిమి. నీ పదపద్మములపై మా తలలు వంచి శరణువేడుచున్నాము. సర్వవిశ్వజననీ! అమ్మా! ఈ ముల్లోకములందు నీకు తెలియనిది లేదుగదా! దానవపీడితులమగు మమ్మేల యుపేక్షింతువు? మేము నీ కన్నబిడ్డలము. భీకర శత్రువులబారి పడిన వారము. మమ్ము గాపాడగదవే. తల్లీ! ఈ జగములన్నియు నీ వలననే నిల్చియున్నవి. నీవు వేల్పులతల్లివి. హరి హర బ్రహ్మలు వలననే జన్మించి నీ కనుసన్న మాత్రన సర్వ కార్యముల నెరవేర్చి విహరింతురు. వారికి స్వేచ్ఛా స్వాతంత్ర్యము లెంత మాత్రమును లేవు. ఒకవేళ పుత్రులేవైన అపరాధములచేసి దీనులై తిరస్కృతులైనచో వారిని తల్లి దయతో గాపాడునుగదా! వారితప్పు మన్నించునుగదా! దయారసమయీ! మేము నీ దివ్య పదారవిందములను శరణుపొందిన వారము. నిరపరాధులము. మమ్మేలదయతో నేలవమ్మా! అమ్మా! భవానీ! వీరొకప్పుడు నా పదములు గొలిచి పదములు పడసి సుఖభోగములంది నేడు నా భక్తి మానిరి. వీరినిపుడు నేనెట్లు కటాక్షింతునని మమ్ము గూర్చి దలంతువేని వినుము. అమ్మా! దయామతల్లియగు ఏ తల్లికైన నిట్టి భావము మదిగల్గదు సుమా! జననీ! శుభకామినీ! మేము నిన్ను భజింపక సంవదలం దనురక్తుల మగుటలో మా దోషమేమియును లేదు. ఏలన, నీవు మాయామోహమును రచించి మమ్ము మోహితులనుగ జేసితివి. స్వాభావిక కరుణారూపవగు నీవు దయతో మమ్మాదుకొనవేల? తల్లీ! తొల్లి నీవు బలశాలి - దైత్యపతియగు మహిషుని మాకు శ్రేయముగూర్ప నంతమొందించితివి. ఇపుడీ సకలలోక కంటకుడగు వృత్రునేల వధింపవు? దయామయీ! తొల్లి నీవు శుంభనిశుంభులను సోదరులను వారి యనుచరులను చంపివేసితివే. అట్లే మత్తుడు దుష్టుడు దుర్బలుడు నగు వృత్రుని మోహితునిజేసి చంపుము. శుభకారిణీ! జననీ! మేము దానవులచేత బాధింపబడితిమి. వికలాత్ములమైతిమి. మమ్ము బ్రోవగదవే! విబుధుల యార్తిపాపి వారి కడగండ్లనెల్ల బాపు శక్తిగలదానవు. దానవుల నెదిరించు ధీరశక్తివి నీవు; నిన్నెవడు నెదిరి నిల్వలేడు. ఓయమ్మా! ఒకవేళ వృత్రునిమీద నీకు కనికరమున్నచో జగములెల్ల పీడించునతడు నరకములో గూలకముందే నీ పవిత్రశరములతో వానిని చంపి యుద్ధరించుట మంచిది. నీ దివ్యబాణముల తాకిడికి పవిత్రులై చచ్చిన దనుజులు సురవనములందు విహరింతురుగదా! వృత్రుడు నీ శత్రువే. ఐన నతనిని నరకమున త్రోయక కాపాడవలసియుండ చంపవేల? జగన్మాతా! మాకు నీ శుభచరణములు శరణము. వృత్రుడు నిన్ను గొల్వక మమ్ము బీడించువాడు. అట్టి పాపమతి నీకు దాసుడుగాడు, వైరియేయగునని మేముదలంతుము. కుర్మః కథం జనని పూజన మద్య తే%ంబ పుష్పాదికం తవ వినిర్మితమేవ యస్మాత్‌ |
మంత్రా వయం చ సకలం పరశక్తి రూపం తస్మా ద్భవాని చరణే ప్రణతాః స్మనూనమ్‌. 46
ధన్యాస్త ఏవ మనుజా హి భజంతి భక్త్యా పాదాంబుజం తవభవాబ్ధి జలేషు పోతమ్‌ |
యం యోగినోపి మనసా సతతం స్మరంతి మోక్షార్థినో విగతరాగవికారమోహః. 47
యే యజ్ఞికాః సకలవేదవిదోపి మనసా సతతం స్మరంతి మోక్షార్థినో విగతరాగ వికారమోహః.
