Monday, May 11, 2020

శ్రీ రాధ ధ్యానము-స్త్రోత్రము

శ్రీ రాధ ధ్యానము-స్త్రోత్రము





ధ్యానము
శ్వేతచంపక వర్ణాభాం శరదించు సమాననామ్‌. 
కోటిచంద్ర ప్రతీకాశాం శరదంభోజలోచనామ్‌ | బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుత నితంబినీమ్‌. 
కుందపంక్తి సమానాభ దంతపంక్తి విరాజితామ్‌ | క్షౌమాంబర పరీధానాం వహ్నిశుద్దాంశుకాన్వితమ్‌.
ఈషద్దాస్యప్రసన్నాస్యాం కురికుంభయుగస్తనీమ్‌ | సదా ద్వాదశవర్షీయాం రత్నభూషణభూషితామ్‌.
శృంగార సింధులహరీం భక్తానుగ్రహకాతరామ్‌ | మల్లికా మాలతీమాలా కేశపాశ విరాజితామ్‌.
సుకుమారాంగలతికాం రాసమండల మధ్యగామ్‌ | వరాభయకరాం శాంతాం శస్వత్సుస్థిర¸°వనామ్‌.
రత్నసింహాసనాసీనాం గోపీమండల నాయకమ్‌ | కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీమ్‌.

తెల్లని చంపక వర్ణము గలది శారద చంద్రునివంటి ముఖము గలది కోటిచంద్రులుగల మేను గలది శారద కమలముల బోలు కన్నులు గలది పండిన దొండపండువంటిమోవి గలది మొలనూలు గలది మొల్ల మొగ్గల వరుసలవలె వెల్గు జిమ్ము పలువరుసగలది దేవి. ఆమె తెల్లని దువ్వలువలు దాల్చి అగ్ని శుద్ధమైన మేలిముసుగు దాల్చియున్నది. లేత మొలకనవ్వులు విప్పారిన ముఖము గలది. రత్నభూషణభూషితయై నిత్యము పండ్రెం డేడుల వయసుతో నలరారు సౌందర్యలహరి ; భక్తనుగ్రహ పరాయణమల్లికా మాలతీ మాలల పరిమళములు గుబాళించు కేశపాశములు గలది. కుసుమకోమలి-లతాంగి-రాస మండల మధ్య వర్తిని. వరాభయ ముద్రలుకల కలములుగల శాంతమూర్తి. నిండారు పరువముతో విలసిల్లు తల్లి. రత్న సింహాసనాసీన- గోపీమండలనాయిక-వేదప్రబోధిత-పరమేశ్వరి. కృష్ణ ప్రాణాధిక ప్రియ.


స్తోత్రం

నమస్తే పరమేశాని రాసమండల వాసిని | రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే.
నమః సరస్వతీరూపే నమః సావిత్రి శంకరి | గంగా పద్మావతీరూపే షష్టిమంగళచలడికే. 
నమస్తే తులసీరూపే నమోలక్ష్మీ స్వరూపిణీ | నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణీ.
మూల ప్రకృతి రూపాం త్వాం భజామః కరుణార్ణవామ్‌| సంసారహగరా దస్మాదుద్ధరాంబ దయాంకురు.
ఇదంస్తోత్రం త్రిసంధ్యంయః పఠేద్రాధాంస్మరన్నరః | తస్యవై దుర్లభం కించిత్కదా చిన్నభవిష్యతి.
దేహాంతే చ వసేన్నిత్యం గోలోకే రాసమండలే | 


పరమేశాని ! రాసమండలవాసిని ! రాసేశ్వరి! కృష్ణ ప్రాణాధికప్రియా! నీకు నమస్కారములు. త్రైలోక్యజననీ ! కరుణాలయా! బ్రహ్మ విష్ణ్వాది దేవతలచే మనస్కరింబడు పదపద్మములుగల దేవి ! నమస్కారములు. సరస్వతి రూపిణీ ! సావిత్రి! శంకరీ!గంగ! పద్మావతి రూపా! షష్ఠీ మంగళచండికా ! నమస్కారములు. తులసీ ! లక్ష్మీ ! దుర్గాదేవీ ! సర్వస్వరూపిణీ ! నీకు నమస్కారములు తల్లీ! మూలప్రకృతి స్వరూపిణీ దేవీ! కరుణాలవాలా! మేము నిరంతరము నిన్నే కొలిచెదము ఘోర సంసార సాగరమునుండి సముద్ధరింపదగినదవే! దయ చూడుము ! 

శ్రీ శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు యేబదవ యధ్యాయము నుండి.

No comments:

Post a Comment