Saturday, May 9, 2020

శ్రీ మంగళ చండీదేవి స్తుతి

శ్రీ మంగళ చండీదేవి స్తుతి




ధ్యానము

దేవీంషోడశ వర్షీయాం శశ్వత్సు స్థిరవనామ్‌| బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్ప ద్మనిభాననామ్‌. 23
శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనామ్‌ | జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదామ్‌ 24
సంసారసాగరేఘోరే జ్యోతీరూపాం సదాభజే | ` 25

పదారు వత్సరముల దేవి - నిండైన జవ్వనము గలది - బింబాధర-సుదతి-శుద్ధ- శారద కమలమువంటి ముఖము గలది. శ్వేతచంపకమువంటి కాంతి గలది. నల్ల కలువలవంటి కన్నులు గలది. ఎల్లరికీ సకల సంపద లొసంగునది-జగముల తల్లి-సకలదాయిని-సంసార సాగరమందు జ్యోతిః స్వరూపిణి యగు దేవిని కొల్తును.

స్తోత్రము
మహాదేవ ఉవాచః రక్ష రక్ష జగన్మాత ర్దేవి మంగళచండికే | హారికే విపదాంరాశేర్హర్ష మంగళకారికే. 26
హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే | శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే. 27
మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే | సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. 28
పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే | పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్‌. 29
మంగళాధిష్ఠాతృ దేవి మంగళానం చ మంగళే | సంసార మంగళాధారేమోక్షమంగళదాయిని.
సారే చ మంగళాధారే పారే చ సర్వ కర్మణామ్‌ | ప్రతి మంగళ వారే చ పూజ్యే మంగళ సుఖప్రదే. 31


మహాదేవుడిట్లనెను:    జగన్మాతా ! మంగళదాయినీ ! ఆనందకారిణీ ఆపదలుపాపు తల్లీ ! దేవి మంగళ చండికా ! నన్ను బ్రోవుము బ్రోవుము- ఆనంద మంగళదాయినీ ! ఆనంద మంగళ ప్రవీణా ! శుభమంగళ పరాయణా ! శుభా! మంగళచండికా ! తల్లీ మంగళాదేవీ ! మంగళయోగ్యా ! సర్వమంగళమంగళా సాధుజనులకు శుభములొసగు జననీ! శుభ మంగళనిలయా ! మంగళవార పూజ్య! మంగళాభీష్ట దేవీ ! మనువంశమున జన్మించిన మంగళ రాజుచేత పూజలందుకొనిన తల్లీ! ఓహో మంగళాధిష్ఠాన దేవీ ! మంగళ మంగళా ! సంసార మంగళాధారిణి! ముక్తి మంగళదాయినీ!
మంగళకారిణీ ! మంగళాధారా ! సకల కర్మలకు పరాకాష్ఠా ! ప్రతి మంగళవారమున పూజనీయా ! మంగళసుఖప్రదా ! నీకు నమస్కారము నన్ను బ్రోవుము.

స్తోత్రేణానేన శంభు శ్చ స్తుత్వా మంగళ చండికామ్‌ | ప్రతి మంగళవారే చ పూజాం దత్త్వా గతః శివః 32
ప్రథమే పూజితా దేవీ శివేన సర్వ మంగళా | ద్వితీయే పూజితా సా చ మంగళేన గ్రహేణ చ. 33
తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ | చతుర్థే మంగళవారే సుందరీభిః ప్రపూజితా. 34
పంచమే మంగళాకాంక్షి నరైర్మంగళ చండికా | పూజితా ప్రతివిశ్వేషు విశ్వేశపూజితా సదా. 35
తతః సర్వత్ర సంపూజ్యా బభూవ పరమేశ్వరీ ! దేవైశ్చ మునిభిశ్చైవ మానవైర్మనుభిర్మునే. 36
దేవశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తన్మంగళం భవేత్తస్య న భేవేత్తదమంగళమ్‌ | వర్ధతే పుత్రపౌత్రైశ్చ మంగళం చ దినేదినే. 37

 అను స్తోత్రముతో శివుడు మంగళ చండికను స్తుతించి ప్రతి మంగళవారమును మంగళ చండికను శివుడు పూజించెను. మొట్టమొదట సర్వమంగళయగు చండికాదేవిని శివుడు పూజించెను. తర్వాత మంగళగ్రహము (కుజుడు) మండళచండికను పూజించెను. ఆ తర్వాత మంగళుడను రాజు భద్ర మంగళదేవి నర్చించెను. ఆ పిదప ప్రతి మంగళవారమున సుందర స్త్రీలు మంగళ నారాధించిరి. ఐదవసారి శుభముగోరు నరులచేత మంగళచండిక పూజింపబడెను. తర్వాత ప్రతి విశ్వమునందు శివపూజితయగు మంగళ పూజింపబడెను. మునీ ! అటు పిమ్మట మంగళ పరమేశ్వరి యెల్లెడల దేవ-ముని-మను-నరులచేత పూజింపబడెను. ఈ మంగళదేవిస్తోత్రము నిశ్చల మనస్సుతో వినువాడు శుభములు పడయును. అతని కమంగళము గలుగదు.

శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధము నారద నారాయణ సంవాదము నలువదేడవ యధ్యాయము నుండి.



------------------------

------------------------


------------------------


No comments:

Post a Comment