స్వాహాంతు తృప్తి జననీ మమరేశ్వరాణాం భూయః స్వధాం పితృగణస్య చ తృప్తిహేతుమ్‌. 48
మేధాసి కాంతిరసి శాంతిరపి ప్రసిద్ధా బుద్ధి స్త్వమేవ విశదార్థకరీ నరాణామ్‌ |
సర్వం త్వమేవ విభవం భువన త్రయేస్మి న్కృత్వా దదాసి భజతాం కృపయా సదైవ. 49
ఏవం స్తుతా సురైర్దేవి ప్రత్యాక్షా సాభవత్తదా | చారురూపధరా తన్వీ సర్వాభరణ భూషితా. 50
పాశాంకుశవరాభీతి లస ద్బాహు చతుష్టయా | రణత్కింకిణికాజాలరశనాబద్ధ సత్కటిః. 51
కలకంఠీరవా కాంతా క్వణత్కంకణనూపురా | చంద్రఖండ సమాబద్ధ రత్నమౌళి విరాజితా. 52
మందస్మితారవిందాస్యా నేత్రత్రయవిభూషితా | పారిజాతప్రసూనాచ్ఛనాళవర్ణ సమప్రభా. 53
రక్తాంబరపరీధానా రక్తచందనదర్చితా | ప్రసాదముఖీ దేవీ కరుణారససాగరా. 54
సర్వశృంగారవేషాఢ్యా సర్వద్వైతారణిః పరా | సర్వజ్ఞా సర్వకర్త్రీ చ సర్వాధిష్ఠానరూపిణీ. 55
సర్వవేదాంతసంసిద్ధా సంచిదానందరూపిణీ | ప్రణేము స్తాం సమాలోక్య సురాదేవీం పురః స్థితామ్‌. 56
తానాహ ప్రణతా నంబాకింపః కార్యంబ్రువంతుమామ్‌ | దేవాః : మోహయైనంరిపుం వృత్రం దేవానామతిదుఃఖదమ్‌. 57
యథా విశ్వసతే దేవాం స్తథా కురు విమోహతమ్‌ | ఆయుధే చ బలం దేహి హతః స్యాద్యేనవా రిపుః. 58
తథే త్యుక్త్వా భగవతీ తత్రైవాంతర ధీయత | స్వాని స్వానినికేతాని జగ్ముద్దేనా ముదా%న్వితాః. 59

తల్లీ! విశ్వజననీ! ఇకమేము నీ పాదపూజమాత్రమెట్లు చేయగలము? ఏలన నీ పూలు ఈ మంత్రములు ఈ మేమందఱము నీ పరిణామమే కదా! నీ పరాశక్తి చైతన్యములోని భిన్నరూపములమే కదా! కావున మేము నీ దివ్య పదరాజీవములకు తలలొగ్గి నమస్కారములు మాత్రము చేతుము. ముముక్షువులు మోహరాగవికారములు లేనివారు. పరమయోగులు. వారు తమ చిత్తములందు నిరంతరముగ భవసాగర నౌకవంటి నీ పదనళిన యుగమును పరమభక్తితో సేవింతురు. వారు నీ సుప్రసన్నతతో ధన్యజీవులు వేదవిదులగు యాజ్ఞికులు యాగములందు దేవతలను పితృదేవతలను తృప్తిపఱచు స్వాహా స్వధారూపిణివగు నిన్నే స్మరింతురుగదా తల్లీ! నీవు కాంతివి. శాంతివి. మేధవు. ప్రజ్ఞవు. నరులలోని సుబుద్ధివి. శ్రద్ధవు. సర్వము నీవే. ఈ భువనములందు నిన్ను గొల్చువారికి దయతో వైభవము లొసగుతల్లివి నీవే. అని యీ విధముగ విబుధులు ప్రస్తుతింపగా శ్రీదేవి యిట్లు ప్రత్యక్షమయ్యెను: శ్రీదేవి పంచదశాత్మైక స్వరూపిణి. దివ్యభూషితరంజిత. పాశ-అంకుశ-వర-అభయములతో నొప్పుకరాంబుజయుత. కింకిణీరశనల నలరు శృంగానర మధ్యమ. కలకంఠకంఠరవ- కనకాంగదకేయూరభకూషిత. చంద్రరేఖ వెలుగొందు రత్నమకుటముచే విరాజిత. చిర్నగవు వెన్నెలలు కురియు తల్లి. విరిసిన తమ్ములవంటి మూడు కన్నులు కలది. పారిజాత కుసుమ స్వచ్ఛనాళ సమానకాంతి. రక్తవసన-రక్త చందన చర్చిత. అవ్యాజకరుణాపూర్ణ - ప్రసాదసుముః సకల శృంగార రసాధిదేవత - అనంతకోటి బ్రహ్మాండ జనని. సర్వజ్ఞ. సర్వకర్త్రి - సర్వాధిష్ఠానదేవత - సర్వవేదాంత ప్రతిసాద్య - సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిభువనేశ్వరీదేవి దేవతల ముందు ప్రత్యక్షమయ్యెను. దేవతలు శ్రీదేవిని సందర్శించి యామెకు దోసిలొగ్గిరి. అంత దేవి 'మీరు నన్నేల ప్రస్తుతించుచున్నారు? తెలుపడ'నెను. దేవతలిట్లనిరి : వృత్రుడు సురలను బాధించుచున్నాడు. అతనిని మోహపఱచుము. అతడు చచ్చునట్లుగ నీవు మా యాయుధములందు నీ దివ్యశక్తినుంచుము.' అంత శ్రీభగవతి యట్లే యని యచ్చోట నదృశ్యురాలయ్యెను. దేవతలు హర్షముతో తమతమ నెలవుల కరిగిరి.
ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు దేవలతకు శ్రీదేవి ప్రత్యక్షమగుట అను పంచమాధ్యాయము.

Thursday, April 16, 2020

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట - శుంభ నిశుంభుల వధార్ధాం

దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట




నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథేమదానందరూపే సురానందదే తే
నమో దానవాంతప్రదే మానవానా మనేకార్థదే భక్తిగమ్య స్వరూపే. 25
న తే నామ సంఖ్యా న తే రూపమీదృక్తథా కోపి వేదాది దేవస్వరూపే
త్వమేవాసి సర్వేషు శక్తి స్వరూపా ప్రజాసృష్టి సంహారకాలే సదైవ. 26
స్మృతిస్త్వం ధృతిస్త్వం త్వమేవాసి బుద్ధి ర్జరా పుష్టి తుష్టీ ధృతిః కాంతిశాంతీ
సువిద్యా సులక్ష్మీర్గతిః కీర్తిమేదే త్వమేవాసి విశ్వస్య బీజం పురాణమ్‌. 27
యదా యైః స్వరూపైః కరోషీహకార్యం సురాణాంచ తేభ్యో గమామోద్య శాంత్యై |
క్షమా యోగనిద్రా దయా త్వం వివక్షా స్థితా సర్వ భూతేషు శసై#్తః స్వరూపైః. 28
కృతం కార్య మాదౌ త్వయా యత్సురాణాం హతోసౌ మహరి ర్మదాంధో హయారిః. |
దయా తే సదాసర్వదేవేషు దేవి ! ప్రసిద్ధా పురాణేషు వేదేషు గీతాః. 29
కిమత్రాప్తి చిత్రం యదంబా సుతే స్వం ముదా పాలయేత్పోష యేత్సమ్యగేవ |
యతస్త్వం జనిత్రీ సురాణాం సహాయా కరుషై#్వక చిత్తేన కార్యం సమగ్రమ్‌. 30
న వా తే గుణానా మియత్తాం స్వరూపం వయం దేవి జానీమహే విశ్వవంద్యే
కృపా పాత్ర మిత్యేవ మత్వా తథాస్మాన్భయేభ్యః సదా పాహి పాతుం సమర్థే. 31
వినాబాణపాతై ర్వినా ముష్ఠిఘాతై ర్వినాశూలఖడ్గైర్వినాశక్తి దండైః.
రిపూన్హంతు మేవాసి శక్వా వినోదా త్తథాపీహ లోకోప కారాయ లీలా. 32
ఇదం శాశ్వతంనైవ జానంతి మూఢానకార్యంవినా కారణం సంభవేద్వా
వయం తర్కయామోనుమానం ప్రమాణంత్వమేవాసి కర్తాస్య విశ్వస్య చేతి. 33
అజః సృష్టికర్తా ముకుందోవితాయం హరో నాశకృద్వైపురాణే ప్రసిద్ధః
నకిం త్వత్త్రపసూతాస్త్రయస్తే యుగాదౌ త్వమేవాసి సర్వస్య తే నైవ మాతా. 34
త్రిభి స్త్వం పురారాధితా దేవి దత్తాత్వయాశ క్తిరుగ్రా చ తేభ్యః సమగ్రా
త్వయా సంయుతాస్తే ప్రకుర్వంతి కామం జగత్పాలనోత్పత్తి సంహారమేవ. 35
తే కిం న మందమతయో యతయో విమూఢాస్త్వాం యేన విశ్వజననీం సముపాశ్రయంతి.
విద్యాం పరాం సకలకామఫలప్రదాంతాం ముక్తిప్రదాం విబుధ బృంద సువందితాంఘ్రిమ్‌. 36
యే వైష్ణవాః పాశుపతాశ్చ సౌరా దంబాస్త ఏవ ప్రతిభాంతి నూనమ్‌
ధ్యాంతి న త్వాం కమలాం చ లజ్జాం కాంతిం స్థితి కీర్తి మథాపి పుష్టిమ్‌. 37
'విశ్వేశ్వరీ! భక్తిగమ్యా! సచ్చిదానంద స్వరూపిణీ ! ప్రాణేశ్వరేశ్వరీ ! అశేషదుష్టదనుజమర్దినీ ! అమరానంద ప్రదాయినీ ! నీకు నమస్కారమమ్మా! ఆదిదేవీ! నీ యనంత నామరూపము లెవ్వడు నెఱుగజాలడు. సృష్టిసంహారాది కార్యములన్నిటిలో నీవు సర్వక్రియాశక్తి స్వరూపిణివి. సర్వేశ్వరీ ! స్మృతి-ధృతి-బుద్ధి-జర-తుష్టి-పుష్టి-కాంతి-శాంతి-విద్య-లక్ష్మి-గతి-కీర్తి-మేధ-విశ్వాదిబీజము-ఇవన్నియు నీవే అమ్మా! నీ వేయే దివ్యరూపములలో విబుధుల కార్యముల నిర్వహింతువో ఆ యాయా యద్భుత రూపములకు నమస్కరించుచున్నాము. నీవు శాంతి - క్షమ-యోగనిద్ర మున్నగు సర్వరూపములతో జీవులలో నివసింతువు. నీవు తొల్లి దేవతల మహోజ్జ్వల భవిష్యత్తునకై మదాంధుడగు మహిషాసురు నంతమొందించితి, ఆనాడు నీ యనుగ్రహభాగ్య మెల్ల సురలపట్ల నుండెను. నీవు దయామతల్లివని వేదములు నుద్ఘోషించుచున్నవి. తల్లి తన తనయుని గారాబముతో లాలించి పాలించి పెంచుననుటలో నచ్చెరువేమియునులేదు. నీవు నిఃల సురలకు సహాయ మొనర్చుదానవు. ఇపుడు తప్పక నీవు మా యెల్ల కార్యములు చక్కపఱచుము. విశ్వవంద్యా! నీ యనంత గుణరూపము లత్యద్భుతములు. మేము వాని నెఱుగజాలము. మేము నీ దయకు పాత్రులము. మా భయములు పాపుము. మమ్ము బ్రోవ నీవే సమర్థురాలవు. శత్రువులను పరిమార్చుటకు నీకు బాణములు - ముష్టిఘాతములు-శూలఖడ్గములు-శక్తిదండములు మున్నగువానితో పనిలేదు. నీవు లోకోపకారమునకు యుద్ధాదులొనర్తువు. అవి నీకు లీలావినోదమాత్రములే. ఈ జగము నశ్వరమని మూఢులకును తెలియును. కారణము లేక కార్యము జరుగదు. కాన నన్నిటికి నీవే మూలకారణము ప్రమాణము నని తలంతుము. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకర్తలుగా పురాణములందు ప్రఖ్యాతి వహించిరి. సృష్టికి మొదట త్రిమూర్తులను గన్నతల్లివి నీవే కదా! కనుక నీ విశ్వములకు జననివి నీవే. నీవు పూర్వము త్రిమూర్తులచే బూజింపబడితివి. వారికి పరిపూర్ణ దివ్యశక్తులు ప్రసాదించితివి. నీవు సృష్టి స్థితి సంహారవినోదవు. దేవవందితపాదకమలవు. సకల కామముక్తి ఫలదాయినివి, పరావిద్యవు. త్రిమూర్తులు నీ శక్తులనుగూడి తమ తమ పనులు చక్కగ నిర్వహించుచున్నారు. నిన్ను గొల్వనిచో యతులైనను మందమతులై మూఢులగుదురు. ఏకవు-లజ్జవు-కీర్తివి-పుష్టివి-కాంతివి-స్థితివి. నిన్ను ధ్యానింపని వైష్ణవులు-శైవులు-సౌరులు డాంబికులుగ నెన్నబడుదురు.
హరిహరా దిభి రప్యథ సేవతాత్వమి హ దేవవరై రసురై స్తథా.
భువి భజంతి న యోల్పధియో నరా జనని తే విధినా ఖలు వంచితాః. 38
జలధిజా పద పంకజ రంజనం జతురసేన కరోతి హరిః స్వయమ్‌
త్రినయనోపి ధరాధరజాంఘ్రి పంకజపరాగ నిషేవణతత్పరః. 39
కిమపరస్య నరస్య కథానకై స్తవ పదాబ్జయుగం న భజంతి కే
విగతరాగ గృహశ్చ దయాం క్షమాం కృతథియో మునయోపి భజంతి తే. 40
దేవి త్వదంఘ్రిభజనే న జనా రతా యే సంసారకూపపతితాః పతితాః కిలామీ
తే కుష్ఠ గుల్మ శిర ఆధియుతా భవంతి దారిద్య్రదైన్యసహితా రహితాః సుఖౌఘైః. 41
యే కాష్టభారవహనే యవసాపహారే కార్యేభవంతినిపుణాధనదారహీనాః
జానీమహే%ల్పమతిభిర్భవదంఘ్రిసేవా పూర్వేభ##వేజననితైర్నకృతాకదాపి. 42


జననీ! నీవు హరిహరాది దేవవరులచేత సేవింపబడుదువు. నిన్నీపుడమిపై కొంచెపు బుద్దివారు గొలువనోపరు. వారు నిజముగ విధివంచితులు. హరి స్వయముగ లక్ష్మియొక్క పదకమలములకు లత్తుకరంగు పూయును. శివుడును శివాచరణకమల రజము సేవింప గోరుకొనును. ఇక సామాన్యులగూర్చి చెప్పనేల? వీతరాగులు ధీమంతులు మునులు సైతము దయాక్షమాది సద్భావములతో నిన్నే సేవింతురు. కనుక లోకములందు నీ పదకమలములు సేవింపని వారెవరును లేరు. పారిజాత పరిమళములు విరజిమ్ము నీ చరణ కమలములకు పూల పూజ పచరింపని నరులు సంసారకూపనిపతితులు-పతితులు - కుష్ఠ గూల్మాది రోగ పీడితులు-దైన్య దారిద్ర సహితులు-సుఖరహితులు-నై యుందురు. తల్లీ! ఈ జన్మములో కట్టెలు గడ్డి గాదములు మోయుటలో నేర్పరులై - భార్య సంపదలు లేనివారె బుద్ధిహీనులై యున్నవారు గత జన్మములో నీ పదకమల సేవ చేయనివారని భావింతుము.'
అని యీ విధముగ దేవతలెల్లరును సంస్తుతింపగా మహాతిశయ లావణ్యయగు జగదంబ వేగిరమే కనికరముతో వారికి ప్రత్యక్షమయ్యెను.


దేవి స్తుమ స్త్వాం విశ్వేశి ప్రణతాః స్మ కృపార్ణవే | పాహి నః సర్వ దుఃఖేభ్యః సంవిగ్నా న్దైత్యతాపితాన్‌. 50
పురా త్వయా మహాదేవి నిహత్యాసురకంటకమ్‌ | మహిషం నో వరో దత్తః స్మర్తవ్యాహం యదాపది. 51
స్మరణా ద్దైత్యజాం పీడాం నావయిష్యా మ్యసంశయమ్‌ | తేన త్వం సంస్మృతా దేవి నూనమస్మాహభి రిత్యపి. 52
అద్య శుంభనిశుంభౌ ద్వావసురౌ ఘోరదర్శనౌ | ఉత్పన్నౌ విఘ్న కర్తారావహన్యౌ పురుషైః కిల. 53
రక్తబీజ శ్చ జలవాం శ్చండముండౌ తథా%సురౌ | ఏతై రన్యై శ్చ దేవానాం హృతం రాజ్యం మహాబలైః. 54
గతి రన్యా న చాస్మాకం త్వమేవాసి మహాబలే | కురు కార్యం సురాణాం వై దుఃఃతానాం సుమధ్యమే. 55
దేవాస్త్వదంఘ్రిభజనే నిరతాః సదైవ తే దానవైరతిబలై ర్విపదంసు గీతాః
తాన్దేని దుఃఖరహితా న్కురు భక్తి యుక్తా న్మాతస్త్వమేవ శరణం భవ దుఃఃతానామ్‌. 56
సకలభువనరక్షా దేవి కార్యా త్వయాద్య స్వకృతమితి విదిత్వా విశ్వమేతద్యుగాదౌ
జనని జగతి పీడాం దానవా దర్పయుక్తాః స్వబలమదసమేతా స్తే ప్రకుర్వంతి మాతః. 57


'దేవి! నీవు విశ్వేశ్వరివి. దయా సాగరవు. నీ కివే మా ప్రణా మాంజలులు. ఇవే మా స్తుతులు. మేము దైత్య పీడితులము. మాలో చింత మెఱమెఱలాడు చున్నది. మమ్ము దుఃఖములనుండి కాపాడు మమ్మా మహాదేవీ! తొల్లి నీవు లోక కంటకుడగు మహిషాసురుని వధించితివి. అపు డాపదలందు నన్ను స్మరింపుడని మా కభయ ప్రదాన మొనర్చితివి. నిన్ను స్మరించినంతనే దానవులవలని బాధలు తొలగింతు నంటివి. అందులకే మేమిపుడు నిన్ను స్మరించుచున్నాము. ఇపుడు శుంభ నిశుంభులను నిర్వురు ఘోరరాక్షసులు పుట్టి మా కార్యములకు విఘ్నము లొనర్చు చున్నారు. వారు పురుషులకు వధ్యులుగారు. రక్తబీజుడు-చండ ముండులు మహాబలవంతులు. వారు సురల రాజ్య మపహరించిరి. దేవదేవీ! మాకు నీవే దిక్కు. మా మొఱలాంలించి పాలించు మమ్మా! మేమాపదలలో జిక్కుకొంటిమి. మా కార్యము చక్కబెట్టుము. మాకు వేరే దిక్కెవ్వరునులేరు. అమరుల్లెవేళల నీ చరణ కమల సేవలో మగ్నులై యుందురు. ఐనను దైత్యులు వారి కాపదలు గల్గింతురు. అట్టి సురలు దుఃఃతులు-నీ యందలి నిశ్చల భక్తితత్పరులు. వారికి నీ కరావలంబ మొసగుము. వారిని దుఃఖరహితులుగ జేయుము. జననీ! విశ్వమంతయు నీచే సృజింపబడినది. అటులే యిపుడును విశ్వపరిరక్షణ నీ కవశ్య కర్తవ్యమగును.



శ్రీమద్దేవీ భాగవత పంచమ స్కంధమందు వేల్పులు శ్రీదేవిని సంస్మరించుట యను నిరువది రెండవ యధ్యాయము నుండి.